2జిలు, 3జిలు పోయి 4జి వచ్చింది. ఇప్పుడు 4జిని మించిన 5జి టెక్నాలజీ వచ్చేసింది. ఇప్పటికే దేశంలోని ప్రధాన నగరాల్లో 5జి టెలికాం సేవలు అందుబాటులో ఉన్నాయి. ఈ మేరకు అన్ని స్మార్ట్ ఫోన్లలో 5జి సర్వీసులు అందించేలా కంపెనీలు పని చేయాలని భారత ప్రభుత్వం యాపిల్ సహా ఇతర స్మార్ట్ ఫోన్ కంపెనీలకు సూచించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో మోటోరోలా, వన్ ప్లస్, ఒప్పో వంటి కంపెనీలు 5జి అప్డేట్ ని తీసుకొచ్చాయి. కానీ 5జి నెట్వర్క్, 5జి స్మార్ట్ ఫోన్ ఉన్నా గానీ యాపిల్ కంపెనీ మాత్రం ఇప్పటి వరకూ 5జి అప్డేట్ ని తీసుకురాలేదని బాధపడుతున్న ఐఫోన్ వినియోగదారులకు కంపెనీ శుభవార్త చెప్పింది. ఐఫోన్లలో 5జి సపోర్ట్ తో అతి పెద్ద అప్డేట్ ని ఇచ్చేస్తోంది. ఐఫోన్లలో 5జి సర్వీస్ ని ఎనేబుల్ చేసే అధికారిక అప్డేట్ ను యాపిల్ కంపెనీ ఇవాళ విడుదల చేసింది.
ఇవాళ్టి నుంచి అంటే డిసెంబర్ 14 నుంచి ఐఫోన్లలో 5జి సేవలను పొందవచ్చు. 5జి సేవలు పొందేలా ఇవాళ యాపిల్ కంపెనీ. ఐఓఎస్ 16.2 ఆపరేటింగ్ సిస్టమ్ ను తీసుకొచ్చింది. ఐఫోన్లలో 5జి సేవలను పొందేలా సాఫ్ట్ వేర్ బేటా అప్డేట్ ని తీసుకొచ్చింది. ఎంపిక చేసిన యూజర్లకు నెల రోజుల టెస్టింగ్ కోసం పబ్లిక్ డేటా అప్డేట్ ని కూడా తీసుకొచ్చింది. యాపిల్ ఐఫోన్ 14 సహా ఇతర ఐఫోన్లు అన్నీ ఈ అప్డేట్ ద్వారా 5జి సేవలను పొందవచ్చు. ఎయిర్ టెల్, జియో నెట్వర్క్ 5జి సేవలను పొందవచ్చు. ఐఫోన్ యూజర్లు 5జి నెట్వర్క్ సేవల కోసం 4జి సిమ్ కార్డ్ ని మార్చాల్సిన పని లేదు. ఎందుకంటే 4జి సిమ్ 5జికి సపోర్ట్ చేస్తుంది. ఈ ఫీచర్ తో పాటు మరికొన్ని ఫీచర్స్ తీసుకొచ్చింది.
ఫ్రీ ఫార్మ్ అనే ఫీచర్ ను తీసుకొచ్చింది. ఇది వైట్ బోర్డులా పని చేస్తుంది. యూజర్లు అందరూ కలిసి ఈ ఫ్రీ ఫార్మ్ లో ఫైల్స్ ఎడిట్ చేసుకోవచ్చు. యాపిల్ మ్యూజిక్ లో సింగ్ అనే కొత్త ఫీచర్ తీసుకొచ్చింది. ఈ ఫీచర్ తో వినియోగదారులు ఫేవరెట్ సాంగ్స్ ని పాడుకోవచ్చు. ఐక్లౌడ్ బ్యాకప్ కేటగిరీలకు, నోట్స్, ఫోటోలు వంటి వాటికి ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్షన్ ఫీచర్ ను తీసుకొచ్చింది. ఐఫోన్ 14 ప్రో వేరియెంట్ లో ఆల్వేస్ ఆన్ డిస్ప్లే ఎనేబుల్ చేసినప్పుడు.. లాక్ స్క్రీన్ మీద వాల్ పేపర్, నోటిఫికేషన్స్ ని హైడ్ చేసే ఫీచర్ కూడా వచ్చింది. మెసేజెస్ లో సెర్చ్ ఇంప్రూవ్మెంట్ ఫీచర్ ని తీసుకొచ్చింది. కుక్క, కార్, పర్సన్ లేదా ఫోటోకి సంబంధించిన పేరు టైపు చేస్తే సంబంధిత ఫోటోలు వచ్చేలా కొత్త ఫీచర్ ని తీసుకొచ్చింది.
మీ ఐఫోన్ లో 5జిని సపోర్ట్ చేసే 5జి బ్యాండ్ ఉందో లేదో ఇక్కడ క్లిక్ చేసి తెలుసుకోండి