తాజాగా వెల్లడైన ప్రీతి టాక్సికాలజీ రిపోర్టులో నమ్మలేని నిజాలు బయటపడ్డాయి. ఆమె బాడీలో ఎలాంటి విషపదార్థాలు లేవని తేలింది. దీంతో ఈ కేసును పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసే అవకాశాలు కూడా లేకపోలేదని తెలుస్తోంది. తాజాగా వెల్లడైన ప్రీతి టాక్సికాలజీ రిపోర్టులో నమ్మలేని నిజాలు బయటపడ్డాయి. ఆమె బాడీలో ఎలాంటి విషపదార్థాలు లేవని తేలింది. దీంతో ఈ కేసును పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసే అవకాశాలు కూడా లేకపోలేదని తెలుస్తోంది.
మెడికో ప్రీతి ఘటన తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన విషయం తెలిసిందే. సీనియర్ విద్యార్థి సైఫ్ వేధింపుల కారణంగానే ప్రీతి హానికరమైన ఇంజక్షన్ తీసుకుని ఆత్మహత్యకు పాల్పడిందని పోలీసులు తెలిపారు. అయితే ఈ కేసులో భాగంగా పోలీసులు నిందితుడు సైఫ్ ని అదుపులోకి తీసుకుని అన్ని కోణాల్లో విచారిస్తున్నారు. అంతేకాకుండా జూనియర్ డాక్టర్లను సైతం విచారిస్తూ అసలు ఏం జరిగిందనే నిజాలను రాబట్టేందుకు పోలీసులు అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదిలా ఉంటే తాజాగా వెల్లడైన టాక్సికాలజీ రిపోర్టులో నమ్మలేని నిజాలు ఉండడంతో ఈ కేసు ఊహించని మలుపుకు తిరిగింది.
ఈ క్రమంలోనే టాక్సికాలజీ రిపోర్టు ఆధారంగా తాజాగా కీలక ప్రకటన చేశారు వరంగల్ సీపీ రంగనాథన్. అంతేకాకుండా పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసే అవకాశం కూడా ఉన్నట్టు సమాచారం. ప్రీతి కేసులో టాక్సికాలజీ రిపోర్టును పరిశీలించామని, కానీ.., హానికరమైన ఇంజక్షన్ తీసుకున్నట్లు ప్రీతి బాడీలో ఎక్కడా కనిపించలేదని అన్నారు. ఆమె గుండె, కాలేయం రక్తంతో పాటు పలు అవయవాల్లో ఎలాంటి విషపదార్థాలు లేవన్నట్లుగా టాక్సికాలజీ రిపోర్ట్ ఉందని సీపీ రంనాథన్ తెలిపారు.
ఇక ఈ రిపోర్ట్ ను ఆధారంగా తీసుకుని ఈ కేసును ఫైనల్ చేయలేమని అన్నారు సీపీ రంగనాథన్. అంతేకాకుండా ఈ కేసులో రాజకీయ కోణం కూడా దాగి ఉందని, రెండు రోజుల్లోపూర్తి వివరాలు వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు. ఇదిలా ఉంటే తాజాగా ప్రీతి కుటుంబ సభ్యులు డీజీపీ ఆఫీసుకు వచ్చి అడిషనల్ డీజీని కలిశారు. ఈ సందర్భంగా వాళ్లు మీడియాతో మాట్లాడుతూ.. ప్రీతి పోస్ట్ మార్టం రిపోర్ట్ ను మార్చే ప్రయత్నం చేస్తున్నారని, ఇది ఖచ్చితంగా హత్యేనని, మా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయని అన్నారు. అయితే రోజుకొక మలుపు తీసుకుంటున్న ప్రీతి కేసును పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసే అవకాశం కూడా ఉన్నట్లుగా తెలుస్తోంది.