టికెట్లు తక్కువగా అమ్మారంటూ ఆర్టీసీ అధికారులు బాధ్యులైన కండక్టర్ల ఫొటోలతో ఫెక్సీ ఏర్పాటు చేశారు. ఇదే ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
తాజాగా కండక్టర్లు పరువు తీశారు ఆర్టీసీ అధికారులు. టికెట్లు తక్కువగా అమ్మారంటూ ఏకంగా వారి ఫొటోలతో ఫ్లెక్సీ ఏర్పాటు చేసి బహిరంగంగా తగిలించారు. ఈ ఫ్లెక్సీ చూసిన కార్మికులు, ప్రజా సంఘాల నేతలు కోపంతో ఊగిపోయారు. ఇంత దానికే అధికారులు ఉద్యోగులను కించపరిచేలా చేస్తూ పరువు తీస్తున్నారని వాపోయారు. ఈ అంశంపై ప్రజా సంఘాల నుంచే కాకుండా కార్మిక సంఘాల నుంచి కూడా మద్దతు వచ్చింది. దీంతో అధికారులు వెంటనే స్పందించి ఆ ఫ్లెక్సీని తొలగించారు. అసలేం జరిగిందంటే?
మేడ్చల్ డిపోకు చెందిన 15 మంది కండక్టర్లు ట్రావెల్ యూజ్ యూ లైక్ (TAYAL) డే పాస్ టికెట్లు తక్కువగా అమ్మారంటూ ఆర్టీసీ అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంతే కాకుండా ఆ 15 మంది కండక్టర్ల ఫొటోతో పాటు వారి ఐడిని జత చేస్తూ ఓ ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. ఇక అదే ఫ్లెక్సీని డిపో ముందు తగిలించారు. అయితే, ఈ ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో కాస్త వైరల్ గా మారింది. ఈ ఫ్లెక్సీపై కండక్టర్లు స్పందిస్తూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆర్టీసీ నష్టాలకు మమ్మల్ని బాధ్యులను చేయడం కరెక్ట్ కాదని, ప్రభుత్వం నిధులు ఇవ్వకపోవడమే ప్రధాన కారణమని కండక్టర్లు వాపోయారు. ఇలా అన్యాయంగా మా పరువు తీయడం సమంజసం కాదని, ఆర్టీసీ అధికారుల వ్యవహారాల వల్లె ఎంతో మంది ఉద్యోగులు, కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని కార్మిక సంఘాలు నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో ఆర్టీసీ అధికారులు వెంటనే స్పందించి ఆ ఫ్లెక్సీని అక్కడి నుంచి తొలగించారు. కానీ, ఇదే ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలోకాస్త వైరల్ గా మారింది. టికెట్లు తక్కువగా అమ్మారంటూ ఫ్లెక్సీ ఏర్పాటు చేసిన ఆర్ఠీసీ అధికారుల తీరుపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.