విశాఖపట్నం-హైదరాబాద్ మధ్య నడిచే గోదావరి ఎక్స్‌ప్రెస్ బుధవారం తెల్లవారు జామున పట్టాలు తప్పింది. అయితే ఈ ఘటనలో ప్రయాణికులు ఎవరికి ఏం జరగలేదు.
విశాఖపట్నం నుంచి హైదరాబాద్ డెక్కన్ మధ్య నడిచే గోదావరి సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలుకు త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. బీబీ నగర్ సమీపంలో గోదావరి ఎక్స్‌ప్రెస్ పట్టాలు తప్పింది. బుధవారం అనగా ఫిబ్రవరి 15న తెల్లవారుఝామున ఈ సంఘటన చోటు చేసుకుంది. గోదావరి ఎక్స్‌ప్రెస్ రైలు వెనక భాగంలో దాదాపు ఆరు బోగీలు పట్టాలు తప్పినట్లు సమాచారం. ముందు భాగంలో ఇంజిన్ తర్వాత 10 బోగీల వరకూ పట్టాలపైనే ఉన్నాయి. కానీ చివర్లో ఉన్న జనరల్ భోగీ దెబ్బ తిన్నట్లుగా తెలుస్తోంది. అంతేకాక రైలు పట్టాలు కిలో మీటర్ల మేర దెబ్బ తిన్నట్లుగా దానిలో ప్రయాణిస్తున్న ప్యాసింజర్స్ తెలిపారు. ఆయిల్ లీకవ్వడం, ఆటోమేటిక్ బ్రేక్ పడడమే ఈ ప్రమాదానికి కారణమని తెలుస్తోంది.
అయితే రైలు పట్టాలు తప్పినట్లు లోకో పైలెట్ గమనించడంతో పెను ప్రమాదం తప్పినట్లు తెలుస్తోంది. ప్రమాదం గురించి తెలిసిన వెంటనే ప్రయాణికులు భయంతో వెంటనే కిందరు దిగారు. ఇక ప్రమాదవశాత్తూ రైలు పట్టాలు తప్పిందని.. కొత్త కోచ్‌లు కావడంతో ప్రమాదం తీవ్రత ఎక్కువగా లేదని అధికారులు వెల్లడించారు. ఈ ఘటనలో ప్రయాణికులు ఎవరికి ఏం కాలేదన్నారు. ఇక పట్టాలు తప్పిన ప్రాంతంలో జనావాసాలు లేవని అధికారులు వెల్లడించారు.పట్టాలు తప్పిన బోగీలను వదిలి రైలు తిరిగి బయల్దేరింది. ఎస్-5 నుంచి చివరివరకూ బోగీలు పట్టాలు తప్పగా వాటిని అక్కడే వదిలి.. మిగిలిన బోగీలతో రైలు ముందుకు కదిలేందుకు అధికారులు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
దీంతో ప్రయాణికులు రోడ్డు వెతుక్కుంటూ 5 కిలోమీటర్ల మేర లగేజ్‌తో కాలి నడకన వెళ్లినట్లు తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. ఇక విశాఖపట్నం, హైదరాబాద్ మధ్య గోదావరి ఎక్స్‌ప్రెస్ (12727) రాకపోకలు సాగిస్తుంటుంది. ఈ రైలు చాలా రద్దీగా ఉంటుంది. విశాఖలో సాయంత్రం 5.20కి బయల్దేరి మరుసటి రోజు ఉదయం 6.15కు నాంపల్లి స్టేషన్‌కి చేరుకుంటుంది. ఈ క్రమంలో గోదావరి ఎక్స్‌ప్రెస్ సికింద్రాబాద్‌కు వచ్చే సరికి తెల్లవారుజామున 5.10 గంటలు వుతుంది. ఇక నిత్యం ఈ రైలులో కొన్ని వందల మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తుంటారు.
Godavari express train stopped near BB NAGAR
బీబీ నగర్ వద్ద పట్టాలు తప్పిన గోదావరి ఎక్స్ప్రెస్
విశాఖ పట్నం నుంచి సికింద్రాబాద్ వస్తుండగా ఘటన..#GodavariExpress #indianrailways@PMOIndia @RailMinIndia @SCRailwayIndia @gmscrailway @TSwithKCR @KTRoffice pic.twitter.com/kmu1rS1szy— YJR (@yjrambabu) February 15, 2023