వాచుల పరిశ్రమలో ఒక బ్రాండ్ గా వెలుగొందుతోన్న ప్రముఖ యాక్ససరీస్ బ్రాండ్ ‘ఫాస్ట్రాక్’ తన ఫస్ట్ బ్లూటూత్ స్మార్ట్‌వాచ్‌ను లాంచ్ చేసింది. ‘ఫాస్ట్రాక్ రిఫ్లెక్స్ ప్లే+’ పేరుతో ఈ కాలింగ్ స్మార్ట్‌వాచ్‌ను తీసుకొచ్చింది. గతంలో సాధారణ స్మార్ట్‌వాచ్‌లను అందుబాటులోకి తెచ్చినప్పటికీ, బ్లూటూత్ కాలింగ్ ఫీచర్‌తో రిలీజ్ చేయడం ఇదే మొదటిసారి. సర్క్యులర్ షేప్ డిజైన్, అమోలెడ్ డిస్‌ప్లే, అల్యూమినియమ్ కేస్‌తో లుక్‌పరంగానూ ఈ వాచ్ ఎంతో ఆకర్షణీయంగా ఉంది. ధర, ఫీచర్స్ ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..
ధర:
‘ఫాస్ట్రాక్ రిఫ్లెక్స్ ప్లే+’ ను రూ. 6995 ధరతో లాంచ్ చేసింది. అయితే.. ఈ-కామెర్స్ సైట్ అమెజాన్ లో రూ. 1,000 తగ్గింపుతో రూ. 5,995 ధరకు అందుబాటులో ఉంది. అలాగే ఫాస్ట్రాక్ ఆఫ్‌లైన్ స్టోర్‌లోనూ కొనుగోలు చేయొచ్చు. బ్లాక్, బ్లూ, పింక్, అక్వాబ్లూ కలర్ ఆప్షన్స్‌లో అందుబాటులో ఉంది.
స్పెసిఫికేషన్స్, ఫీచర్స్:
ఫాస్ట్రాక్ రిఫ్లెక్స్ ప్లే+లో రౌండ్ షేప్ డయల్ ఉంటుంది. 1.3 ఇంచుల అమోలెడ్ డిస్‌ప్లే అందించారు. సిలికాన్ స్ట్రాప్స్‌ను కలిగి ఉంది. బ్లూటూత్ కాలింగ్ ఫీచర్‌తో ఈ స్మార్ట్‌వాచ్ ను తీసుకొచ్చారు. ఇందుకోసం ఇన్‌బుల్ట్‌గా మైక్, స్పీకర్ ఉన్నాయి. బ్లూటూత్ ద్వారా స్మార్ట్‌ఫోన్‌కు కనెక్ట్ అయిప్పుడు కాల్స్ వస్తే నేరుగా వాచ్ నుంచే ఆన్సర్ చేయవచ్చు. వాచ్ నుంచే కాల్స్ మాట్లాడవచ్చు, డయల్ చేయొచ్చు.
ఇక, హెల్త్ ఫీచర్స్ విషయానికొస్తే.. హార్ట్‌రేట్ మానిటరింగ్, బ్లడ్ ఆక్సిజన్ సాచురేషన్ ట్రాకర్(SpO2), బ్లడ్ ప్లజర్ మానిటరింగ్.. వంటి హెల్త్ ఫీచర్లను అందించారు. అలాగే విభిన్నమైన స్పోర్ట్స మోడ్స్‌కు సపోర్ట్ చేస్తుంది. ఫోన్‌కు కనెక్ట్ అయినప్పుడు నోటిఫికేషన్స్ అలెర్ట్‌లను ఈ వాచ్‌లో పొందవచ్చు. మ్యూజిక్, కెమెరాను కూడా కంట్రోల్ చేయవచ్చు. స్మార్ట్‌ఫోన్‌లో ఫాస్ట్రాక్ రిఫ్లెక్స్ వరల్డ్ యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకొని ఈ వాచ్‌ను సింక్ చేసుకోవచ్చు. ఫుల్ చార్జ్‌పై ఈ స్మార్ట్‌వాచ్ ఏడు రోజుల బ్యాటరీ లైఫ్ ఇస్తుందని కంపెనీ పేర్కొంది. ఈ స్మార్ట్‌వాచ్ ధర, స్పెసిఫికేషన్స్ పై, మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Fastrack Reflex Play with 1.3-inch Large AMOLED Round Display
– Blood Pressure Monitor
– 24×7 HRM, SpO2
– 25+ Multisport Modes
– Sleep Monitor & Women’s Health Tracker
– Built-in Games
– 4 ColorsPrice – 5995 pic.twitter.com/U8czai0zBb
— Govardhan Reddy (@gova3555) August 30, 2022