నగరం మొత్తంలో చాలా మంది జాబ్ చేసే క్రమంలో చాలా దూరం ప్రయాణించాల్సి వస్తుంది. దీని కోసం కొందరు బైకుల్లో, కొందరు బస్సుల్లో, కొందరు మెట్రో రైలులో ప్రయాణిస్తుంటారు. అయితే అడ్వాన్స్ టెక్నాలజీతో నగరవాసులకు అందుబాటులోకి వచ్చిన మెట్రో ట్రైన్ చాలా తక్కువ కాలంలో ప్రజల ఆదరణ పొందింది.
దేశం నలుమూలల నుండి హైదరాబాద్ నగరానికి బతుకుదెరువు కోసం చాలా మంది వస్తారు. ఇక్కడ జీవనం సాగించే క్రమంలో ఉద్యోగాలు చేసుకుంటూ పలు ప్రదేశాల్లో పర్యటిస్తారు. నగరం మొత్తంలో చాలా మంది జాబ్ చేసే క్రమంలో చాలా దూరం ప్రయాణించాల్సి వస్తుంది. దీని కోసం కొందరు బైకుల్లో, కొందరు బస్సుల్లో, కొందరు మెట్రో రైలులో ప్రయాణిస్తుంటారు. అయితే అడ్వాన్స్ టెక్నాలజీతో నగరవాసులకు అందుబాటులోకి వచ్చిన మెట్రో ట్రైన్ చాలా తక్కువ కాలంలో ప్రజల ఆదరణ పొందింది. కొన్ని సమయాల్లో ప్రయాణికులను రికార్డ్ స్థాయిలో వారి గమ్యస్థానాలకు చేరవేస్తుంది. చాలా సౌకర్యవంతంగా, సురక్షితంగా ప్రజలకు రవాణా వ్యవస్థగా మెట్రో రైలు సేవలను కొనసాగిస్తుంది.
అయితే సాధారణంగా మార్కెటింగ్ ప్రమోషన్స్ కోసం ఏవైనా సంస్థలు ఇతర సంస్థలతో కలిసి పనిచేస్తాయి. వాటికి అనుగుణంగా వివరాలను ప్రజలకు ప్రకటనల ద్వారా తెలియజేస్తాయి. కానీ ఇప్పుడు రెండు మెట్రో స్టేషన్లనే ఓ ప్రముఖ సంస్థ ఒప్పందం కుదుర్చుకుంది. ఆ సంస్థ పేరుతో బ్రాండింగ్ హక్కులను కల్పిస్తుంది. అయితే ఆ రెండు స్టేషన్ల పేర్లు స్వల్పంగా మారనున్నాయి. లాక్‌డౌన్‌లో సమయంలో మెట్రోరైలు నష్టాలను ఎదుర్కొంది. నష్టాలనుంచి కోలుకోవడానికి మెట్రో ప్రయాణికులకు ఎప్పటికప్పుడు ఆఫర్లను కూడా ప్రకటిస్తుంది. మెట్రోరైలుపై ప్రకటనలు ఇస్తూ మెట్రో ఆదాయవనరుగా కూడా మారింది. ఈ క్రమంలో మెట్రో రైలు ప్రాధాన్యతను ప్రజలకు తెలియజేయుటకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ముందుకు వచ్చింది.
హైదరాబాద్ మెట్రోతో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒప్పందం కుదుర్చుకుంది. మాదాపూర్‌లోని హైటెక్‌సిటీ, బేగంపేట స్టేషన్ల పేర్లు, బ్రాండింగ్ హక్కులను ఎస్‌బీఐ తీసుకుంది. దీంతో హైటెక్‌సిటీ, బేగంపేట స్టేషన్ల పేర్ల ముందు ఎస్‌బీఐ చేర్చారు. హైటెక్‌సిటీ మెట్రో స్టేషన్‌లో ప్లాస్టిక్ రీసైక్లింగ్ పరికరాన్ని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో హైటెక్‌సిటీ మెట్రో స్టేషన్ ను ఎస్‌బీఐ ఛైర్మన్ దినేష్ కుమార్ ఖారా సందర్శించి మాట్లాడుతూ.. హైదరాబాద్ మెట్రో ట్రైన్ ప్రత్యేకతను ప్రజలకు వివరిస్తామన్నారు. హైదరాబాద్ మెట్రోతో భాగస్వామ్యం అవడం చాలా సంతోషంగా ఉందని, హైటెక్‌సిటీ, బేగంపేట మెట్రో స్టేషన్ల పేరు, బ్రాండింగ్ హక్కులను ఎస్‌బీఐ దక్కించుకుందని తెలిపారు. హైటెక్‌సిటీ మెట్రోస్టేషన్ లో ప్రయాణికులకు అవసరమైన సదుపాయాలను కల్పిస్తామని చెప్పారు.