కనిపించని కరోనా వైరస్ యావత్ ప్రపంచాన్ని వణికిస్తూ చుక్కలు చూపిస్తోంది. కరోనా దాటికి ఇప్పటికి ఎంతో మంది మరణించారు. అయితే కోవీషీల్డ్, కోవాగ్జిన్ వంటి వ్యాక్సిన్ లు ప్రజలకు అందుబాటులోకి రావడంతో వ్యాక్సిన్ తీసుకోవడానికి చాలా మంది ఉత్సహం చూపిస్తున్నారు. ఇదిలా ఉంటే థర్డ్ వేవ్ దూసుకొస్తున్నా.. ఇప్పటికీ అనేక మంది వ్యాక్సిన్ తీసుకోకుండా జీవితంపై భద్రత లేకుండా వ్యవహరిస్తున్నారు. దీంతో వ్యాక్సిన్ తీసుకోవడంపై ప్రభుత్వాలు, అనేక స్వచ్చంద సంస్థలు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి.
కానీ ఇవేం పట్టవన్నట్లుగా చాలా మంది ఈ అంశాన్ని పెడ చెవిన పెడుతున్నారు. ఇక మరో విషయం ఏంటంటే? దేశంలోని కొన్ని కంపెనీలు వ్యాక్సిన్ తీసుకోని ఉద్యోగులకు జీతం ఇవ్వమంటూ చెబుతున్నాయట. ఇక తాజాగా తెలంగాణ రాష్ట్ర సహకార అపెక్స్ బ్యాంక్ సైతం ఇదే దారిలో వెళ్తున్నట్లు తెలుస్తోంది. కాగా వ్యాక్సిన్ తీసుకోని ఉద్యోగులకు బ్యాంక్ జీతం ఇవ్వమంటూ తేల్చి చెప్పింది. ఆ దిశగా సర్కూలర్ కూడా జారీ చేయడం విశేషం. ఉద్యోగులు ఏదైన కారణం చేత వ్యాక్సిన్ తీసుకోకపోతే అందుకు తగ్గ కారణాలు కూడా వైద్యుల నుంచి ధ్రువీకరణ పత్రాలు చూపించాలంటూ బ్యాంక్ ఎండీ మురళీధర్ చెప్పారు. ఇలాంటి వారి వల్ల మిగత వారికి కరోనా సోకే ప్రమాదముందని తెలిపారు. బ్యాంకు తాజా ప్రకటనతో ఉద్యోగుల షాక్ కు గురవుతున్నారు. ఇక వ్యాక్సిన్ తీసుకోకుంటే జీతం ఇవ్వమంటున్న బ్యాంక్ నిర్ణయంపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.