హైదరాబాద్ లోని నార్సింగి శ్రీ చైతన్య కాలేజీలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న సాత్విక్ అనే విద్యార్థి కొన్ని రోజుల క్రితం ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఘటనపై నిపుణుల విచారణ కమిటీ నివేదికను పరిశీలించిన తెలంగాణ ఇంటర్ బోర్డ్ కీలక నిర్ణయం తీసుకుంది.
హైదరాబాద్ లోని నార్సింగి శ్రీ చైతన్య కాలేజీలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న సాత్విక్ అనే విద్యార్థి కొన్ని రోజుల క్రితం ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. కాలేజీలో లెక్చరర్స్ పెట్టిన ఒత్తిడి కారణంగాణే సాత్విక్ ఉరి వేసుకున్నాడు అని తోటి విద్యార్థులు ఆరోపించారు. దాంతో సాత్విక్ మృతిపై స్పందించిన ప్రభుత్వం.. సమగ్ర విచారణ చేపట్టాలని ఆదేశించింది.ఈ క్రమంలోనే ఇంటర్ బోర్డ్ ఎంక్వైరీ కమిటీని ఏర్పాటు చేసింది. పలు కోణాల్లో విచారించిన నిపుణుల కమిటి. నివేదికను తెలంగాణ ఇంటర్ బోర్డుకు సమర్పించింది. నివేదికను పరిశీలించిన తర్వాత తెలంగాణ ఇంటర్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది.
నార్సింగి శ్రీ చైతన్య కాలేజ్ విద్యార్థి సాత్విక్ ఆత్మహత్య రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఇక తన ఆత్మహత్యకు కారణం వీరే అని సూసైడ్ నోట్ లో సాత్విక్ కొన్నిపేర్లను రాసుకొచ్చాడు. ఇప్పటికే వారిని పోలీసులు అరెస్ట్ చేయగా.. ఈ ఘటనపై సమగ్ర విచారణ కోసం నిపుణుల కమిటీని ఏర్పాటు చేశారు.ఈ కమిటీలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. అసలు సాత్విక్ ఆత్మహత్య చేసుకున్న కాలేజ్ లో అతడికి అడ్మిషన్ లేదని, ఒక కాలేజ్ లో అడ్మిషన్ ఇచ్చి మరో కాలేజ్ లో క్లాస్ లు చెబుతున్నారని నివేదికలో వెల్లడైంది. ఇక తాజాగా ఈ నివేదికను తెలంగాణ ఇంటర్ బోర్డ్ కు సమర్పించింది నిపుణుల కమిటీ. నివేదికను పరిశీలించిన తెలంగాణ ఇంటర్ బోర్డ్ కీలక నిర్ణయం తీసుకుంది. నార్సింగి శ్రీ చైతన్య కాలేజ్ పర్మిషన్ రద్దు చేస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. దాంతో పాటుగా వచ్చే ఏడాది అడ్మిషన్లను కూడా రద్దు చేస్తూ.. ఆదేశాలు జారీ చేసింది. సాత్విక్ ఘటనపై ఇంటర్ బోర్డుకు శ్రీ చైతన్య యాజమాన్యం క్షమాపణలు చెప్పింది.