తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన పథకం తెలంగాణకు హరిత హారం. ఈ పథకంలో భాగంగా రాష్ట్రమంతట చెట్లను పెంచే కార్యక్రామానికి ముఖ్యమంత్రి కేసీఆర్ శ్రీకారం చుట్టారు. అయితే ఈ ఏడాది 7 వ హరితహారంలో భాగంగా ఇప్పటికి 20 కోట్ల మొక్కలు నాటినట్లు ఇటీవల ప్రభుత్వం వర్గాలు వెల్లడించాయి. ఇదే పథకాన్ని గ్రామీణ ప్రాంతాల్లో స్థానిక అధికారులు, గ్రామ సర్పంచులు బాధ్యత తీసుకున్నారు.
ఇక ఇటీవల సూర్యపేట జిల్లాలోని హరితహారం చెట్టు కొమ్మలు నరికినందుకు గాను మున్సిపల్ కమిషనర్ జరిమానా విధించారు. తాజాగా జరిగిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంమవుతోంది. ఇక విషయం ఏంటంటే..? జనగామ ప్రాంతంలోని ఓ వ్యక్తి షాప్ కు అడ్డంగా ఉన్నాయని హరిత హారంలో భాగంగా నాటిన చెట్టు కొమ్మలు నరికాడు. దీంతో ఈ విషయం మెల్లగా మున్సిపల్ కమిషనర్ వరకూ వెళ్లింది. ఇక వెంటనే స్పందించిన కమిషనర్ పి. రామాంజుల రెడ్డి ఆగ్రహంతో ఊగిపోయారు. చెట్టు కొమ్మలు నరికినందుకు గాను ఆ షాపు యజమానికి మున్సిపల్ కమిషనర్ రూ.5వేలు జరిమానా విధించారు. దీంతో మరెవరైన ఇలాంటి చర్యలకు పాల్పడితే వారికి జరిమానా విధిస్తామని అధికారులు హెచ్చరించారు.