మొబైల్ ప్రియులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రియల్‌మీ 10 ప్రో సిరీస్ లాంచ్ అయ్యింది. ఈ సిరీస్ లో.. రియల్‌మీ 10 ప్రో, రియల్‌మీ 10 ప్రో ప్లస్ పేరుతో రెండు వేరియంట్లలో మిడ్-రేంజ్ స్మార్ట్‌ఫోన్‌లను తీసుకొచ్చింది. వీటిలో రియల్‌మీ10 ప్రో ప్లస్ లో కర్వ్ ఎడ్జ్ డిస్‌ప్లే, మీడియాటెక్ డైమెన్సిటీ 1080 ప్రాసెసర్, 108మెగాపిక్సెల్ కెమెరా సెటప్ లాంటి ఫీచర్స్ ఉండగా, రియల్‌మీ 10 ప్రో మోడల్‌లో స్నాప్‌డ్రాగన్ 695 ప్రాసెసర్, 6.7 ఇంచెస్ ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్‌ప్లే లాంటి ఫీచర్స్ ఉన్నాయి. వీటి ధర ఎంత? స్పెసిఫికేషన్‌లు ఎలా ఉన్నాయి అన్న వివరాలు తెసులుసుకుందాం..
రియల్‌మీ 10 ప్రో రెండు వేరియంట్లలో రిలీజైంది. 6జీబీ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.18,999 కాగా, 8జీబీ+ 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.19,999గా ఉంది. ఇంట్రడక్టరీ ఆఫర్ కింద రూ.1,000 తగ్గింపు పొందొచ్చు. అంటే.. 6జీబీ+128జీబీ వేరియంట్‌ను రూ.17,999 ధరకు, 8జీబీ+128జీబీ వేరియంట్‌ను రూ.19,999 ధరకు సొంతం చేసుకోవచ్చు. డిసెంబర్ 16 మధ్యాహ్నం 12 గంటలకు ఫ్లిప్‌కార్ట్‌లో సేల్ ప్రారంభం అవుతుంది. నైట్ బ్లాక్, స్టార్‌లైట్, సీ బ్లూ కలర్స్‌లో అందుబాటులో ఉండనుంది.
realme 10 Pro 5G
Available in
👉6GB+128GB, INR 17,999
👉8GB +128GB, INR 19,999Avail some amazing discounts through bank
offers.The first sale begins on December 16, 12:00 PM!#realme10ProSeries5G #realme10Pro5G #CurvedDisplayNewVision pic.twitter.com/Gns2OHevjV
— realme (@realmeIndia) December 8, 2022
రియల్‌మీ 10 ప్రో ప్లస్ మూడు వేరియంట్లలో రిలీజైంది. 6జీబీ+ 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.24,999కాగా, 8జీబీ+ 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.25,999గా ఉంది. ఇక హైఎండ్ వేరియంట్ 8జీబీ+ 256జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.27,999. ఇంట్రడక్టరీ ఆఫర్ కింద రూ.1,000 తగ్గింపు పొందొచ్చు. అంటే.. 6జీబీ+128జీబీ వేరియంట్‌ను రూ.23,999 ధరకు, 8జీబీ+128జీబీ వేరియంట్‌ను రూ.24,999 ధరకు, 8జీబీ+256జీబీ వేరియంట్‌ను రూ.26,999 ధరకు సొంతం చేసుకోవచ్చు. డిసెంబర్ 14 మధ్యాహ్నం 12 గంటల నుంచి ఫ్లిప్‌కార్ట్‌లో సేల్ ప్రారంభమయ్యింది. నైట్ బ్లాక్, స్టార్‌లైట్, సీ బ్లూ కలర్స్‌లో అందుబాటులో కలవు.
It’s the Perfect 10 Sale Day!The #realme10ProPlus5G goes live on sale today at 12 PM, starting at 23,999*/-. Get your hands on the curve today! @Flipkart
Know more: https://t.co/oHs80qwJ1K#realme10ProSeries5G #CurvedDisplayNewVision pic.twitter.com/MetvueMX2z
— realme (@realmeIndia) December 14, 2022