కరోనా తర్వాత మనుషుల చేతుల్లో డబ్బు కనిపించడం చాలా వరకు తగ్గిపోయింది. కారణం.. ప్రస్తుతం ప్రతి చోటా యూపీఐ పేమెంట్స్ అందుబాటులోకి వచ్చాయి. దాంతో పర్స్‌లో డబ్బులు పెట్టుకుని.. దాన్ని మర్చిపోకుండా తీసుకెళ్లే బాధ తప్పింది. బ్యాంక్ ఖాతాలో డబ్బు ఉండి.. చేతిలో ఫోన్ ఉంటే చాలు.. టీ కొట్టు మొదలు.. ఫైవ్ స్టార్ హోటల్ వరకు ఎక్కడ అయినా చెల్లింపులు చేయవచ్చు. ప్రస్తుం ప్రతి చోటా యూపీఐ పేమెంట్స్ అందుబాటులో ఉన్నాయి. అయితే యూపీఐ పేమెంట్స్ చేయాలంటే.. తప్పనిసరిగా ఇంటర్నెట్ అవసరం ఉంటుంది. అయితే నేటికి కూడా మన దేశంలో పలు ప్రాంతాల్లో నెట్‌వర్క్ సమస్యలు ఉన్నాయి.
మరి అలా నెట్ కనెక్షన్ లేని ప్రాంతాల్లో.. యూపీఐ పేమెంట్స్ చేయడం సాధ్యం కాదు కదా అంటే.. ఇంటర్నెట్‌తో పని లేకుండా యూపీఐ పేమెంట్స్ చేయడం కోసం ఓ సదుపాయం ఉంది. పదేళ్ల క్రితమే ఇది అందుబాటులోకి వచ్చినా.. పెద్దగా పాపులర్ కాలేదు. ఇంటర్నెట్‌తో సంబంధం లేకుండా.. మీ ఫోన్ నుంచి *99# యూఎస్‌ఎస్‌డీ కోడ్ (యూఎస్‌ఎస్‌డీ కోడ్) ద్వారా పేమెంట్స్ చేయవచ్చు. దాని గురించి ఒకసారి తెలుసుకుందాం..
నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా పదేళ్ల క్రితం అనగా.. 2012 నవంబర్‌లోనే స్మార్ట్‌ఫోన్ వినియోగదారులతో పాటు మొబైల్ ఫోన్ వాడుతున్న ప్రతి ఒక్కరి కోసం.. *99# సర్వీస్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది.. దీన్ని అన్ని రకాల మొబైల్ యూజర్లకుసేవలు అందించేందుకు పరిచయం చేశారు. అయితే ఈ ఫీచర్ అందుబాటులోకి వచ్చి చాలా రోజులు అయింది. కానీ, ఇది అంతగా పాపులర్ కాలేదు. ఇక ఈ సర్వీస్‌తో ఇంటర్నెట్ లేకుండా యూపీఐ పేమెంట్స్ ఎలా చేయాలో ఒకసారి తెలుసుకుందాం..