పండగ పూట ఈ కామర్స్ సంస్థ ‘ఫ్లిప్ కార్ట్’ చేసిన ఓ తప్పు కస్టమర్ ను ఆనందభరితుడిని చేసింది. ఇప్పటివరకు ఈ కామర్స్ సైట్లలో ఆర్డర్లు బుక్ చేస్తే.. ప్యాకింగ్ పొరపాటు కారణంగానో లేదా డెలివరీ అసోషియేట్లు చేసే తప్పుల కారణంగానో.. ఆర్డర్ చేసిన పెట్టెల్లో ఇటుకలు, సబ్బులు వచ్చిన ఘటనలు జరుగుతుండేవి. అయితే.. ఈసారి వాటికి భిన్నంగా జరిగింది. ఐఫోన్ 13ను ఆర్డర్ పెట్టిన ఓ కస్టమర్.. ఫ్లిప్ కార్ట్ చేసిన పనికి ఒక్కసారిగా సర్ప్రైజ్ అయ్యాడు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇంతకీ విషయం ఏంటంటే..
ఇటీవల ఫ్లిప్ కార్ట్ బిగ్ ‘బిలియన్ డేస్ సేల్’ పేరుతో భారీ ఆఫర్లను ప్రకటించిన సంగతి తెలిసిందే. సెప్టెంబర్ 23 నుంచి 30 మధ్య సెల్ ఫోన్లు, గృహోపకరణాలు, తదితర వస్తువులపై భారీ డిస్కౌంట్లు ప్రకటించింది. ఈ క్రమంలో ఐఫోన్ లపై కూడా బంపర్ డిస్కౌంట్లు ఇచ్చింది. దీంతో చాలామంది ఐఫోన్ లవర్స్ ఆ ఫోన్ లను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపించారు. ముఖ్యంగా సేల్స్ లో ఐఫోన్ 13 తక్కువ ధరకే రావడంతో కొనడానికి జనాలు పోటీ పడ్డారు. విపరీతంగా ఐఫోన్ 13 ఫోన్లను ఆర్డర్ చేశారు. ఇలా ఆర్డర్ పెట్టిన చాలా మందిని ఫ్లిప్ కార్ట్ మోసం చేసిందనే వార్తలు కూడా వచ్చాయి. ‘ఆర్డర్లు క్యాన్సిల్ చేసిందంటూ..’ కొనుగోలుదారులు అందుకు సంబంధించిన స్క్రీన్ షాట్లను సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశారు. అయితే, ఇక్కడ మాత్రం ఓ వ్యక్తికి ఫ్లిప్ కార్ట్ గుడ్ న్యూస్ చెప్పింది. ఐఫోన్ 13 ఆర్డర్ ఇస్తే.. ఐఫోన్ 14 డెలివరీ చేసింది. ఈ విషయాన్ని ఓ యూజర్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. తనకు తెలిసిన వ్యక్తికి ‘ఐఫోన్ 13 ఆర్డర్ చేస్తే ఐఫోన్ 14 వచ్చిందంటూ..’ ట్విట్ చేశాడు.
One of my follower ordered iPhone 13 from Flipkart but he recieved iPhone 14 instead of 13 😂 pic.twitter.com/FDxi0H0szJ
— Ashwin Hegde (@DigitalSphereT) October 4, 2022
అశ్విన్ హెగ్డే అనే యూజర్ చేసిన ట్వీట్ సారాంశాన్ని గమనిస్తే.. “నా అనుచరులలో ఒకరు ఫ్లిప్ కార్ట్ లో ఐఫోన్ 13ని ఆర్డర్ చేసారు, కానీ అతనికి 13కి బదులుగా ఐఫోన్ 14 వచ్చింది..” అంటూ సదరు ఆర్డర్ కు సంబంధించిన స్క్రీన్ షాట్ షేర్ చేశాడు. దీంతో ఆ ట్వీట్ వైరల్‌గా మారింది. అయితే.. ఈ పోస్టుపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. ఐఫోన్ 13, ఐఫోన్ 14ల మధ్య పెద్దగా తేడా ఏమీ లేదు. అందుకే ఐఫోన్ 13కు బదులు ఫ్లిప్ కార్ట్ ఐఫోన్ 14న డెలివరీ చేసిందేమో అంటూ కామెంట్స్ చేస్తున్నారు.