సాధారణంగా మెుసళ్లు ఎక్కడ ఉంటాయి అంటే.. ఏ నదుల్లోనో లేక చెరువుల్లోనో, రిజర్వాయర్లలోనో అని సమాధానం వస్తుంది. కానీ గతంలో రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాలకు మెుసళ్లు ఇళ్లల్లోకి కూడా వచ్చాయి. వరదలు సంభవించిన సమయంలో చాలా మెుసళ్లు దగ్గరిలోని నదుల్లో ఉండిపోయాయి. ప్రస్తుతం ఇదే పరిస్థితి మూసీ నదిలో కనిపిస్తోంది. అవును హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లోని మూసీ పరివాహక ప్రజలు నిత్యం భయం భయంగా జీవిస్తున్నారు. దానికి కారణం మెుసళ్లు ఒడ్డుకు వచ్చి సరదాగా సేదతీరడమే. తాజాగా రాజేంద్ర నగర్ పరిధిలోని ఉప్పర్ పల్లిలో మూసీ నదిలో మెుసళ్లు కనిపించాయి. దాంతో భయాందోళనకు గురైన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు.
మూసీ నది పరివాహక ప్రాంతాల్లో నివసించే ప్రజలు భయాందోళనకు గురౌతున్నారు. ముఖ్యంగా రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ లోని మూసీ నదిలో మెుసళ్లు కనిపించడం కలకలం సృష్టించింది. ఈ ప్రాంతంలోనే కాక ఉప్పరపల్లితో పాటు మరికొన్ని మూసీ పరివాహక ప్రాంతాల్లో మెుసళ్లు ఒడ్డుకు వచ్చి సేదతీరుతున్నాయి. వాటిని చూసిన ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. వాటిని ఒడ్డున చూసిన ప్రజలు అటువైపు వెళ్లాలి అంటేనే భయపడిపోతున్నారు. దాంతో వారు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు అటవీశాఖ అధికారులను వెంటబెట్టుకుని ఘటనా స్థలానికి చేరుకున్నారు. వెంటనే ఆపరేషన్ చేపట్టారు.. కానీ అప్పటికే మెుసళ్లు నీటిలోకి జారుకున్నాయి.
అయితే త్వరగా వాటిని పట్టుకోవాలి అధికారులను వేడుకున్నారు స్థానికులు. ఎవరూ అటువైపు వెళ్లకుండా సైన్ బోర్డులు, హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేస్తామని అధికారలు తెలిపారు. కానీ స్థానికంగా ఉండే ప్రజలు మాత్రం క్షణక్షణం బిక్కుబిక్కు మంటూ బతుకుతున్నాం అని వాపోతున్నారు. మెుసళ్లు ఏ టైమ్ లో మా మీద దాడి చేస్తాయో తెలియక బతుకుతున్నాం అని పేర్కొంటున్నారు. త్వరలోనే మా సమస్యను పరిష్కరించకపోతే.. మేం ధర్నాకు దిగుతామని అధికారులను హెచ్చరించారు. అధికారులు మాత్రం అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని, త్వరలోనే మెుసళ్లను పట్టుకుంటామని పేర్కొన్నారు. అయితే గతంలో కూడా వర్షా కాలం అనంతరం మెుసళ్లు మూసీ నది నుంచి బయటకు వచ్చిన సంఘటనలు చోటు చేసుకున్నాయి.