కిరాక్ ఆర్పీ గురించి తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. జబర్దస్త్ ద్వారా ఒక కమెడియన్ గా ఎదిగాడు. నాగబాబు జబర్దస్త్ వీడిన సమయంలో ఆర్పీ కూడా బయటకు వచ్చేశాడు. తర్వాత అదిరిదిలో కొన్నాళ్లు చేశాడు. ఇప్పుడు కిరాక్ ఆర్పీ కామెడీ షోలు కాకుండా సొంత వ్యాపారం ప్రారంభించిన విషయం తెలిసిందే. నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు పేరిట కూకట్ పల్లిలో ఓ కర్రీ పాయింట్ ఓపెన్ చేశాడు. దానికి వచ్చిన రెస్పాన్స్ చూసి అతనే షాకయ్యాడు. అతని కర్రీ పాయింట్ విపరీతమైన తాకిడి పెరిగింది. తాకిడి తట్టుకోలేక ఆర్పీ కొన్నిరోజులు చేపల పులుసు పాయింట్ మూసేశాడు కూడా.
కిరాక్ ఆర్పీ ఓపెన్ చేసిన కొన్నిరోజులకే కర్రీ పాయింట్ క్లోజ్ చేశాడు. అంతా దానిపై పుకార్లు కూడా పుట్టించారు. ఆర్పీ వ్యాపారం మానేశాడు, దుకాణం మూసేశాడని చెప్పుకొచ్చారు. అయితే అలాంటి మాటలను నమ్మొద్దని ఆర్పీ క్లారిటీ ఇచ్చాడు. తాను మధ్యలో షాప్ మూసేసిన విషయం నిజమేనన్నాడు. అయితే నెల్లూరు చేపల పులుసు కోసం ఎగబడుతున్న జనాన్ని చూసే అతను షాప్ మూసేసినట్లు చెప్పాడు. అంత మందికి సప్లై చేయలేనని తెలిసి కర్రీ పాయింట్ ని తాత్కాలికంగా క్లోజ్ చేశాడు.
తర్వాత నెల్లూరుకు వెళ్లి.. తర్వాత నెల్లూరు వెళ్లి చేపల పులుసు వండే ఆడవాళ్ల కోసం వేట మొదలు పెట్టాడు. అందుకు ఆడిషన్స్ కూడా నిర్వహించాడు. కొందరిని ఎంపిక చేసినట్లు చెప్పాడు. వారికి హైదరాబాద్ లో సకల సౌకర్యాలు కల్పిస్తానని హామీ కూడా ఇచ్చాడు. ఇంక నెల్లూరు చేపల పులుసు ప్రారంభించి నెల రోజులు అయిన సందర్భంగా కిరాక్ ఆర్పీ తనకు కాబోయే భార్య, తన స్టాఫ్ తో కలిసి కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నాడు. ఈ సందర్భంగానే ఈ విషయాలన్నీ వెల్లడించాడు. షాప్ తిరిగి ఓపెన్ చేసినట్లు చెప్పుకొచ్చాడు.
కానీ, పండుగ సందర్భంగా మాత్రం తమ కర్రీ పాయింట్ క్లోజ్ చేస్తున్నట్లు చెప్పుకొచ్చాడు. అంటే సంక్రాంతి తర్వాతి నుంచి రోజూ నెల్లూరు చేపల పులుసు అందించేందుకు అందుబాటులో ఉంటామని చెప్పుకొచ్చాడు. కొత్త స్టాఫ్ ని తీసుకున్నట్లు సప్లై కూడా పెంచనున్నట్లు క్లారటీ ఇచ్చాడు. ఇదే తనకి బాగా నచ్చిన పని అని.. దీనిని వదిలి ఎక్కడకీ పోనంటూ వ్యాఖ్యానించాడు. రీఓపెనింగ్ తర్వాత నెల్లూరు చేపల పులుసు మెనూలోకి మరో రెండు, మూడు కొత్త డిష్ లను కూడా చేర్చనున్నట్లు తెలిపాడు.