ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్ కార్ట్.. ఐఫోన్ ప్రియులకు శుభవార్త చెప్పింది. యాపిల్ లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్ ఐఫోన్ -14 పై భారీ డిస్కౌంట్ ప్రకటించింది. డిస్కౌంట్/అడిషనల్ డిస్కౌంట్/ఎక్స్చేంజ్ పేరుతో తక్కువ ధరకే అందుబాటులోకి తెచ్చింది. ఆయా ఆఫర్లను కలుపుకుంటే రూ.79 వేల విలువైన ఐఫోన్ 14ను రూ. 51,900 కంటే తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు. అంటే.. అసలు ధరతో పోలిస్తే రూ. 28,000 తక్కువన్నమాట. దీపావళి సేల్స్ సమయంలో కూడా ఇవ్వని తగ్గింపును ఇపుడు ఇవ్వడం గమనార‍్హం.
ఐఫోన్ 14 (128జీబీ) మోడల్ అసలు ధర రూ.79,900 కాగా ఫ్లిప్‌కార్ట్‌లో రూ .77,400కు అందుబాటులో ఉంది. కొనుగోలు చేసే సమయంలో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ క్రెడిట్/డెబిట్ కార్డు ఉపయోగించినట్లయితే రూ. 5000 తగ్గింపు అదనం. అలాగే పాతఐఫోన్, ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ ఎక్స్ఛేంజ్‌పై యూజర్లు రూ.20,500 వరకూ తగ్గింపు పొందుతారు. వీటికి ఫ్లిప్ కార్ట్ ఎక్స్ఛేంజ్ డీల్ రూ. 3,000 అదనం. ఈ మూడు ఆఫర్లను కలుపుకుంటే.. రూ. 51,900 కంటే తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు. అయితే.. రూ. 20,500 ఎక్స్ఛేంజ్ విలువ అనేది ప్రీమియం స్మార్ట్‌ఫోన్‌లకు మాత్రమే వర్తిస్తుంది. ఐఫోన్ 12 ప్రొపై రూ. 20వేలు, ఐఫోన్ 11 ధరపై రూ. 15వేలు తగ్గింపు పొందవచ్చు. అలాగే.. శాంసంగ్ గెలాక్సీ ఎస్20 అల్ట్రాపై రూ. 12,450.వన్‌ప్లస్ 7టీ పై 10,100 రూపాయల ఎక్స్ఛేంజ్ ధర పొందవచ్చు.
iPhone 14 available at Rs 51,900 on Flipkart#iPhone14 https://t.co/BBHhcYG3pe
— BGR.in (@BGRIndia) December 5, 2022
ఇందులో 6.7 ఇంచెస్ OLED డిస్‌ప్లే, ఏ15 బయోనిక్ చిప్‌సెట్ అందించారు. ఇందులో వెనుకవైపు డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటుంది. ప్రధాన కెమెరా 12 ఎంపీ కాగా, మరొకటి 12 ఎంపీ కెమెరానే. ఇక సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందు భాగంలో 12 ఎంపీ ఫ్రంట్ కెమెరా అందించారు. బ్యాటరీ సామర్థ్యం 3279 mAh. ఐఓఎస్ 16 ప్లాట్ ఫార్మ్ పై పనిచేస్తుంది.