ఎండాకాలం వచ్చింది అంటే.. బయట వడగాలులు, ఇంట్లో వేడి మంటలు తప్పవు. వాటి నుంచి బయటపడాలి అంటే ఏసీనో, కూలరో కొనుక్కోవాలి. ఏసీ కొనాలి అంటే ఖర్చుతో కూడుకున్నది. కూలర్ అంటే గదిలో స్పేస్ తినేస్తుంది. అదే ఫ్యానే కూలర్ లా పనిచేస్తే బావుంటుంది కదా? అయితే మీరు ఈ ఫ్యాన్ గురించి తెలుసుకోవాల్సిందే.
ఎండాకాలం రాగానే అందరూ అల్లాడి పోతుంటారు. పగటి పూట సూర్యుడి తాపం.. రాత్రిపూట వడగాలులు. ఇంక చిన్న పిల్లలు ఉండే ఇంట్లో పరిస్థితి అయితే చెప్పే వల్లే ఉండదు. ఎందుకంటే వేడికి పిల్లలు నిద్ర కూడా పోరు. అయితే ఆ వేడిని తట్టుకుని నిద్రపోవడం అంటే చాలా కష్టమనే చెప్పాలి. ఎండాకాలం రాగానే అందరూ ఏసీలు కొంటూ ఉంటారు. కానీ, అది చాలా ఖర్చుతో కూడుకున్న విషయం. ఇంకొంత మంది కూలర్లు కొంటూ ఉంటారు. వీటి మెయిన్ టినెన్స్, రూమ్ ఆక్యూపెన్సీ కాస్త ఎక్కువగా ఉంటుంది. అందుకే అలాంటి వారికోసం ఇప్పుడు ఒక టేబుల్ ఫ్యాన్ వచ్చేసింది. ఈ ఫ్యాన్ మీ ఇంట్లో ఇంక కూలర్, ఏసీల అవసరమే ఉండదని చెబుతున్నారు.
ఎండాకాలంలో ఫ్యాన్ తో ఎందుకు రూమ్ చల్లబడుతుంది అనుకుంటున్నారా? ఈ ఓరియంట్ ఫ్యాన్ ద్వారా అయితే చల్లబడుతుంది అని చెబుతున్నారు. ఈ ఓరియంట్ క్లౌడ్ 3 ఫ్యాన్ రూమ్ టెంపరేచర్ ను 12 డిగ్రీల వరకు తగ్గించగలదు. ఈ ఫ్యాన్ లో 5 లీటర్ల వరకు నీటిని స్టోర్ చేసుకోగల సామర్థ్యం ఉంటుంది. అందుకే దీనిని మోడ్రన్ కూలర్ అని కూడా చెప్పవచ్చు. ఆ 5 లీటర్ల నీటితో దాదాపు 8 గంటల వరకు రూమ్ ని చల్లగా ఉంచగలదు. దీనిలో 3 ఇన్ బిల్ట్ క్లౌడ్ ఛాంబర్ ఉంది. ఈ ఫ్యాన్ కి రిమోట్ కంట్రోల్ కూడా ఉంటుంది. మీరు మరింత చల్లదనం కావాలి అనుకుంటే బ్రీజ్ మోడ్ కూడా ఉంటుంది.
మీకు ఎటు కావాలంటే అటు ఈ ఫ్యాన్ ను తిప్పుకోవచ్చు. ఈ క్లౌడ్ ఫ్యాన్ 30 డిగ్రీల వరకు ఐసోలేట్ చేయగలదు. ఇంకా 10 డిగ్రీల వరకు టిల్ట్ కూడా అవుతుంది. ఈ ఫ్యాన్ ఎలాంటి శబ్ధం లేకుండానే గదిని చల్లబరుస్తుంది. అంతేకాకుండా గదిలో మంతి ప్యూరిఫైడ్ గాలి కూడా ఉంటుందని చెబుతున్నారు. ఈ ఫ్యాన్ బ్లాక్- వైట్ రెండు కలర్ వేరియంట్స్ తో వస్తోంది. దీని ధర విషయానికి వస్తే.. రూ.15,999కి అందిస్తున్నారు. అయితే ఇది కాస్త ఎక్కువ ధర అనే చెప్పాలి. కానీ, అదే ధరకు కూలర్స్ కొనుక్కుని గదిలో స్పేస్ లేకుండా చేసుకునే కంటే ఇదే చాలా బెటర్ అని చెబుతున్నారు. త్వరలోనే రిటైల్ మార్కెట్ లోకి ఈ ఓరయంట్ ఫ్యాన్ విడుదలవుతుంది.
This is so cool, quite literally. The @orient_electric Cloud 3 pedestal fan can bring down room temperatures by up to 12 degrees — 20 if you add ice. Has storage space for water which is used to cool using Cloudchill technology. Full review soon. pic.twitter.com/H0ZH18JxcO
— Nandagopal Rajan (@nandu79) March 8, 2023