స్మార్ వాచ్ లకు విపరీతమైన డిమాండ్ పెరిగిపోయింది. ప్రస్తుతం అంతా స్మార్ట్ వాచ్ వినియోగానికి అలవాటు పడిపోయారు. అందుకే అన్ని ప్రముఖ టెక్ కంపెనీలు కూడా స్మార్ట్ వాచ్ లను తయారు చేయడం ప్రారంభించాయి. ఫేస్ బుక్ మాతృసంస్థ మెటా కంపెనీ కూడా చేరినట్లు గతంలో వార్తలు హల్ చల్ చేశాయి. మెటా కంపెనీ స్మార్ట్ వాచ్ తయారు చేస్తోందని.. దానికి డ్యూయల్ కెమెరా కూడా ఉందని చెప్పారు. తర్వాత ఆ ప్రాజెక్ట్ ని ఆపేసినట్లు ప్రముఖ సంస్థ బ్లూమ్ బర్గ్ వెల్లడించింది. అయితే ఇప్పుడు మళ్లీ ఆ ప్రాజెక్ట్ పట్టాలెక్కిందని చెబుతున్నారు. అందుకు సంబంధించిన ఫొటోలు కూడా ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
స్మార్ట్ వాచ్‌లకు ఉన్న డిమాండ్ అంతా ఇంతా కాదు. కేవలం టైమ్ మాత్రమే కాకుండా హెల్త్ మానిటరింగ్, స్పోర్ట్స్, గేమ్స్ కోసం వీటిని వాడుతున్నారు. వీటికి పెరుగుతున్న డిమాండ్ దృష్ట్యా అన్ని కంపెనీలు స్మార్ట్ వాచ్‌లను తయారు చేయడం ప్రారంభించారు. అందరితో పాటుగా మెటా కూడా స్మార్ట్ వాచ్ తయారు చేసేందుకు సిద్ధమైనట్లు గతంలో వార్తలు వచ్చాయి. పైగా దానికి డ్యూయ్ల కెమెరా కూడా ఉంటుందని చెప్పారు. కొంతకాలం తర్వాత ఆ ప్రాజెక్టును మెటా పక్కన పెట్టిందని వార్తలు వచ్చాయి. అయితే మెటా మాత్రం ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. ఇప్పుడు మాత్రం మెటా నుంచి రాబోతున్న స్మార్ట్ వాచ్ ఇదే అని నెట్టింట ఫొటోలు ప్రత్యక్షమయ్యాయి.
అయితే అవి నిజమైన మెటా స్మార్ట్ వాచ్ ఫొటోలా? లేక అలా ప్రచారం చేస్తున్నారా? అనే విషయంపై మాత్రం క్లారిటీ లేదు. ప్రముఖ టెక్ నిపుణుడు వోజ్ చౌక్సీ తన ట్విట్టర్ ఖాతా ద్వారా పలు చిత్రాలు, కొంత సమాచారాన్ని షేర్ చేశాడు. ఈ స్మార్ట్ వాచ్ కోసం మెటా సరికొత్త ఆపరేటింగ్ సిస్టమ్‌ని తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది. గూగుల్ వేయర్ ఓఎస్ కి బదులుగా ఆండ్రాయిడ్ ఆధారిత ఓఎస్ తో ఈ వాచ్ పనిచేస్తుందని చెబుతున్నారు. ప్రస్తుతం టెక్ ప్రపంచం మొత్తం ఈ మెటా స్మార్ట్ వాచ్ గురించే మాట్లాడుకుంటున్నారు. నిజంగానే ఈ వాచ్ రాబోతోందా? వస్తే డ్యూయల్ కెమెరా ఉంటుందా? వంటి ప్రశ్నలు వినిపిస్తున్నాయి.
గతంలో లీకైన మెటా స్మార్ట్ వాచ్ ఫొటోలకు తగ్గట్లుగానే ఈ స్మార్ట్ వాచ్ డిజైన్ ఉంటుందని తెలుస్తోంది. ఈ వాచ్ లో డ్యూయల్ కెమెరాలే హెలెట్ ఫీచర్లుగా చెబుతున్నారు. ఇది క్వాల్కమ్ చిప్ సెట్ కలిగి ఉంటుందని చెబుతున్నారు. డిస్ ప్లే, ఎడ్జ్, డిజైన్ విషయంలో యాపిల్ స్మార్ట్ వాచ్ లను పోలి ఉంటుందని చెబుతున్నారు. అంతేకాకుండా కొందరు ఇంకొక అడుగు ముందుకేసి ఈ వాచ్ ధర ఇంత ఉంటుందని చెబుతున్నారు. దీని ధర దాదాపుగా రూ.45 వేలు వరకు ఉంటుందని చెబుతున్నారు. ఈ స్మార్ట్ వాచ్ కు సంబంధించి మెటా కూడా అతి త్వరలోనే అధికారిక ప్రకటన విడుదల చేస్తుందని చెబుతున్నారు.
Leak: A new version of the @Meta smartwatch is in development, new details and photos below👇 pic.twitter.com/mlEgEQvWp5
— Kuba Wojciechowski 🩷 (@Za_Raczke) January 31, 2023