టెక్ దిగ్గజం యాపిల్ మ్యాక్ బుక్ సిరీస్‌లో కొత్త ల్యాప్‌ట్యాప్స్‌ను విడుదల చేసిన విషయం తెలిసిందే. యాపిల్ మ్యాక్ బుక్ ప్రోలో రెండు వర్షన్లను మార్కెట్‌లోకి వచ్చాయి. మ్యాక్ బుక్ ప్రో 14 ఇన్చ్, 16 ఇన్చెస్ కేటగిరీలు ఉన్నాయి. వాటి పూర్తి స్పెసిఫికేషన్స్, ఇండియాలో ఏ మోడల్ ధర ఎంతనే విషయాన్ని చూద్దాం.
బ్యాటరీ బీస్ట్ అనే అనాలి ఈ మోడల్స్‌ని.. ఎందుకంటే 14 ఇన్చ్ వర్షన్‌లో 17 గంటల ప్లే బ్యాక్ కెపాసిటీ ఉంటుంది. 16 ఇన్చ్ వర్షన్‌లో 21 గంటల ప్లేబ్యాక్ కెపాసిటీ ఉంటుంది. సూపర్ ఫాస్ట్ ఛార్జింగ్ సౌకర్యం ఉంది. కేవలం 30 నిమిషాల్లో 50 శాతం ఛార్జ్ అవుతుంది. ఇంటెల్ i7 సీపీయూలతో పోలిస్తే M1 Pro సీపీయూ 3.7 శాతం స్పీడ్‌గా పనిచేస్తుందని తెలిపారు. జీపీయూ 9 రెట్లు వేగంగా వర్క్ చేస్తుందని వెల్లడించారు. 6 స్పీకర్లతో ఈ మోడల్స్ రానున్నట్లు, 80 శాతం BASS మెరుగ్గా ఉంటుందని తెలిపారు.
14 ఇన్చ్ వర్షన్‌లో రెండు వేరియేషన్స్ ఉన్నాయి. 512 జీబీ రోమ్ ధర ఇండియాలో రూ.1,94,900గా ఉంది. దీనిలో 16 ర్యామ్+ 512 జీబీ రోమ్‌తో వస్తుంది. దీనిలో 8c Cpu, 14c GPU ఉంటాయి. దీనిలోనే రెండో వర్షన్ 1 టెరాబైట్ రోమ్ ధర ఇండియాలో రూ.2,39,000 వేలుగా నిర్ణయించారు. దీనిలో సీపీయూ, జీపీయూలు కూడా అప్‌డేటెడ్‌గా ఉన్నాయి. 16 జీబీ ర్యామ్+ 1 టెరాబైట్ రోమ్, 10c CPU, 16c GPUలు ఉండనున్నాయి.
16 ఇన్చ్ వర్షన్‌ను కూడా రెండు వేరియంట్లలో తయారు చేశారు. రెండింటిలోనూ స్టోరేజ్ ఒకేలా ఉన్నా కూడా జీపీయూలో మాత్రం మార్పులు చేశారు. మొదటి వేరియంట్‌ను 16 జీబీ ర్యామ్+ 512 జీబీ రోమ్, 10c CPU, 16c GPUలతో వస్తుంది. దాని ధర రూ.2,39,900గా నిర్ణయించారు. మరో వేరియంట్ 16 INCH M1 Maxగా విడుదుల చేశారు. దానిలో 16 జీబీ ర్యామ్+ 512 జీబీ రోమ్, 10c CPU, 32c GPUలను పొందు పరిచారు. దాని ధర ఇండియాలో రూ.3,29,900గా నిర్ణయించారు. ఆర్డర్లు కూడా మొదలయ్యాయి. మీ మ్యాక్ బుక్ ప్రోని బుక్ చేసుకునేందుకు యాపిల్ అఫీషియల్ సైట్‌ని విజిట్ చేయండి.