స్మార్ట్ ఫోన్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. అది లేకుండా రోజు గడవని వాళ్లు చాలామందే ఉన్నారు. అయితే స్మార్ట్ ఫోన్ కొనడం, వాడటం ఒకెత్తు అయితే.. దానికి ఛార్జింగ్ పెట్టి జాగ్రత్తగా ఉండటం మరో ఎత్తు. ఫోన్ ఛార్జింగ్ పెట్టే సమయంలో ఎలాంటి తప్పులు చేయకూడదో తెలుసుకోండి.
నిద్ర లేచిన దగ్గరి నుంచి మళ్లీ తిరిగి నిద్రపోయే వరకు సెల్ ఫోన్ లేకుండా బతికే పరిస్థితి కనిపించడం లేదు. చాలా మంది స్మార్ట్ ఫోన్ లేకపోతే మా జీవితమే లేదు అనేలా అడిక్ట్ అయిపోయారు. ఇంకొందరు జీవనోపాధి కోసం కూడా ఈ స్మార్ట్ ఫోన్ ని వాడుతున్నారు. అయితే స్మార్ట్ ఫోన్ పనిచేయాలి అంటే ఛార్జింగ్ కూడా ఉండాలి కదా. ఇప్పటికే 5000 ఎంఏహెచ్, 6000 ఎంఏహెచ్ అంటూ హ్యూమాంగస్ బ్యాటరీ బ్యాకప్ తో చాలా స్మార్ట్ ఫోన్లు మార్టెక్ లో రిలీజ్ అవుతున్నాయి. ఎంత పెద్ద బ్యాటరీ ఊన్నా కూడా రోజులో ఒకసారి అయినా ఛార్జింగ్ పెట్టాల్సిందే. మరి ఆ సమయంలో మీరు ఇలాంటి తప్పులు చేస్తున్నారా?
మీ స్మార్ట్ ఫోన్ తో వచ్చిన ఛార్జర్ ని మాత్రమే మీ ఫోన్ ఛార్జ్ చేయడానికి వాడండి. ఎందుకంటే మీకు తెలియకుండానే వేరే వేరే ఛార్జస్ పెడుతూ ఉంటే బ్యాటరీ హెల్త్ తగ్గిపోతుంది. తద్వారా బ్యాటరీ బ్యాకప్ కూడా బాగా తగ్గిపోవచ్చు. అందుకే ఏ ఛార్జర్ పడితే ఆ ఛార్జర్ తో మీ ఫోన్ ని ఛార్జ్ చేయకండి. మీ ఫోన్ తో వచ్చిన కంపెనీ ఛార్జర్ ని మాత్రమే వాడండి. అలాగే మీ ఛార్జర్ ని కూడా ఫ్రెండ్స్, ఫ్యామిలీకి ఇస్తూ ఉండకండి. కేవలం మీ ఫోన్ కి మాత్రమే వాడుకోండి.
మీలో చాలా మంది స్మార్ట్ ఫోన్ కి రోజులో మూడు, నాలుగు సార్లైనా ఛార్జింగ్ పెడుతూ ఉంటారు. అది చాలా పెద్ద తప్పు. అలా ఎప్పుడూ చేయకండి. ఒకసారి ఛార్జింగ్ పెడితే మళ్లీ 20లోపు వచ్చే వరకు ఫోన్ కి ఛార్జింగ్ పెట్టకూడదు. కాసేపు పెట్టడం ఒక పది శాతం ఛార్జింగ్ తగ్గగానే మళ్లీ ఫోన్ ని ఛార్జ్ చేయడం మంచి అలవాటు కాదు. అది ఫోన్ పర్ఫార్మెన్స్, బ్యాటరీ లైఫ్ మీద ఎక్కువ ప్రభావం చూపుతుంది. సాధ్యమైనంత వరకు రోజులో ఒకేసారి ఛార్జ్ చేయడానికి ప్రయత్నించండి.
మీ ఫోన్ కి ఛార్జింగ్ పెట్టే ఛార్జర్ ఎంత ముఖ్యమో.. పవర్ సప్లై ఇచ్చే వాల్ ప్లగ్ కూడా అంతే ముఖ్యం. అందుకే క్వాలిటీ తక్కువగా ఉండే వాల్ ప్లగ్స్, ఛార్జర్స్ ను వాడకూడదు. అలాచేస్తే మీ ఫోన్ చాలా త్వరగా పనిచేయకుండా పోయే ప్రమాదం ఉంది. మార్కెట్ లో, ఇ-కామర్స్ సైట్లలో ఆఫర్స్, తక్కువ ధరలో వస్తున్నాయని ఛార్జర్లు, ఎక్స్ టెన్షన్లు, వాల్ ప్లగ్స్ కొనుగోలు చేయకండి.
చాలామంది నూటికి 80 శాతం మంది వరకు ఫోన్ కి ఛార్జింగ్ పెట్టి వాడుతుంటారు. ఓవైపు ఛార్జింగ్ అవుతుంటుంది, మరోవైపు మీరు ఫోన్ ఆపరేట్ చేస్తుంటారు. అలా చేయడం వల్ల మీ ఫోన్ ఓవర్ హీట్ అవుతుంది. ఫోన్ ఛార్జ్ అయ్యే సమయంలో సాధారణంగానే హీట్ అవుతుంది. మీరు దానిని వాడుతున్నట్లైతే చాలా వేగంగా హీటవడమే కాకుండా.. బ్యాటరీ పేలిపోయే ప్రమాదం కూడా ఉంది. అందుకే ఛార్జింగ్ పెట్టిన సమయంలో ఫోన్ వాడకండి.
మీరు ఫోన్ కి ఎలాంటి ప్రమాదం జరగకూడదు, డ్యామేజ్ కాకూడదు అని పౌచ్ లు వాడుతుంటారు. అయితే చాలా మంది ఫోన్ కి పౌచ్ తీయరు. అలాగే ఛార్జ్ చేస్తుంటారు. ఆ సమయంలో ఏమౌతుందంటే.. ఫోన్ హీట్ అవుతుంది. ఫోన్ ఛార్జ్ చేసే సమయంలో పౌచ్ తీసేయాలంటూ టెక్ నిపుణులు ఎప్పుడూ చెబుతూనే ఉంటారు. అలా చేయడం వల్ల ఫోన్ తక్కువ హీటౌతుంది. మరి.. ఫోన్ ఛార్జింగ్ సమయంలో మీరు ఇలాంటి తప్పులు చేస్తున్నారా? మీ సమాధానాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.