భారత రాష్ట్ర (బీఆర్ఎస్) ఈ నెల 18న (బుధవారం) ఖమ్మంలో జరుపుతున్న భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు పూర్తి చేసుకున్నాయి. టీఆర్ఎస్ నుండి బీఆర్ఎస్ పార్టీగా అవతరించిన తర్వాత చేపడుతున్న తొలి బహిరంగ సభ నేపథ్యంలో గులాబీ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. దీంతో భారీగా ప్రణాళికలను సిద్ధం చేసుకుంది. పలు రాష్ట్రాలకు చెందిన ముఖ్యమంత్రులు, మాజీ ముఖ్యమంత్రులతో పాటు జాతీయ నేతలు, ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు, ప్రజలు ఈ భారీ బహిరంగ సభకు ముఖ్య అతిధులుగా విచ్చేస్తున్నారు. ఇప్పటికే వీరు హైదరాబాద్ చేరుకున్నారు. ఈ సభ జాతీయ రాజకీయాల్లో మలుపు కానుందని బీఆర్ఎస్ భావిస్తోంది. కెసిఆర్ కటౌట్లు, బీఆర్ఎస్ పార్టీ జెండాలతో ఖమ్మం నగరం గులాబిమయమైంది.
తెలంగాణ రాజకీయ కేంద్రానికి బిందువుగా భావించే ఖమ్మంలో ఈ భారీ సభను బీఆర్ ఎస్ ఏర్పాటు చేసింది. కొత్త కలెక్టరేట్ వెనకాల ఉన్న100 ఎకరాల్లో ఈ సభను నిర్వహిస్తోంది. కనివినీ ఎరుగని రీతిలో ఏర్పాట్లు రూపుదిద్దుకున్నాయి. ఇప్పటికే భారీగా కటౌట్లు, హోర్డింగ్ లు, జెండాలతో ఖమ్మం నగరం.. పండుగ వాతావరణాన్ని తలపిస్తోంది. సభ వద్దకు చేరుకునేందుకు బస్సులు, లారీలు, ఇతర వాహనాలను సిద్ధం చేశారు. భారీగా తరలి వచ్చే కార్యకర్తలు, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులకు కలగకుండా తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. వచ్చిన వారిని మార్గనిర్దేశకం చేసేందుకు వాలంటీర్లను ఏర్పాటు చేశారు. బహిరంగ సభ ప్రాంతాల్లో ఎక్కడిక్కడే ఎల్ ఇడి తెరలను ఉంచారు.
ఈ సభకు కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్, సిపిఐ ప్రధాన కార్యదర్శి డి. రాజాతో పలువురు నేతలు అతిధులుగా హాజరౌతున్నారు. ఈ నేపథ్యంలో వారికి ఆతిధ్యం ఇచ్చేందుకు పసందైన వంటలను సిద్ధం చేస్తున్నారు. తెలంగాణ సంప్రదాయ వంటలను ఇందులో మిళితం చేశారు. మొత్తం 38 రకాల వంటలను అతిధులకు రుచి చూపించనున్నారు. మటన్ బిర్యానీ, మటన్ కర్రీ, మటన్ లివర్ ప్రై, చికెన్ ధమ్ బిర్యానీ, ప్రాన్స్ బిర్యానీ, కొరమీను చేపల పులుసు, బొమ్మిడాయల పులుసు, తలకాయ ఇగురు, నాటుకోడి కూర వంటివి సిద్ధం చేశారు. శాఖాహారుల నిమిత్తం మెతీ చమన్, దాల్ తడ్కా, పనీర్ బటర్ మసాలా, మామిడికాయ పప్పు, బీరకాయ శనగపప్పు, బెండకాయ కాజు ఫ్రై, ముద్దపప్పు, తెలంగాణ పచ్చిపులుసు వంటివి వండించనున్నారు.
ఖమ్మం BRS బహిరంగ సభ ప్రాంగణం pic.twitter.com/EUWJan1gCY
— VarshaTrs (@VarshaTrs) January 17, 2023
ఖమ్మంలో బీఆర్ఎస్ భారీ బహిరంగ సభకు సర్వం సిద్ధం 💥💥
రేపు ఖమ్మంలో జరగనున్న బీఆర్‌ఎస్ పార్టీ తొలి బహిరంగ సభ చరిత్రలో నిలిచిపోనున్నది. ఈ సభ నుంచి బీఆర్ఎస్ పార్టీ అధినేత, సీఎం శ్రీ కేసీఆర్ దేశానికి దిశానిర్దేశం చేయనున్నారు.#BRSParty #KCR pic.twitter.com/qwhjlkxNVs
— BRS News (@BRSParty_News) January 17, 2023