ఎలన్ మస్క్.. ఈ పేరు వినగానే సక్సెస్ ఎంతగా గుర్తొస్తుందో కాంట్రవర్సీలు కూడా అలాగే గుర్తొస్తాయి. ట్విట్టర్ ని కొనుగోలు చేసిన తర్వాత ఆయన నిర్ణయాలు ప్రపంచవ్యాప్తంగా వార్తల్లో నిలిచిన విషయం తెలిసిందే. అలాంటి వార్తలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి.
ఎలన్ మస్క్.. ఈ కుబేరుడు గురించి ప్రపంచవ్యాప్తంగా అందరికీ ఒక క్లారిటీ ఉంది. ఆయన ఏం చేసినా కచ్చితంగా కాంట్రవర్సీ అవుతుందని నమ్ముతారు. అయితే ఇటీవలి కాలంలో ఎలన్ మస్క్ తీసుకున్న నిర్ణయాలు ఎంతో మంది జీవితాలను నేరుగానే ప్రభావం చేశాయి. ట్విట్టర్ లో ఇప్పటికే చాలామంది ఉద్యోగులను ఇంటికి పంపిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు మరోసారి ఉద్యోగులను తొలగిస్తున్నట్లు చెబుతున్నారు. తాజాగా దాదాపుగా 200 మందిని తొలగించినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ దఫా లేఆఫ్స్ కి సంబంధించి ఓ మహిళ ఫొటో బాగా వైరల్ అవుతోంది. ఆమెకు ఎలన్ మస్క్ అన్యాయం చేశారంటూ నెటిజనులు మండిపడుతున్నారు.
అన్ని టెక్ కంపెనీలు ఉద్యోగులను తొలగించిన విషయం తెలిసిందే. అయితే అందులో భాగంగా ఎలన్ మస్క్ కూడా ట్విట్టర్ సంస్థ నుంచి కొంతమంది ఉద్యోగులను తొలగించారు. అయితే ట్విట్టర్ సంస్థ మరోసారి లేఆఫ్స్ కు శ్రీకారం చుట్టింది. ఈ దఫాలో 200 మంది ఉద్యోగులను తొలగించినట్లు చెబుతున్నారు. అయితే వారిలో ఒక మహిళ మాత్రం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ట్విట్టర్ సంస్థను పునఃనిర్మించడంలో ఆమె కీలకపాత్ర పోషిస్తే ఇప్పుడు ఆమెకు ఉద్యోగం లేకుండా చేశారంటూ నెటిజనులు మండిపడుతున్నారు. గతంలో పని ఒత్తిడి కారణంగా ఆమె ఆఫీస్ లోనే నేలపై నిద్రపోయిన ఫొటో ఒకటి ఇప్పుడు వైరల్ గా మారింది.
ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారిన ట్విట్టర్ ఉద్యోగిని పేరు ఎస్తేర్ క్రాఫోర్డ్. 2022 అక్టోబర్ నెలలో ట్విట్టర్ ని మస్క్ కొనుగోలు చేసిన తర్వాత ఈమె చాలా ప్రాజెక్టులకు పనిచేసింది. ట్విట్టర్ బ్లూటిక్ సబ్ స్క్రిప్షన్, భవిష్యత్ లో ట్విట్టర్ నుంచి రాబోతోంది అని చెబుతున్న పేమెంట్స్ వంటి ప్రాజెక్టుల్లో ఈమె కీలకపాత్ర పోషించినట్లు చెబుతున్నారు. అయితే ఇప్పు తాజా లేఆఫ్స్ లో ఆమె ఉద్యోగం కోల్పోయారని తెలిసి నెటిజనులు సైతం మండిపడుతున్నారు. ఎందుకంటే ఒక ప్రాజెక్ట్ డెడ్ లైన్ పూర్తి చేయడానికి ఎస్తేర్ ట్విట్టర్ కార్యాలయంలోనే నిద్రపోయింది. ఇప్పుడు ఆ ఫొటోని షేర్ చేస్తూ ఇలాంటి ఉద్యోగులనా నువ్వు తొలగించేది అని మస్క్ ను ప్రశ్నిస్తున్నారు.
When your team is pushing round the clock to make deadlines sometimes you #SleepWhereYouWork https://t.co/UBGKYPilbD
— Esther Crawford ✨ (@esthercrawford) November 2, 2022
ఎలన్ మస్క్ ఆమెకు తీవ్ర అన్యాయం చేశారంటూ ఆరోపిస్తున్నారు. స్వ్కాడ్ అనే స్క్రీన్ షేరింగ్ కంపెనీని ట్విట్టర్ కొనుగోలు చేసిన తర్వాత.. ఎస్తేర్ క్రాఫోర్డ్ డిసెంబర్ 2020లో ట్విట్టర్ లో చేరారు. అంతకన్నా ముందు స్క్వాడ్ కంపెనీకి ఎస్తేర్ క్వాఫోర్డ్ సీఈవోగా ఉండేవారు. అయితే ట్విట్టర్ సంస్థలో లేఆఫ్స్ ఇక్కడితో ఆగేల కనిపించడం లేదంటూ కొందరు కామెంట్ చేస్తున్నారు. అందులోని కీలక సభ్యులు కొందరు చేసిన వ్యాఖ్యలను బట్టి చూస్తే అదే నిజం అయ్యేలా ఉందంటున్నారు. ఎలన్ మస్క్ ట్విట్టర్ ని కొనుగోలు చేయకముందు మొత్తం 7,500 మంది వరకు ఉద్యోగులు ఉండేవారట.
ఇప్పుడు ఎలన్ మస్క్ ట్విట్టర్ కొనుగోలు చేసిన తర్వాత ట్విట్టర్ లో పరిస్థితులు చాలా మారిపోయాయంటున్నారు. ఖర్చుల తగ్గింపులో భాగంగా మస్క్ కు నచ్చినంత మందిని తొలగించే పనైతే ఆ సంస్థలో కేవలం 2000 మంది మాత్రమే మిగులతారంటూ వ్యాఖ్యానిస్తున్నారు. ఇంకా ఎప్పుడు ఎవరి ఉద్యోగం పోతుందో అనే భయంతో అంతా ఉన్నారని చెప్పుకొచ్చారు. ఉద్యోగ భద్రత లేకపోవడం అనేది ఎంప్లాయిస్ మానసిక ఆరోగ్యాన్ని కూడా దెబ్బతీస్తోందని అభిప్రాయపడుతున్నారు. సంస్థ కోసం కష్టపడిన మహిళను ఎలన్ మస్క్ ఉద్యోగం నుంచి తొలగించడం కరెక్టేనా? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
The worst take you could have from watching me go all-in on Twitter 2.0 is that my optimism or hard work was a mistake. Those who jeer & mock are necessarily on the sidelines and not in the arena. I’m deeply proud of the team for building through so much noise & chaos. 💙
— Esther Crawford ✨ (@esthercrawford) February 27, 2023