హైదరాబాద్‌లోని మియాపూర్ పరిధిలో గల ఓ హోటల్‌లో మెడికో స్టూడెంట్ డెత్ కేసు ఇప్పుడు తీవ్ర కలకలం రేపుతోంది. ఉన్నత చదువులు చదువుతూ ఎంతో బ్రైట్ ఫ్యూచర్ ఉన్న ఒక పీజీ మెడికల్ స్టూడెంట్.. హోటల్ రూమ్‌లో శవమై తేలడం వెనుక అసలు ఏం జరిగింది? సెప్టెంబర్ 30న హైదరాబాద్‌కి వచ్చిన ఈ యువతి సడన్‌గా మిస్ అవ్వడం, ఆ తర్వాత లొకేషన్ ట్రాక్ చేస్తే షాకింగ్ నిజాలు వెలుగులోకి రావడం ఇప్పుడు సంచలనంగా మారింది. ఆ పీజీ స్టూడెంట్ ఎవరు? హోటల్ రూమ్‌లో అసలు ఏం జరిగింది..?
మృతి చెందిన యువతిని సంగారెడ్డి జిల్లాకు చెందిన కోమటి సృజనగా ఐడెంటిఫై చేశారు పోలీసులు. సృజన వయసు 27 సంవత్సరాలు. ఆమె ప్రస్తుతం హనుమకొండలోని ఒక మెడికల్ కాలేజీలో ‘పీజీ పీడియాట్రిక్స్’ ఫస్ట్ ఇయర్ చదువుతోంది. అయితే ఏడేళ్ల క్రితం సృజనకు ఇన్‌స్టాగ్రామ్ ద్వారా రవి కుమార్ అనే యువకుడు పరిచయమైనట్లుగా తెలుస్తోంది. కొంతకాలం క్రితం సృజన వద్ద బంగారు గొలుసు తీసుకున్న రవికుమార్.. నీ గొలుసు తిరిగి ఇస్తాను రమ్మని సృజనను హైదరాబాద్ కు పిలిచాడు. ఇక ఈ నెల 29వ తేదీన హైదరాబాద్ మియాపూర్‌లోని ఓ హోటల్లో గది అద్దెకు తీసుకున్నారు. దీంతో రవికుమార్ వద్దకు వెళ్లిన సృజన రెండు రోజులైనా తిరిగి రాకపోవడం, ఫోన్ స్విచ్ ఆఫ్ అవ్వడంతో ఆమె ఫ్యామిలీ మెంబర్స్ తీవ్ర ఆందోళనకు గురయ్యారు. హుటాహుటిన ఆమె తండ్రి పోలీసులను ఆశ్రయించి మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చారు.”
కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రాథమిక విచారణ చేపట్టి, సృజన మొబైల్ ఫోన్ లొకేషన్‌ను ట్రాక్ చేయడం స్టార్ట్ చేశారు. మొబైల్ నెట్‌వర్క్ సిగ్నల్స్ ఆధారంగా ఆమె మియాపూర్‌లోని ఒక హోటల్‌లో ఉన్నట్లు కన్ఫర్మ్ చేసుకున్నారు. వెంటనే పోలీసులు హోటల్ రూమ్‌కు చేరుకుని తలుపులు తెరిచి చూడగా.. రూమ్‌లో సృజన బాడీ తీవ్రంగా డీకంపోజ్ అయి ఉన్న స్థితిలో పడి ఉంది. ఆమె అప్పటికే చనిపోయి కొన్ని రోజులు కావడంతో మృతదేహం కుళ్ళిపోయి కనిపించింది.”

స్పాట్‌లోనే పంచనామా నిర్వహించిన పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం హాస్పిటల్‌కు తరలించారు. పోస్టుమార్టం ప్రాసెస్ పూర్తయిన తర్వాత డెడ్‌బాడీని కుటుంబసభ్యులకు అప్పగించారు. అయితే ఈ ఘటన వెనుక రవికుమార్ అనే వ్యక్తి ప్రమేయం ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. సృజన తండ్రి ఇచ్చిన కంప్లైంట్ మేరకు పోలీసులు రవికుమార్‌పై వివిధ సెక్షన్ల కింద కేసు రిజిస్టర్ చేశారు.”
ప్రస్తుతం ఈ కేసులో నిందితుడిగా ఉన్న రవికుమార్ కోసం ప్రత్యేక పోలీస్ టీమ్స్ తీవ్రంగా సెర్చ్ చేస్తున్నాయి. అసలు ఇది ఆత్మహత్య లేక ప్లాన్డ్ మర్డరా? హోటల్ రూమ్‌కు సృజనతో పాటు రవికుమార్ కూడా వచ్చాడా? అక్కడ అసలు ఏం జరిగింది అనే విషయాలు రవికుమార్ దొరికితే గానీ క్లారిటీ వచ్చే ఛాన్స్ లేదు. మియాపూర్ పోలీసులు హోటల్ లోని సిసిటీవీ ఫుటేజ్‌ను కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు.
