మీరు యూట్యూబ్ చూస్తూ కాలక్షేపం చేస్తుంటారా? వీడియో ప్రారంభానికి ముందు వచ్చే యాడ్స్ మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాయా? అయితే, మీ సహనానికి మరింత పరీక్ష పెట్టబోతోంది యూట్యూబ్. ఇప్పటిదాకా అలాంటి పరిస్థితులు ఎదురైనా.. ‘యాడ్ స్కిప్’ చేస్తూ కాలం వెళ్లదీసిన మనకు ఇకపై ఆ ఆప్షన్ కూడా ఉండబోదు. ఎందుకంటే.. ‘స్కిప్’ చేయడానికి వీల్లేని అన్ స్కిపబుల్ యాడ్స్ సంఖ్యను ఐదుకు పెంచబోతోంది.. యూట్యూబ్. అయితే.. వీటి నుండి తప్పించోవడానికి ఓ మార్గముంది. అదేంటో చూద్దాం..
ప్రస్తుతానికియూట్యూబ్ లో రెండు యాడ్స్ మాత్రమే కనిపిస్తున్నాయి. ఇప్పుడు ఆ సంఖ్యను ఐదుకు పెంచబోతోంది. అది కూడా యాడ్ స్కిప్ చేయడానికి వీలు లేకుండా కొత్త రూల్స్ తెస్తోంది. ఒక్కో యాడ్ 6 సెకన్లు చొప్పున.. మొత్తం 5 యాడ్స్.. 30 సెకెన్ల పాటు తప్పక చూడాల్సిందే. ఇప్పటికే పలువురు యూజర్లకు ఈ తరహా యాడ్స్ దర్శనమిస్తున్నాయట. కొందరైతే.. 9 నుంచి 10 యాడ్స్ కూడా చూడాల్సి వస్తోందట. ‘ఎవరైతే యూట్యూబ్ ఫ్రీ వెర్షన్ వాడుతున్నారో వారికి మాత్రమే ఈ యాడ్స్ దర్శనిమివ్వనున్నాయి. దీనిపై పలువురు యూజర్లు సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతున్నారు.
How unlucky is it to get 6 youtube adds with no skip button, just to watch the new Vanoss Video- pic.twitter.com/8pNsY7q3JA
— ❤◇IzukuStqn◇🖤 (@DarkFigure99) August 21, 2022
ప్రస్తుతానికి కొందరు యూజర్లకు మాత్రమే ఐదు యాడ్స్ ఫార్మాట్ ను తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. వారి నుంచి వచ్చిన ఫీడ్ బ్యాక్ ఆధారంగా ముందుకెళ్లే అవకాశం ఉంది. రాబోవు రోజుల్లో ఈ సంఖ్య మరింత పెరగొచ్చు. యూట్యూబ్ ప్రీమియం వినియోగదారులకు మాత్రం ఎలాంటి యాడ్స్ ఉండవు. ఇప్పటిదాకా మీరు.. యూట్యూబ్ ప్రీమియం సుబ్స్క్రిప్షన్ తీసుకోనట్లయితే.. రూ. 10 చెల్లించి మూడు నెలల పాటు ప్రీమియం సుబ్స్క్రిప్షన్ పొందవచ్చు. ఐదు యాడ్స్ ను తప్పక చూడాల్సిందేనన్న ‘యూట్యూబ్’.. నిర్ణయాన్ని మీరు సమర్థిస్తారా? మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
10 adds aina vesko YouTube premium tiskolenu sir antha budget ledhikkada pic.twitter.com/4KabwbZS2E
— StweetS (@EndhukoELife) September 16, 2022