హైదరాబాద్ లో ఎప్పుడూ కూడా ఎంతో ప్రత్యేకంగా నిలిచే ఖైరతాబాద్ గణేశ్ విగ్రహ నమూనా సోమవారం విడుదల అయింది. నేడు పాల్గొన్న ఖైరతాబాద్ ఉత్సవ కమిటీ నమూనా చిత్రాన్ని తాజాగా విడుదల చేశారు. అయితే మొట్టమొదటి సారిగా ఖైరతాబాద్ గణేశుడి విగ్రహాన్ని మట్టితో తయారు చేయనున్నామని ఉత్సవ కమిటీ తెలిపింది. మట్టి గణపతుల వినియోగాన్ని ప్రోత్సహించాలన్న ప్రభుత్వ పిలుపుతోనే ఈ సారి మట్టి వినాయకుడి ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నట్లు ఉత్సవ కమిటీ తెలిపింది.
ఇది కూడా చదవండి: నన్ను చదివించండి సర్.. బాలుడి కన్నీళ్లు చూసి చలించిపోయిన మంత్రి శ్రీనివాస్ గౌడ్
ఇక 50 అడుగులతో పంచముఖ లక్ష్మీ గణపతి రూపంలో ఖైరతాబాద్ వినాయకుడు ఈ సారి దర్శనమివ్వనున్నాడు. ఎడమ వైపు త్రిశక్తి మహా గాయత్రి, కుడి వైపు సుబ్రహ్మణ్యస్వామి రూపంతో వినాయకుడు నిమజ్జనానికి తరలనున్నాడు. ఇక హైదరాబాద్ లో ప్రత్యేకంగా నిలిచే ఖైరతాబాద్ వినాయకుడిని దర్శించుకునేందుకు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల నుంచి ప్రతీ ఏటా లక్షల్లో భక్తులు వస్తుంటారు. అలా వచ్చే భక్తుల కోసం ఈ సారి కూడా పత్యేక ఏర్పాట్లు చేయనున్నామని ఖైరతాబాద్ ఉత్సవ కమిటీ తెలిపింది. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.