ఆడదంటే ఆడదానికి శత్రువు అన్న సామెత నిజం చేస్తున్నారు కొంత మంది మహిళామణులు. సాటి ఆడది అన్న సానుభూతి చూపించడం అటు ఉంచితే.. ఆమె నవ్వు పాలు అయ్యేందుకు వీరే కుట్రలు పన్నుతుండటం విచారకరం.
ఆడదంటే ఆడదానికి శత్రువు అన్న సామెత నిజం చేస్తున్నారు కొంత మంది మహిళామణులు. సాటి ఆడది అన్న సానుభూతి చూపించడం అటు ఉంచితే.. ఆమె నవ్వు పాలు అయ్యేందుకు వీరే కుట్రలు పన్నుతుండటం విచారకరం. తమకు నచ్చని ఆడదాని పట్ల కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారు. కర్ణాటకలో అమానవీయ సంఘటన ఒకటి చోటుచేసుకుంది. మంగుళూరు నగరంలోని పంప్‌వెల్ ఏరియాలోని ఓప్రైవేట్ ఆసుపత్రిలో అమ్మాయిపై ఓ కామాంధుడు అత్యాచారం చేయగా.. బాధితురాలి అత్త కూడా సహకరించడం కలకలం రేపుతోంది.
మానవ జాతికే మచ్చలా నిలిచిన ఈ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. మన్సూర్ అహ్మద్ బాబా షేక్ వ్యక్తి.. ముంబయిలో నివాసం ఉంటున్న అబ్దుల్ హలీం కలిసి ఆగస్ట్ 10వ తేదీన బైక్‌లో కాసరగూడుకు వెళ్లారు. పని ముగించుకుని ఇంటికి తిరిగి వస్తున్నప్పుడు మంజేశ్వర కొత్తగడి బాలి వద్ద బైక్ ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో గాయపడిన వారిని మంగళవారం ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. గాయాలు అయిన మన్సూర్ అహ్మద్‌ను చూడటానికి అతని సోదరి, ఆమె కుమార్తె, మన్సూర్ భార్య షమీనా బాను కలిసి మంగళూరులోని ఆసుపత్రికి వెళ్లారు. కాగా, తన కుమార్తెను షమీనా బాను వద్ద వదిలి బయటకు వెళ్లింది మన్సూర్ సోదరి. ఈ సమయంలో అబ్దుల్ హలీం వీరిద్దరినీ చూశాడు. ఆ సమయంలో కామాంధుడు బాలిక మీద కన్ను వేసి.. అత్యాచారానికి ఒడిగట్టాడు.
ఈ మొత్తం చర్య అత్త సమక్షంలోనే జరగటం గమనార్హం. తనపై అబ్దుల్ హలీం అత్యాచారం చేసినట్లు.. అందుకు అత్త సహకరించినట్లు బాలిక తల్లికి చెప్పింది. దీంతో హడలిపోయిన తల్లి, మంగళూరు పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ముంబయికి పారిపోవడానికి ప్రయత్నించిన నిందితుడు అబ్దుల్ హలీంను అరెస్టు చేశారు. అలాగే బాలిక మీద అత్యాచారం చెయ్యడానికి సహకరించిన షమీనా బానును అరెస్టు చేశారు. ఈ ఇద్దరినీ కోర్టు ముందు హాజరుపరచడంతో నిందితులను రిమాండ్ కు తరలించాలని న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసిందని మంగళూరు పోలీసు అధికారులు తెలిపారు.