స్మార్ట్ వాచ్ వినయోగదారులు గణనీయంగా పెరిగిపోతున్నారు. అందుకే మార్కెట్ లోకి స్మార్ట్ వాచెస్ రిలీజెస్ కూడా పెరిగిపోయాయి. బోట్ కంపెనీ నుంచి ఇప్పటికే చాలా వాచెస్ రిలీజ్ అయ్యాయి. ఇప్పుడు మరో బడ్జెట్ స్మార్ట్ వాచ్ ని బోట్ కంపెనీ రిలీజ్ చేసింది.
స్మార్ట్ వాచ్ ల వాడకం ఎంతగా పెరిగిందో అందరికీ తెలుసు. ఇప్పుడు అవి అలంకారం మాత్రమే కాకుండా అవసరంగా మారిపోయాయి. అందుకే మార్కెట్ లో పెరుగుతున్న డిమాండునకు అనుగుణంగా ఉత్పత్తిని కూడా పెంచుతున్నారు. ఇప్పటికే చాలా కంపెనీలు ఈ స్మార్ట్ వాచ్ తయారీలోకి దిగాయి. అయితే ఈ స్మార్ట్ వాచ్ తయారీలో ఎప్పటి నుంచో ఉన్న బోట్ కంపెనీ నుంచి మరో బడ్జెట్ స్మార్ట్ వాచ్ రాబోతోంది. ఇప్పటికే బోట్ నుంచి బడ్జెట్, ప్రీమియం రేంజ్ లలో ఎన్నో స్మార్ట్ వాచెస్ వచ్చాయి. ఇప్పుడు ఆ లిస్టులోకి మరో స్మార్ట్ వాచ్ చేరింది. ఫీచర్స్- డిజైన్ పరంగా ఎంతో ప్రీమియం అనిపించినా.. ధర విషయంలో మాత్రమే బడ్జెట్ స్మార్ట్ వాచ్ అనిపించుకుంది.
బోట్ కంపెనీకి ఇండియన్ మార్కెట్ లో ఎంతో ఆదరణ ఉంది. బోట్ కంపెనీకి చెందిన ఇయర్ బడ్, హెడ్ ఫోన్స్ కి ఎలా అయితే గుర్తింపు లభించిందో.. అలాగే స్మార్ట్ వాచెస్ కి కూడా మంచి మార్కెట్ ఏర్పడింది. ఇప్పటికే బోట్ కంపెనీ నుంచి చాలా బడ్జెట్ స్మార్ట్ వాచెస్ ఉన్నాయి. ఇప్పుడు బోట్ వేవ్ ఫ్లెక్స్ కనెక్ట్ పేరిట మరో బడ్జెట్ స్మార్ట్ వాచ్ ని బోట్ కంపెనీ రిలీజ్ చేసింది. వేవ్ సిరీస్ లో ఇది మరో మోడల్ అనమాట. దీని ఎమ్మార్పీ రూ.7,990 కాగా 81 శాతం డిస్కౌంట్ తో కేవలం రూ.1,499కే అందిస్తున్నారు. ఈ వాచ్ బోట్ కంపెనీ అధికారిక వెబ్ సైట్, ఫ్లిప్ కార్ట్ లలో లభిస్తోంది.
ఈ బోట్ వేవ్ ప్లెక్స్ కనెక్ట్ స్మార్ట్ వాచ్ ఫీచర్ల విషయానికి వస్తే.. దీనిలో 1.83 హెచ్ డీ డిస్ ప్లే ఉంది. ఇది మెటల్ డిజైన్ తో లభిస్తోంది. ఇందులో బ్లూటూత్ కాలింగ్ ఫీచర్ కూడా ఉంది. ఈ స్మార్ట్ వాచ్ లో 10 వరకు కాంటాక్ట్స్ సేవ్ చేసుకోవచ్చు. దీనిలో డైల్ ప్యాడ్ కూడా ఉంటుంది. ఇందులో ఇన్ బిల్ట్ మైక్- స్పీకర్ ఉన్నాయి. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 10 రోజుల వరకు బ్యాటరీ బ్యాకప్ వస్తుంది. 30 రోజుల వరకు స్టాండ్ బైలో ఉంటుంది. 10 యాక్టివ్ స్పోర్ట్స్, డైలీ యాక్టివిటీ ట్రాకర్, ఐపీ68 డస్ట్- వాటర్ రెసిస్టెన్స్ తో వస్తోంది. హార్ట్ రేట్, బ్లడ్ ఆక్సిజన్, స్లీపింగ్, సెడంటరీ అలెర్ట్స్, వెదర్, మ్యూజిక్- కెమెరా కంట్రోల్ వంటి ఫీచర్స్ ఉన్నాయి. ఈ బోట్ వేవ్ ఫ్లెక్స్ కనెక్ట్ బడ్జెట్ స్మార్ట్ వాచ్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
boAt Wave Flex Connect with 1.83″ display, Bluetooth calling launched at an introductory price of Rs. 1499 https://t.co/Zk6bkuBzca pic.twitter.com/Zb54pcAob3
— FoneArena Mobile (@FoneArena) March 3, 2023