మన సమాజంలో హిజ్రాలను హీనంగా చూస్తుంటారు. వారి గురించి హేళనగా మాట్లాడటం, వెక్కిరించడం వంటివి చేస్తూంటారు. తల్లిదండ్రులు కూడా వారిని వదిలించుకుంటూనే మంచిదని భావిస్తారు. ఇంటి నుంచి వెలివేస్తారు. వారిపై సమాజంలో పాతుకుపోయిన చిన్నచూపు కారణంగా ఎవరు వారిని దగ్గరకు రానివ్వరు. ఫలితంగా చదువు, ఉద్యోగం వంటి అవకాశాలు లభించవు. దాంతో భిక్షాటననే జీవనోపాధిగా చేసుకుని బతుకుతుంటారు. అయితే సమాజంలో వారి పట్ల అందరూ ఇలాంటి చిన్నచూపే కలిగి ఉంటారా అంటే కాదు. కొందరు వారితో స్నేహం కూడా చేస్తారు. ఈ కోవకు చెందిన సంఘటన ఒకటి తాజాగా వెలుగు చూసింది. ఓ యువకుడి హిజ్రాతో ప్రేమలో పడటమే కాక.. తల్లిదండ్రులను ఒప్పించి మరీ వివాహం చేసుకుని పదుగురికి ఆదర్శంగా నిలిచాడు. ఈ ఆదర్శ వివాహం ఎక్కడ జరిగింది వంటి వివరాలు..
ఇది కూడా చదవండి: కాంగ్రెస్ నేత ఇంట వివాహ విందు.. 1200 మందికి అస్వస్థత
జయశంకర్ భూపాలపల్లికి చెందిన రూపేశ్ అనే యువకుడికి, ఆళ్లపల్లి మండలం అనంతోగు గ్రామానికి చెందిన హిజ్రా అఖిలకు మూడేళ్ల క్రితం పరియం ఏర్పడింది. అది కాస్త ప్రేమగా మారింది. ఇద్దరూ ఒకరిని విడిచి మరొకరు ఉండలేని స్థితికి చేరుకున్నారు. దీంతో ఇల్లెందులోని స్టేషన్ బస్తీలో ఓ ఇంటిని అద్దెకు తీసుకుని మూడు నెలలుగా రహస్యంగా సహజీవనం చేస్తున్నారు. వీరి గురించి తెలిసి చుట్టూపక్కల వాళ్లు ఎంతలా అవమానించినా.. వారిద్దరు ఒకరినొకరు విడిచిపెట్టలేదు.
ఇది కూడా చదవండి: భర్తను సమానంగా షేర్ చేసుకుంటాం అంటున్న ముగ్గురు అక్కాచెల్లెళ్లు..
తల్లిదండ్రులకు భయపడి ఇలా దొంగచాటుగా కలిసి ఉండటం కన్నా.. వారిని ఒప్పించి పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్న రూపేశ్.. తన ప్రేమ విషయం తల్లిదండ్రులకు తెలిపాడు. కానీ వారు అందుకు అంగీకరించలేదు. హిజ్రాను కోడలిగా అంగీకరించలేమని.. అలా చేస్తే సమాజంలో తమ పరువు పోతుందని.. అవమానాలు ఎదుర్కొవాల్సి వస్తుందని.. ప్రేమను వదులుకోవ్సాలిందిగా సూచించారు. కానీ రూపేశ్.. తన పంతం వదులుకోలేదు. మూడు నెలలు ప్రయత్నించి.. తల్లిదండ్రులను ఒప్పించి.. బంధుమిత్రుల సమక్షంలో.. అంగరంగ వైభవంగా అఖిలను వివాహం చేసుకున్నాడు. శుక్రవారం వీరి వివాహం జరిగింది. జీవితాంతం కలిసిమెలసి ఉంటూ.. మిగతావారికి ఆదర్శంగా నిలుస్తామంటున్నారు. రూపేశ్ తీసుకున్న నిర్ణయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.