సాఫ్ట్ వేర్ ఉద్యోగం అంటే అంత తేలిక కాదు. కోడింగ్, ప్రోగ్రామింగ్ చాలానే తలనొప్పులు ఉంటాయి. అవేమీ రాని వాళ్లు యాప్ తయారు చేయడం అనేది కలే అవుతుంది. అయితే ఇదంతా గతం. ఇప్పుడు ఎలాంటి కోడింగ్ ఎక్స్ పీరియన్స్ లేకుండా కూడా యాప్స్ క్రియేట్ చేయచ్చని మైక్రోసాఫ్ట్ తెలిపింది.
సాఫ్ట్ వేర్ ఇంజినీర్ అవ్వాలి అని ఎవరికి ఉండదు చెప్పండి. కాకపోతే అందుకు కోడింగ్ రావాలి, ప్రోగ్రామింగ్ మీద గ్రిప్ ఉండాలి. కానీ, అది అందరికీ సాధ్యం కాదు. అంతేకాకుండా మనకంటూ సొంత యాప్ ఒకటి తయారు చేయాలి అని కూడా చాలా మంది అనుకుంటారు. కానీ, అలా చేయాలి అంటే మీకు కచ్చింతగా ప్రోగ్రామింగ్, కోడింగ్ లాంటివి రావాల్సిందే. అయితే ఇప్పటి నుంచి ఏ మాత్రం కోడింగ్ టచ్ లేకపోయినా కూడా మీరు యాప్స్ తయారు చేసేయచ్చు. ఈ మాట చెప్తోంది.. ఎవరో దారినపోయే దానయ్య కాదండోయ్ ఏకంగా మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్లనే ప్రకటించారు. కోడింగ్ రాకపోయినా యాప్స్ తయారు చేసేయచ్చని భరోసా కల్పిచారు.
మైక్రోసాఫ్ట్ సంస్థ ఇటీవల సృష్టించిన సంచలనాలు అన్నీ ఇన్నీ కాదు. ఇప్పటికే ఆ సంస్థకు చెందిన చాట్ జీపీటీ ప్రపంచవ్యాప్తంగా ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్ లో సరికొత్త ఒరవడిని సృష్టించింది. చాట్ జీపీటీని ఇంక్లూడ్ చేస్తూ ఇటీవలే మైక్రోసాఫ్ట్ సంస్థ బింగ్ ని విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఆ అదే తరహాలో మరికొన్ని సరికొత్త టూల్స్ ని మైక్రో సాఫ్ట్ విడుదల చేయనుంది. పవర్ ప్లాట్ ఫామ్ అనే ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్ టూల్ ని ఇంటిగ్రేట్ చేయనుంది. ఈ టూల్ అందుబాటులోకి వస్తే గనుక ఎలాంటి కోడింగ్ అవసరం లేకుండానే యాప్స్ తయారు చేయచ్చని మైక్రోసాఫ్ట్ తెలిపింది. డేటా అనాలసిస్, ఈమెయి క్యాపింగ్, కస్టమర్ సమరీ, వీక్లీ వర్క్ రిపోర్ట్స్ వంటి వాటిని ఈ టూల్ తో చేయచ్చు. మీరు ఆఫీస్ ఆటోమేషన్ తో చేసే పనులు మొత్తాన్ని ఈ టూల్ సాయంతో చేయచ్చని తెలిపారు.
ఈ పవర్ ప్లాట్ ఫామ్ టూల్ మాత్రమే కాదు.. ఏఐ బిల్డర్ పేరిట మరో కొత్త టూల్ ని కూడా తీసుకురానున్నట్లు ప్రకటించారు. ఈ టూల్ సాయంతో వర్క్ ఫ్లో ఆటోమేషన్ చేయచ్చని మైక్రోసాఫ్ట్ ప్రతినిధులు తెలిపారు. తమ బిజినెస్ మేనేజ్మెంట్ కోసం కంపెనీ ప్రారంభించిన డైనమిక్ 365 కోపిలాట్ కు ఈ ఏఐని అనుసంధానం చేశారు. అంతేకాకుండా మార్చి 16న మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల ఓ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. రీఇన్వెంటింగ్ ప్రొడక్టవిటీ విత్ ఏఐ అనే అంశంపై సత్య నాదెళ్ల చర్చించనున్నారు. ఈ కార్యక్రమంలోనే సత్య నాదెళ్ల పలు కీలక అంశాలు కూడా వెల్లడించే అవకాశం ఉందని టెక్ నిపుణులు అభిప్రాయ పడుతున్నారు.