చేతిలో స్మార్ట్ ఫోన్ లో లేకుంటే కాలం గడవని రోజులివి. పోనీ.. ఫోన్ ఉంటే సరిపోతుందా? అంటే కాదు.. దానికి ఇంటర్నెట్ కావాలి.. ప్రతిదానికి ఒక యాప్ కావాలి. పోన్ కాలింగ్ నుంచి ఈ-కామర్స్ ఆర్డర్స్ వరకు అన్ని రకాల పనులు యాప్లోనే జరుగుతాయి. యూజర్ల సౌకర్యం కోసమంటూ గూగుల్ ప్లేస్టోర్ లో ఎన్నో రకాల యాప్స్ పుట్టుకొస్తున్నాయి. అయితే వీటిలో కొన్ని నకిలీ యాప్స్ కూడా ఉన్నాయి. యూజర్ల డేటా దొంగిలించడం కోసం సైబర్ నేరగాళ్లు వీటిని ఉపయోగిస్తున్నారు. గూగుల్ అలాంటి వాటిని గుర్తించి ఎప్పటికప్పుడు ప్లేస్టోర్ నుంచి తొలగిస్తుంటుంది. తాజాగా ఇలాంటి యాప్స్ గురించి గూగుల్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్లేస్టోర్ లోని సుమారు తొమ్మిది లక్షల యాప్ లపై నిషేధం విధించింది.
గత రెండేళ్లుగా ఈ యాప్స్ అప్డేట్ కాకపోవడం, గూగుల్ నిబంధనలను పాటించకపోవడంతో గూగుల్ ఈ చర్యలు చేపట్టింది. అయితే గూగుల్ వీటిని పూర్తిగా తొలగిస్తుందా లేదా తాత్కాలికంగా నిషేధం విధిస్తుందా అనేది తెలియాల్సి ఉంది. నిషేధం విధించిన 9 లక్షల యాప్ లలో కొన్నింటిని యూజర్లు డౌన్లోడ్ చేసుకున్న తర్వాత వారి లొకేషన్, ఐఎస్ఈవి నంబర్, ఫోన్ నంబర్, ఉపయోగించే భాష వంటి వివరాలు సేకరించి వాటిని ప్రకటనల కోసం ఉపయోగిస్తున్నాయని వెల్లడించింది. వీటిలో సైబర్ నేరగాళ్లు ముందుగా యూజర్ పోన్ నంబర్ ఎంటర్ చేయమని అడిగి, తర్వాత ప్రీమియం ఎస్సెమ్మెస్ సర్వీసులకుసబ్స్క్రైబ్ చేసుకుంటే నగదు బహుమతులుంటాయని ఆశ చూపి యూజర్లను మోసగిస్తున్నట్లు సంస్థ తెలిపింది.
యూజర్లకు సూచనలు
యూజర్లు యాప్ డౌన్లోడ్ చేసుకునే ముందు వాటికి ప్లేస్టోర్ అథెంటికేషన్ ఉందా? లేదా? అనేది సరిచూసుకోవడంతోపాటు డెవలపర్స్ ఎవరు? ఆయా సంస్థలకు యూజర్ రేటింగ్ ఎంత ఉంది? యూజర్ల కామెంట్స్ వంటి వాటిని కూడా పరిగణలోకి తీసుకోమని గూగుల్ సూచిస్తోంది. కొద్ది రోజుల క్రితం గూగుల్ ప్లేస్టోర్ నుంచి 150 యాప్లను తొలగించింది. ఈ యాప్లు ‘అల్టిమాఎస్సెమ్మెస్’ అనే ప్రచారం నిర్వహిస్తూ ఆండ్రాయిడ్ ఫోన్ల నుంచి యూజర్ల డేటాను సేకరిస్తున్నాయని గూగుల్ తెలిపింది.
#Google is removing abandoned apps from the #GooglePlayStore, almost 9 lakhs of them. Here are all the details.https://t.co/mqcLJEP9lG
— Hindustan Times Tech (@HTTech) May 14, 2022