ఫ్యూచర్ కార్.. గత కొంతకాలంగా చాలా సందర్భాల్లో ఈ పేరు వినే ఉంటారు. సాధారణంగా మార్వెల్ సినిమాల్లో, జేమ్స్ బాండ్ సినిమాల్లో మీరు సూపర్ కార్లను చూసుంటారు. వాటిలో ఎన్నో ఫీచర్లు ఉంటాయి. అందులో కూర్చుంటే ఏదో ప్రపంచంలో అడుగుపెట్టినట్లు ఉంటుంది. అంతా టెక్నాలజీతో ముడిపడి ఉంటుంది. ఒక ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్ తో పనిచేసే వాయిస్ ఒకటి వినిపిస్తూ ఉంటుంది. మీరు చెప్పిన పనులు చేయడం, కార్ డ్రైవ్ చేయడం, మీరు చేయాల్సిన టాస్కులను పూర్తి చేస్తూ ఉండటం, మిమ్మల్ని ఈ ప్రపంచానికి భిన్నంగా బతికేలా చేయడం చేస్తుంటాయి. అలాంటి కార్లను సినిమాల్లో చూసి వావ్ అనుకుంటారు. కానీ, ఇప్పుడు వాటిని రియాలిటీ చూసే అవకాశం దక్కింది.
ఈ సూపర్ కారును తీసుకొస్తోంది ఆడీ కంపెనీ. ఆడీ కంపెనీ నుంచి స్పియర్ పేరిట ఎలక్ట్రికల్ కార్ మోడల్స్ వచ్చాయి. ఇప్పుడు వాటిలో తమ ఆఖరి మోడల్ ను వినియోగదారులకు పరిచయం చేసింది. అందుకు సంబంధించిన ఒక వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఇది ఆడీ ఫ్యూచరిస్టిక్ వాహనం యాక్టివ్ స్పియర్ ఈవీ. దీనిలో స్క్రీన్లు, బటన్లు లాంటివి ఉండవు. ఇది నాలుగు డోర్లు తెరుచుకునే కూప్ కమ్, పికప్ ట్రక్ గా కూడా మారుతుంది. దీనిలో కన్సీల్డ్ టైమ్ ఇంటీరియర్ ఉంటుంది. ఇంక దీనిలో ఉండే ఫీచర్ల గురించి రోజు మొత్తం చెప్పుకున్నా కూడా సరిపోదు.
త్రీడీ కళ్లద్దాలతో ఈ కారుని కంట్రోల్ చేయచ్చు. అవును మీరు విన్నది నిజమే. ఈ కారుకు సంబంధించి ఆడీ కంపెనీ నుంచి త్రీడీ కళ్లద్దాలు వస్తాయి. అలాగే కారుని మీ ట్యాబ్ నుంచి కూడా కంట్రోల్ చేయచ్చు. మీరు బయల్దేరే ముందు ఒక బటన్ నొక్కగానే మీ కారు మీకోసం ఎదురుచూస్తూ ఉంటుంది. మీరు ఎక్కే ప్రదేశానికి అది చేరుకుంటుంది. అలాగే మీరు చేయి స్వింగ్ చేస్తే డోర్లు తెరుచుకుంటాయి. మీ చేయి స్వింగ్ చేస్తే డిక్కీ ఓపెన్ అవుతుంది. మీ కారుని ఒక్క క్లిక్ తో పికప్ ట్రక్ గా కూడా మార్చుకోవచ్చు. ముఖ్యంగా స్పోర్ట్స్ పర్సన్స్ కి ఇది ఉపయోగంగా ఉంటుందని చెబుతున్నారు. వారు విడుదల చేసిన వీడియోలో కూడా అదే విషయాన్ని స్పష్టం చేశారు.
గోల్ప్, సైకిలింగ్, స్కీఇంగ్, సర్ఫింగ్ వంటి ఆటలు ఆడే వారికి ఈ కారు చాలా ఉపయోగపడుతుందని చెబుతున్నారు. ఇక్కడ ఇంకో స్పెషల్ ఏంటి అంటే మీరు వెళ్లే చోటుకి మీ కారు మిమ్మల్ని ఫాలో అవుతుంది. మీరు వెళ్తూ ఉంటే మీ వెనకే ఈ ఫ్యూచర్ కారు వస్తూ ఉంటుంది. మీరు కారులో లేకపోయినా కూడా త్రీడీ కళ్లద్దాలతో మీ చేసే యాక్టివిటీకి సంబంధించిన ఇన్ పుట్స్ ఇస్తూ ఉంటుంది. ఈ ప్రపంచాన్ని వేరేలా చూసేందుకు ఈ కారు బాగా దోహదపడుతుంది. పైగా ఈ కారులో సెల్ఫ్ ఆర్గనైజ్డ్ ఛార్జింగ్ సిస్టమ్ ఉంటుంది. అంటే మీ కారు ఛార్జింగ్ గురించి మీరు పట్టించుకోవాల్సిన అసరం లేదు. అసలు మనిషి అవసరం లేకుండా ఇది డ్రైవ్ చేస్తుంది.
ఇది పూర్తి ఏఐ టెక్నాలజీ కంట్రోల్డ్ ఆటోమేటిక్ ఫ్యూచరిస్టిక్ కారు అయినప్పటికీ.. దీనికి మాన్యువల్ మోడ్ కూడా ఉంది. అంటే మీరు కావాలి అనుకుంటే దీనికి స్టీరింగ్ కూడా వస్తుంది. అయితే ఇది డ్యాష్ బోర్డులో దాగి ఉంటుంది. మీరు కోరుకున్న సమయంలో ఇది బయటకు వస్తుంది. ఇది ఆఫ్ రోడ్ వెహికల్ కూడా. అవును దీనిని ఆఫ్ రోడ్ డ్రైవ్స్ కి కూడా ఉపయోగించుకోవచ్చు. దారిని బట్టి అదే ఆఫ్ రోడ్ మోడ్ లోకి మారిపోతుంది. 800 వోల్ట్స్ సామర్థ్యంతో కూడిన ఛార్గింగ్ సిస్టమ్ తో వస్తోంది. 10 నిమిషాలు ఛార్జ్ చేస్తే 300 కిలోమీటర్ల రేంజ్ వరకు ప్రయాణించగలదని చెబుతున్నారు. ఓవరాల్ గా 600 కిలోమీటర్ల రేంజ్ తో ఈ కారు వస్తోందని చెబుతున్నారు. 5 నుంచి 85 శాతాం ఛార్జ్ కావడానికి కేవలం 25 నిమిషాలే పడుతుంది. ఇంకా దీనిలో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి.