హైదరాబాద్ లోని మలక్ పేట్ లోని ఓ హోటల్ లో భారీ పేలుడు సంభవించింది. తెలంగాణ వైద్య విధాన పరిషత్.. యం.యన్. ఏరియా హాస్పిటల్ ని ఆనుకుని ఉన్న సోహైల్ హోటల్ లో గ్యాస్ సిలిండర్ పేలింది. సిలిండర్ పేలడంతో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. భయంతో కస్టమర్లు, హోటల్ సిబ్బంది బయటకు పరుగులు తీశారు. సిలిండర్ పేలుడుకి హోటల్ భవనం లోపల భారీగా నిప్పు అంటుకుంది. హోటల్ భవనం బయట దట్టమైన పొగలు వ్యాపించాయి. పక్కనే హాస్పిటల్ కూడా ఉంది. హాస్పిటల్, హోటల్ పక్కపక్కనే ఉండడంతో మంటలు ఏమైనా హాస్పిటల్ ని అంటుకుంటాయేమో అన్న భయంతో హాస్పిటల్ సిబ్బంది భయపడుతున్నారు.
స్థానికులు సైతం భయంతో పరుగులు తీస్తున్నారు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఫైర్ ఇంజన్ తో అక్కడకు చేరుకొని మంటలను అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు. సిలిండర్ పేలుడుతో ట్రాఫిక్ కి తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఒక పక్క పోలీసులు ట్రాఫిక్ సమస్యని క్లియర్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. మరి ఈ పేలుడు ఎలా సంభవించింది? పేలుడులో ఎవరికైనా గాయాలు అయ్యాయా? ఆస్తి నష్టం ఏమైనా జరిగిందా? అనే వివరాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటనలో ఎవరికీ ఏ ప్రాణ నష్టం జరగకూడదని కోరుకుందాం.
#Breaking #Sohail Hotel Malakpet me Lagi Aag Cylinder Blast Hua Details Waited#itehadtv pic.twitter.com/vfapgVRVCt
— Hardin (@hardintessa143) January 6, 2023