గాయాలు కావడం, వాటికి బ్యాండేజస్ వాడటం సర్వ సాధారణం. అయితే ఈ బ్యాడేజస్ తో గాయాలు తగ్గడం కాస్త నిదానంగానే జరుగుతుందని చెప్పాలి. అయితే ఇప్పుడు మార్కెట్ లోకి ఒక సూపర్ బ్యాండేజ్ రాబోతోంది. మాములు వాటితో పోలిస్తే ఇవి 30 శాతం వేగంగా గాయాలను మాన్చగలదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
మన ఉరుకుల పరుగుల జీవితంలో ఏదో ఒక రకంగా గాయాల పాలవుతుంటాం. కొన్ని గాయాలు అంత తేలిగ్గా తగ్గవు కూడా. అలాంటి సమయంలో మెడిసిన్ మాత్రమే కాకుండా.. బ్యాండేజెస్ కూడా వాడాల్సి వస్తుంది. కొన్ని సందర్భాల్లో పెద్ద పెద్ద బ్యాండేజస్ కూడా వాడుతుంటారు. అయితే మీరు ఇప్పటివరకు సాధారణమైన బ్యాండేజెస్ చూసుంటారు. కానీ, ఇప్పుడు మార్కెట్ లోకి సరికొత్త బ్యాండేజస్ రాబోతున్నాయి. అవి సాధారణ వాటికన్నా ఎంతో ప్రభావంతంగా ఉండబోతున్నాయని చెబుతున్నారు. ఇవి 30 శాతం వేగంగా, ప్రభావవంతంగా కూడా ఉంటాయని హామీ ఇస్తున్నారు. అసలు ఈ ఈ-బ్యాండేజస్ అంటే ఏంటో ఇప్పుడు చూద్దాం.
ఈ-బ్యాండేజస్ పై నార్త్ వెస్ట్రన్ యూనివర్సిటీ వాళ్లు పరిశోధనలు చేస్తున్నారు. ఈ బ్యాండేజస్ లో చాలా ప్రత్యేకతలు ఉన్నట్లు తెలిపారు. ఈ బ్యాండేజస్ వల్ల మీకు అయిన గాయం 30 శాతం వేగంగా తగ్గుతుంది. ఈ బ్యాండేజస్ ఎలక్ట్రోథెరపీ సాయంతో పనిచేయనున్నట్లు వెల్లడించారు. స్మార్ట్ రీ జనరేటివ్ సిస్టమ్ కు ఇదే తొలి ఉదాహరణగా శాస్త్రవేత్తలు చెబుతున్నారు. పైగా మధుమేహంతో బాధపడేవారికి ఇవి చాలా ఉపయోగకరంగా ఉంటాయని చెబుతున్నారు. నిజానికి ఘుగర్ వ్యాధి ఉన్న వారికి ఏదైనా గాయమైతే అంత తేలిగ్గా తగ్గదు.
ఈ బ్యాండేజస్ షుగర్ ఉన్న వారిపై ప్రభావంగా పని చేయడమే కాకుండా.. వారి గాయాలకు సంబంధించిన అప్ డేట్స్ ఎప్పటికప్పుడు మొబైల్ ఫోన్ లోని యాప్ కు పంపుతాయని తెలిపారు. అంతేకాకుండా షుగర్ వ్యాధి వారికి తక్కువ ధరలో ఇలాంటివి లభ్యమైతే బాగుంటుందని భావిస్తుంటారు. ఈ బ్యాండేజెస్ తక్కువ ధర, గాయాలను మాన్చడంలో ఎక్కువ ప్రభావవంతంగా పనిచేస్తాయని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ బ్యాండేజ్ లో రెండు ఎలక్ట్రోడ్స్ ఉంటాయి. చిన్న పువ్వు గుర్తుతో ఉండే ఎలక్ట్రోడ్ ఒకవైపు ఉంటే.. రెండోవైపు రింగ్ సింబల్ తో ఉండో ఎలక్ట్రోడ్ ఉంటుంది. దీనిలో శక్తిని ఉత్పత్తి చేసే కాయిల్ ఒకటి ఉంటుంది.
ఇవి గాయాల్లోకి ఎలక్ట్రోడ్స్ ని పంపుతూ త్వరగా నయం అయ్యేలా చేస్తాయి. సాధారణంగా ఉపయోగించే బ్యాండేజస్ కంటే కూడా ఇవి 30 శాతం ప్రభావవంతంగా పనిచేస్తాయని చెబుతున్నారు. అయితే గాయానికి సంబంధించిన వివరాలను కూడా ఇది అందజేస్తుంది. అంతేకాకుండా.. గాయం నయమైపోతే ఆటోమేటిక్ గా ఎలక్ట్రోడ్స్ ని పంపడం ఆపేస్తుంది. అయితే ఈ-బ్యాండేజస్ ఎప్పుడు మార్కెట్ లోకి, సాధారణ ప్రజలు ఉపయోగించేందుకు అందుబాటులోకి వస్తాయనేది మాత్రం వివరించలేదు. గాయాన్ని త్వరగా నయం చేసే ఈ-బ్యాండేజస్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.