స్మార్ట్ ఫోన్స్ లో ఐఫోన్ కొనాలి అనేది చాలా మందికి కలగా ఉంటుంది. అయితే వన్ ప్లస్ స్మార్ట్ ఫోన్స్ విడుదలైన తర్వాత ఐఫోన్లకు క్రేజ్ కాస్త తగ్గిందనే చెప్పాలి. మధ్యతరగతి యువత అంత వన్ ప్లస్ ఫోన్లు కొనడం ప్రారంభించారు. ఆ క్రేజ్ ని అలాగే కొనసాగిస్తూ వన్ ప్లస్ కొత్త మోడల్స్ ని విడుదల చేస్తూనే ఉంది.
ఫోన్ల విషయానికి వస్తే.. అందరూ యాపిల్ ఐఫోన్లు అంటే చాలా ఇష్టపడతారు. చాలామంది మధ్యతరగతి యువతకు అయితే ఐఫోన్ కొనుక్కోవాలి అనేది కలగా ఉంటుంది. అయితే వన్ ప్లస్ నుంచి స్మార్ట్ ఫోన్లు రిలీజ్ అయిన తర్వాత చాలామంది ఐఫోన్ కి బదులుగా వన్ ప్లస్ ఫోన్లు కొనడం ప్రారంభించారు. వన్ ప్లస్ మధ్యతరగతి వ్యక్తుల ఐఫోన్ అనే ప్రచారాలు కూడా జరిగాయి. ఆ తర్వాత వన్ ప్లస్ ఫోన్లను కూడా ఖరీదైనవిగా భావించడం ప్రారంభించారు. ఇప్పుడు వన్ ప్లస్ కూడా మధ్యతరగతి కంటే దిగువ వ్యక్తులు కూడా కొనుగోలు చేసేలా మోడల్స్ తీసుకొచ్చింది. ఇప్పుడు వన్ ప్లస్ ఓ కొత్త మోడల్ రిలీజ్ చేయడమే కాకుండా.. దానిపై ఓ క్రేజీ ఆఫర్ కూడా పెట్టింది.
వన్ ప్లస్ ఫోన్లకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. యువత ఈ ఫోన్లు కొనేందుకు ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. వన్ ప్లస్ నుంచి చాలా 5జీ మోడల్స్ వచ్చాయి. వాటిలో బడ్జెట్ ఫోన్లు కూడా ఉన్నాయి. ఇప్పుడు ప్రీమియం లెవల్లో వన్ ప్లస్ 11ఆర్ 5జీ ఫోన్ ని లాంఛ్ చేస్తున్నారు. ఈ ఫోన్ పై మరో క్రేజీ ఆఫర్ కూడా పెట్టారు. అదేంటంటే.. ఈ ఫోన్ ప్రీ బుకింగ్ చేసి కొనుగోలు చేసిన వారికి ‘వన్ ప్లస్ బడ్స్ Z2’ బడ్స్ ని ఎలాంటి అదనపు వసూళ్లు లేకుండా ఉచితంగా అందిస్తున్నారు. ఈ ఫోన్ ఫిబ్రవరి 27న విడుదల కానుంది. ఇ-కామర్స్ సైట్లలో ముందుగా ప్రీ బుకింగ్ చేసుకున్న వాళ్లకే ఈ బడ్స్ ఉచితంగా అందుతాయి. ఈ వన్ ప్లస్ 11ఆర్ ప్రీ బుకింగ్ చేసేందుకు క్లిక్ చేయండి.
ఇంక ఈ ఫోన్ ఫీచర్ల విషయానికి వస్తే.. ఇది 6.7 ఇంచెస్ 120 హెట్జ్ సూపర్ ఫ్లూయిడ్ ఆమ్లోడ్ డిస్ ప్లేతో వస్తోంది. స్నాప్ డ్రాగన్ 8+ జనరేషన్ 1 ప్రాసెసర్, ఆండ్రాయిడ్ 13, 8జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 100 వాట్స్ సూపర్ ఫాస్ట్ ఛార్జర్, ఇన్ డిస్ ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్, సోనీ సెన్సార్ కలిగిన 50 ఎంపీ రేర్ కెమెరా, 8ఎంపీ అల్ట్రా వైడ్, 16 ఎంపీ సెల్ఫీ కెమెరాలు ఉన్నాయి. ఈ ఫోన్ ధర విషయానికి వస్తే.. ప్రస్తుతం రూ.39,999గా నిర్ణయించారు. 16జీబీ ర్యామ్- 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ అయితే రూ.44,999గా నిర్ణయించారు. ఈ వన్ ప్లస్ 11ఆర్ 5జీ ఫోన్ కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
Amazon has unveiled offers for OnePlus 11R before its sale in India 🇮🇳
Free 🎧 OnePlus Buds Z2 with the purchase & Citi/ICICI discounts.
Prices 💵
8+128GB: ₹39,999
16GB RAM+256GB: ₹44,999 (😲)Free 6 mo. Spotify, Google One + Jio Offers#OnePlus11 #OnePlus11R #Cloud11 pic.twitter.com/pEufCqSYKA
— Ishan Agarwal (@ishanagarwal24) February 20, 2023