బీరు ప్రియుల అవసరాలను క్యాష్ చేసుకోవటానికి కొన్ని వైన్ షాపులు బరి తెగిస్తున్నాయి. కాలం చెల్లిన బీర్లను సైతం అమ్మేస్తున్నాయి. తాజాగా, కొందరు యవకులు కాలం చెల్లిన బీర్లను తాగి అస్వస్థతకు గురయ్యారు. ఈ సంఘటన..
మనల్ని ముప్ప తిప్పలు పెట్టే ఎండాకాలం రానే వచ్చింది. ఇంట్లోంచి బయటకు రావాలంటే ఒకటికి రెండు సార్లు ఆలోచించాల్సి ఉంటుంది. ఇక, ఎండాకాలంలో శీతల పానీయాలు తాగటం ఎక్కువయిపోతుంది. మందు తాగే అలవాటు ఉన్నవారు బీర్ల వైపు మొగ్గుచూపుతారు. రోజుకు ఒక బీరైనా తాగి తమ శరీరాన్ని కూల్ చేసుకుందామని భావించేవారు కూడా ఈ సమాజంలో ఉన్నారు. అయితే, ఈ ఎండాకాలంలో బీరు ప్రియుల అవసరాలను క్యాష్ చేసుకోవటానికి కొన్ని వైన్ షాపులు బరితెగిస్తున్నాయి. ప్రాణాలకు ప్రమాదం అని తెలిసినా కూడా కాలం చెల్లిపోయిన బీర్లను అమ్ముతున్నాయి. తాజాగా, ఓ షాపు కాలం చెల్లిపోయిన బీర్లను వినియోగదారులకు విక్రయించింది. అవి తాగిన కొందరు అస్వస్థతకు గురయ్యారు.
దీంతో అసలు విషయం బయటపడింది. ఈ సంఘటన తెలంగాణలోని సంగారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. సంగారెడ్డిలోని ఎల్లారం గ్రామానికి చెందిన కొందరు యువకులు బర్త్‌డే పార్టీ కోసం బీర్లు కొనడానికి సదాశివ పేటకు వచ్చారు. పట్టణంలోని ఓ వైన్ షాపులో 12 బడ్వైజర్ బీర్లు కొన్నారు. తర్వాత పార్టీ సందర్భంగా వాటిని ఓపెన్ చేసి తాగటం మొదలుపెట్టారు. కొన్ని బీర్లు ఖాళీ అయ్యాయి. కొద్ది సేపటి తర్వాత బీర్లు తాగిన ఇద్దరు వ్యక్తులకు వాంతులు అవ్వసాగాయి. ఎందుకలా జరుగుతోందని ఆలోచించగా బీర్లపైకి అనుమానం వెళ్లింది.
వాటిని పరిశీలించగా అసలు విషయం బయటపడింది. బీర్లు ఎక్స్‌పైర్ అయి ఉండటం వారు గుర్తించారు. వెంటనే ఎక్సైజ్ అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో షాపు వారు సదరు యువకుల్ని బెదిరించటానికి చూశారు. ఎక్సైజ్ సీఐ షాపు షాపు వారిని విచారించారు. తర్వాత జరిగిన పరిణామాల దృష్ట్యా పోలీసులు షాపుపై కేసు నమోదు చేశారు. నాలుగు కల్తీ బీర్లను స్వాధీనం చేసుకున్నారు. బిల్లులు ఇవ్వకుండా అమ్మకాలు చేస్తున్నట్లు గుర్తించారు. మరి, కాలం చెల్లిన బీర్లను అమ్మి బీరు ప్రియుల ప్రాణాల మీదకు తెస్తున్న ఇలాంటి సంఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.