Flipkart Big Billion Days Sale: దేశంలో పండగల సీజన్ సమీపిస్తున్న నేపథ్యంలో ప్రముఖ ఈ కామర్స్ ప్లాట్‌ఫాంలు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ ప్రత్యేక సేల్ కు సిద్ధమవుతున్నాయి. సెప్టెంబర్ 23 నుంచి అమెజాన్ లో గ్రేట్ ఇండియన్ ప్రారంభం కానుండగా, సెప్టెంబర్ 23 – 30 వరకు ఫ్లిప్‌కార్ట్ లో బిగ్ బిలియన్ డేస్ సేల్ 2022 జరగనుంది. కాగా, ఫ్లిప్‌కార్ట్, బిగ్ బిలియన్ డేస్ సేల్ 2022 కు సమయం దగ్గర పడుతుండగా.. ఆ కంపెనీ సేల్ కు సంబంధించిన ఆకర్షణీయమైన డిస్కౌంట్లను ఒక్కొక్కటిగా ప్రకటిస్తోంది. అందులో భాగంగా నథింగ్ ఫోన్ (1) (Nothing Phone (1)) ఫోన్ పై అద్భుతమైన ఆఫర్ ఉంది. ఆ వివరాలు..
రూ. 5 వేల డిస్కౌంట్:
8జీబీ ర్యామ్ + 128జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్ పై ఈ ఆఫర్ అందుబాటులో ఉంది. ఈ మోడల్ రూ.32,999 ధరలో దేశంలో లాంచ్ అయింది. ఆపై.. ఇటీవల స్మార్ట్‌ఫోన్ ధరను రూ.33,999కు పెంచింది. అయితే.. ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ 2022లో ఈ ఫోన్‌పై అద్భుతమైన డీల్ అందుబాటులో ఉంచింది. ఫ్లిప్‌కార్ట్ టీజర్ ప్రకారం.. ఈ మొబైల్ రూ.5000 తగ్గింపుతో అందుబాటులోకి రానుంది. ఈ తగ్గింపులో బ్యాంక్ ఆఫర్‌లు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే.. ఏ బ్యాంకు వినియోగదారులకు ఈ తగ్గింపు వర్తిస్తుందనే విషయం టీజర్‌లో వెల్లడి కాలేదు.
నథింగ్ ఫోన్ (1) ప్రత్యేకత:
ఇతర ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ల మాదిరి కాకుండా, డిజైన్ పరంగా చూసే వారికి నథింగ్ ఫోన్ (1) మంచి ఎంపిక. ఈ మొబైల్ ఐఫోన్ లాంటి ప్రత్యేక డిజైన్‌తో, ట్రాన్సపరెంట్ బ్యాక్ ప్యానల్ లుక్ తో రూపొందించారు. యూనిక్ డిజైన్ కలిగి మిడ్‌రేంజ్ స్మార్ట్‌ఫోన్‌కి అప్‌గ్రేడ్ కావాలనుకునే వారికి ఇదో అద్భుతమైన డీల్‌గా కనిపిస్తోంది.
Meet Phone (1).
It’s pure instinct. Formed as a machine. Told through beautiful symbols. Deeper interactions. And brave simplicity.
Discover more about the Glyph Interface and Nothing OS at https://t.co/WAZe9Avh0J pic.twitter.com/3OHNM5TxZh
— Nothing (@nothing) July 12, 2022
నథింగ్ ఫోన్ (1) స్పెసిఫికేషన్స్:
6.55 ఇంచెస్ ఫుల్ హెచ్‌డీ+ ఓఎల్ఈడీ డిస్‌ప్లే ఈ స్మార్ట్ ఫోన్‌లో అందించారు. 120 హెర్ట్జ్ అడాప్టివ్ రిఫ్రెష్ రేట్ ఫీచర్, కార్నింగ్ గొరిల్ల గ్లాస్ ప్రొటెక్షన్ ఉన్నాయి. క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 778జీ ప్లస్ ప్రాసెసర్‌పై నథింగ్ ఫోన్ 1 పనిచేస్తుంది. 12 జీబీ వరకు ఎల్పీడీడీఆర్5 ర్యామ్, 256 జీబీ వరకు యూఎఫ్ఎస్ 3.1 స్టోరేజ్ అందించారు. ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేస్తుంది.
ఇక కెమెరాల విషయానికి వస్తే.. వెనకవైపు రెండు కెమెరాలు ఉన్నాయి. వీటిలో ప్రధాన కెమెరాగా 50 మెగాపిక్సెల్ సోనీ ఐఎంఎక్స్766 సెన్సార్ కాగా, రెండోది 50 మెగాపిక్సెల్ శాంసంగ్ జేఎన్1 సెన్సార్‌ను అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్‌గా అందించారు. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 16 మెగాపిక్సెల్ సోనీ ఐఎంఎక్స్471 సెన్సార్ అందించారు.
ఇక బ్యాటరీ విషయానికొస్తే.. బ్యాటరీ సామర్థ్యం 4500 ఎంఏహెచ్ కాగా, 33W వైర్డ్ చార్జింగ్, 15W వైర్‌లెస్ చార్జింగ్, 5W రివర్స్ చార్జింగ్‌కు ఈ ఫోన్ సపోర్ట్ చేస్తుంది. వీటితో పాటు 5జీ, 4జీ ఎల్టీఈ, వైఫై 6, వైఫై 6 డైరెక్ట్, బ్లూటూత్ వీ5.2, ఎన్ఎఫ్‌సీ, జీపీఎస్/ఏ-జీపీఎస్, గ్లోనాస్, గెలీలియో, క్యూజెడ్ఎస్ఎస్, యూఎస్‌బీ టైప్-సీ పోర్టు వంటి కనెక్టివిటీ ఫీచర్లు అందించారు. ఇక, ఆన్‌బోర్డ్ సెన్సార్‌లలో ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్, యాక్సిలరోమీటర్, ఎలక్ట్రానిక్ కంపాస్, గైరోస్కోప్, యాంబియంట్ లైట్ సెన్సార్ మరియు ప్రాక్సిమిటీ సెన్సార్ వంటి ఫీచర్స్ కూడా ఉన్నాయి.
My first reaction to the Nothing Phone LEDs and wild sounds 😂🤯
Is this necessary? No.
Is it cool? YA 🤪😜😝 pic.twitter.com/OUKiSmDlQH— iJustine (@ijustine) August 9, 2022