బీఎండబ్ల్యూ సంస్థ తన వందేళ్ల చరిత్రకు సాక్ష్యంగా రెండు సూపర్ బైక్‌లను భారత మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. R9T 100 ఇయర్స్, R 18 100 ఇయర్స్ పేరిట లిమిటెడ్ ఎడిషన్ లో ఈ బైక్‌లను విడుదల చేసింది. ఈ బైక్‌ల ధరలు కాస్త ఎక్కువుగా కారు కంటే వేగంగా దూసుకెళ్లడం వీటి ప్రత్యేకత. R18 100 గంటకు 180 కిలోమీటర్ల వేగంగా తీసుకెళ్తే, R9T 100 గంటకు 200 కిలోమీటర్ల వేగంగా దూసుకెళ్లగలదు.
జర్మనీ వాహన సంస్థ బీఎండబ్ల్యూ తన వందేళ్ల చరిత్రకు సాక్ష్యంగా రెండు సూపర్ బైక్‌లను భారత మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. R9T 100 ఇయర్స్, R 18 100 ఇయర్స్ పేరిట లిమిటెడ్ ఎడిషన్ లో ఈ బైక్‌లను విడుదల చేసింది. వీటి ధరలు వరుసగా రూ.24 లక్షలు (ఆర్ 9టి 100 ఇయర్స్), రూ.25.90 లక్షలు (ఆర్ 18 100 ఇయర్స్) గా ఉన్నాయి. బీఎండబ్ల్యూ నుంచి తొలిసారిగా 1923లో R 32 బైకులు మార్కెట్లోకి విడుదలయ్యాయి. అందుకు గుర్తుగా సరిగ్గా 100 సంవత్సరాల తరువాత లిమిటెడ్ ఎడిషన్స్ రూపంలో వీటిని తీసుకొచ్చారు. ఇవి లిమిటెడ్ ఎడిషన్స్ కనుక ఒక్కొక్క మోడల్ నుంచి కేవలం 1923 యూనిట్లు మాత్రమే అందుబాటులో ఉంటాయి.
ఈ బైక్‌ల ధరలు కాస్త ఎక్కువుగా కారు కంటే వేగంగా దూసుకెళ్లడం వీటి ప్రత్యేకత. R18 100 గంటకు 180 కిలోమీటర్ల వేగంగా తీసుకెళ్తే, R9T 100 గంటకు 200 కిలోమీటర్ల వేగంగా దూసుకెళ్లగలదు. ఈ రెండు బైక్‌ల ప్రత్యేకతలు ఏంటి..? వీటి ఫీచర్లు ఏంటి..? అన్నది ఇప్పుడు తెలుసుకుందాం..
#TimesDriveNewsBrake
– @bmwmotorrad_in launched the BMW R nineT 100 Years and the BMW R 18 100 Years limited edition
The BMW R nineT 100 Years – INR 24,00,000
The BMW R 18 100 Years – INR 25,90,000
(ex-showroom prices)@tntimesdrive @BMW @bmwindia pic.twitter.com/QRWjWqTUsU— Kranti Sambhav (@Kranti_Sambhav) February 21, 2023
బీఎండబ్ల్యూ ఆర్ 9టి 100 మోడల్.. రోడ్‌స్టర్ మోటార్‌సైకిల్ మాదిరిగా ఉంటుంది. ఇది ఎయిర్ కూల్డ్ 1,170 సీసీ ఎయిర్/ఆయిల్ కూల్డ్ టూ సిలిండర్, ఫోర్ స్ట్రోక్ ఇంజన్‌తో వస్తుంది. 107.2 బీహెచ్‌పీ పవర్ 100.7 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ ఇంజన్‌తో బైక్ గంటకు 200 కిలోమీటర్లకు మించిన వేగంతో దూసుకెళ్లగలదు. ఇక ఆర్ 18 విషయానికొస్తే.. ఇది క్రూయిజర్ మోటార్‌సైకిల్ మాదిరిగా ఉంటుంది. ఇందులో 1,802 సీసీ ఇంజిన్ అందించారు. ఈ బైక్ 67 కిలో వాట్ శక్తిని, 158 ఎన్ఎమ్ టార్క్‌ను అందిస్తుంది. ఈ బైక్ ను గంటకు 180 కిలోమీటర్ల స్పీడ్ కంటే వేగంగా నడపవచ్చు.
మొత్తంగా చెప్పాలంటే లిమిటెడ్ ఎడిషన్స్ కనుక పేరుకు తగ్గట్టుగానే బ్యాడ్జ్, క్రోమ్ మిక్స్డ్ ఫ్యూయెల్ ట్యాంక్, మిల్లింగ్ సిలిండర్ హెడ్ కవర్లు, ఇంజన్ హౌసింగ్ కవర్లు, సీట్ హోల్డర్లు, ఆయిల్ ఫిల్లర్ ప్లగ్, అడ్జస్టబుల్ హ్యాండ్ లివర్లు, ఫుట్‌పెగ్‌లు వంటివి ఇందులో చూడవచ్చు. సేఫ్టీ కోసం ASC, రెయిన్ అండ్ రోడ్ రైడింగ్ వంటి స్టాండర్డ్ ఆప్షన్స్ అందించారు. అలాగే, ఈ బైక్ గురుంచి చెప్పల్సిన మరొక ప్రత్యేక విషయం.. సీట్. ఈ బైకుల సీటును డ్యూయల్ టోన్ బ్లాక్ అండ్ ఆక్స్‌బ్లడ్ ఫినిషింగ్‌తో ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. ఈ బైక్‌లపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Now it’s time to celebrate #100YearsBMWMotorrad!✨
Enjoy the walk around the BMW R nineT 100 Years and BMW R 18 100 Years with all their highlights!
▶️ Check out or website for more information: https://t.co/AF0ICxU3Cu #MakeLifeARide #BMWR18 #RnineT #SoulFuel #BMWMotorrad pic.twitter.com/q0XUKwuVQd
— BMWMotorrad (@BMWMotorrad) December 16, 2022