ప్రస్తుతం ల్యాప్ టాప్స్ వాడకం బాగా పెరిగింది. ఎందుకంటే ఇప్పుడు స్కూల్ స్టేజ్ నుంచే ఆన్ లైన్ క్లాసులు, ప్రాజక్టులు అంటూ ల్యాప్ వాడేస్తున్నారు. అయితే ల్యాప్ టాప్ కొనాలి అంటే కాస్త ఖర్చుతో కూడుకున్న విషయమే. కానీ, ప్రైమ్ బుక్ 4జీ ల్యాప్ టాప్ మాత్రం బడ్జెట్ ధరలో అందుబాటులోకి వచ్చింది.
గతంలో అంటే చదువు అయిపోయి ఉద్యోగంలో చేరిన తర్వాత ల్యాప్ టాప్ అవసరం వచ్చేది. గత కొంతకాలం వరకు పీజీ విద్యార్థులకు ల్యాప్ టాప్ అవసరం వచ్చింది. ఇప్పుడు మాత్రం స్కూల్ పిల్లలకే ల్యాప్ టాప్ కావాల్సి వస్తోంది. కరోనా సమయంలో ఆన్ లైన్ క్లాసెస్ కోసం చాలా మంది స్మార్ట్ ఫోన్స్, ల్యాప్ టాప్స్ కొనాల్సి వచ్చింది. అలాగే ఇ-లెర్నింగ్ కోసం కూడా ల్యాప్ టాప్స్ అవసరం అవుతాయి. అయితే ల్యాప్ టాప్ కొనాలి అంటే అంత తేలికైన విషయం కాదు. కచ్చితంగా ఖర్చుతో కూడుకుని ఉంటుంది. అయితే ఇప్పుడు ప్రైమ్ బుక్ నుంచి అతి తక్కువ ధరలో ఒక ల్యాప్ టాప్ అందుబాటులో ఉంది.
అతి తక్కువ ధరలో అందరికీ ల్యాప్ టాప్ అందించాలనే ఉద్దేశంతో ప్రైమ్ బుక్ 4జీ ఆండ్రాయిడ్ ల్యాప్ టాప్ ని మార్కెట్ లో రిలీజ్ చేశారు. ఈ ల్యాప్ టాప్ 4జీ సిమ్ ని సపోర్ట్ చేస్తుంది. ఇందులో విండోస్ పని చేయదు. ఈ ల్యాప్ టాప్ ఆండ్రాయిడ్ ఆధారంగా పనిచేస్తుంది. ఈ ప్రైమ్ బుక్ 4జీ ల్యాప్ టాప్ లో 10 వేల కంటే ఎక్కువ ఆండ్రాయిడ్ యాప్స్ ని ఈ ల్యాప్ టాప్ సపోర్ట్ చేస్తుంది. దీని ఫీచర్ల విషయానికి వస్తే.. 11.6 ఇంచెస్ హెచ్ డీ రెజల్యూషన్ కలిగిన ఎల్ సీడీ డిస్ ప్లేతో వస్తోంది. మీరు ఈ ల్యాప్ టాప్ స్టోరేజ్ ని మైక్రో ఎస్ డీ కార్డు ద్వారా 200 జీబీ వరకు పెంచుకోవచ్చు. దీనిలో వైఫై, యూఎస్ బీ పోర్టులు, బ్లూటూత్, 3.5 ఎంఎం హెడ్ ఫోన్ జాక్ కూడా ఉన్నాయి.
ఇందులో 2 మెగా పిక్సల్ వెబ్ క్యామ్ కూడా ఉంది. 4000 ఎంఏహెచ్ బ్యాటరీ కూడా ఉంది. ఈ ప్రైమ్ బుక్ ల్యాప్ టాప్ లో రెండు వేరియంట్లు ఉన్నాయి. ఒకటి బేస్ వేరియంట్ కాగా.. రెండోది టాప్ వేరియంట్. ఈ బేస్ వేరియంట్ ల్యాప్ టాప్ ధర రూ.16,990గా నిర్ణయించారు. 4 జీబీ ర్యామ్+ 128 జీబీ స్టోరేజ్ టాప్ వేరియంట్ ల్యాప్ టాప్ ధర రూ.18,990గా నిర్ణయించారు. పిల్లల ఆన్ లైన్ క్లాసులు, ఇ-లెర్నింగ్ కోసం ఈ ల్యాప్ టాప్ చాలా ఉపయోగకరంగా ఉంటుందని చెబుతున్నారు. ఈ ల్యాప్ టాప్ కొనుగోలు చేసే సమయంలో ఆన్ లైన్ లోనే మనీ పే చేస్తే రూ.2 వేల వరకు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. ఈ ప్రైమ్ బుక్ 4జీ ల్యాప్ టాప్ మార్చి 11 నుంచి ఫ్లిప్ కార్టులో అందుబాటులోకి రానుంది.