స్మార్ట్ ఫోన్ల వాడకం బాగా పెరిగింది అనే విషయాన్ని ఎవరైనా ఒప్పుకోవాల్సిందే. కాకపోతే ఇప్పటికే ఎక్కువ ఫీచర్లతో లభించే బడ్జెట్ ఫోన్లు తక్కువనే చెప్పాలి. అందులోనూ పెద్ద పెద్ద బ్రాండ్ల నుంచి అయితే బడ్జెట్ ఫోన్లను ఆశించలేం. కానీ, వన్ ప్లస్ మరోసారి బడ్జెట్ ఫోన్ ని లాంఛ్ చేసింది.
స్మార్ట్ ఫోన్ వాడకం ఎంత అయితే పెరిగిందో.. అలాగే వాటి స్పెసిఫికేషన్స్, మోడల్స్, నెట్ వర్క్స్ అన్నీ మారుతూ వచ్చాయి. అలాగే స్మార్ట్ ఫోన్స్ ధరలు కూడా ఆకాశాన్ని అంటుతూ వచ్చాయి. అయితే తక్కవ ధరలో పెద్ద పెద్ద కంపెనీల నుంచి స్మార్ట్ ఫోన్స్ రావడం ఇప్పుడిప్పుడే పెరుగుతోంది. భారత మార్కెట్ లో తక్కువ కాలంలో విపరీతంగా క్రేజ్ పొందిన కంపెనీ వన్ ప్లస్. ఈ కంపెనీకి చెందిన చాలా మోడల్స్ కు భారత విపణిలో మంచి డిమాండ్ దక్కింది. తర్వాత దిగువ మధ్యతరగతిని కూడా ఆకర్షిస్తూ బడ్జెట్ మోడల్స్ తీసుకురావడం ప్రారంభించింది. ఇప్పుడు తాజాగా ఒక బడ్జెట్ మోడల్ ని చైనా మార్కెట్ లో వన్ ప్లస్ విడుదల చేసింది.
ఒకప్పుడు అందరికీ యాపిల్ ఐఫోన్ కొనాలి అనేది కలగా ఉండేది. అయితే ఎప్పుడైతే మార్కెట్ లోకి వన్ ప్లస్ ఫోన్లు రావడం మొదలైందో అప్పటి నుంచి ఇండియన్ మార్కెట్ లో పరిస్థితులు మారాయి. చాలామంది వన్ పల్స్ కు మారడం ప్రారంభించారు. అలా ప్రపంచవ్యాప్తంగా వన్ ప్లస్ మార్కెట్ క్రియేట్ అయ్యింది. ఇప్పుడు చైనా ఈ కంపెనీ వన్ ప్లస్ ఏస్ 2వీ అనే మోడల్ ని లాంఛ్ చేసింది. ఈ ఫోన్ ధర మన కరెన్సీలో చూసుకుంటే 12+ 256 జీబీ వేరియంట్ రూ.27 వేలు, 16+ 256 జీబీ వేరియంట్ ధర రూ.29 వేలు, 16+ 512 జీబీ వేరియంట్ ధర రూ.33 వేలుగా నిర్ణయించింది.
ఈ ఫోన్ స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే.. 6.74 ఇంచెస్ ఆమోలెడ్ డిస్ ప్లే, 1.5కే రెజల్యూషన్, 120 హెట్స్ రిఫ్రెష్ రేట్, మైమన్సిటీ 9000 ప్రాసెసర్, బ్యాక్ సైడ్ 64 ఎంపీ కెమెరా, 8 ఎంపీ అల్ట్రా వైడ్, 2 ఎంపీ మ్యాక్రో కెమెరాలు ఉన్నాయి. 16 ఎంపీ సెల్ఫీ కెమెరా ఉంది. ఇంక బ్యాటరీ విషయానికి వస్తే.. 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఈ ఫోన్ కి 80 వాట్స్ స్పీడ్ ఛార్జింగ్ అడాప్టర్ వస్తుంది. ఫింగర్ ప్రింట్ అన్ లాక్ కోసం స్క్రీన్ మీద సెన్సార్ ఉంది. ఈ ఫోన్ ని ఇండియాలో ఎప్పుడు లాంఛ్ చేయబోతున్నారు అనే విషయాన్ని చెప్పలేదు. కానీ, త్వరలోనే భారత మార్కెట్ లో కూడా ఈ ఫోన్ అడుగుపెడుతుందని చెబుతున్నారు. అయితే ఇలా ఏస్ 2వీ పేరిట కాకుండా వన్ ప్లస్ నార్డ్ సిరీస్ లో ఏమైనా రిలీజ్ చేస్తారేమో అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
OnePlus Ace 2V pricing. Comment your opinion.#OnePlus #OnePlusAce2V pic.twitter.com/Sl2ysGb0YN
— Mukul Sharma (@stufflistings) March 7, 2023