గూగుల్ ప్లే స్టోర్.. దీని గురుంచి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ వాడుతున్న అందరకి ఇది బాగా సుపరిచితమే. ఎంతలా అంటే.. ఏ విషయం గురుంచైనా తెలియనపుడు ‘గూగుల్’ లో ఎలా శోధిస్తామో.. ఏదైనా యాప్ కావాలన్నప్పుడు ‘గూగుల్ ప్లే స్టోర్’ అలాంటిదే. కొన్ని స్మార్ట్ ఫోన్ల కంపనీలకు సంబంధించి ఆయా యాప్‌లు ఉన్నా .. మనకు తెలిసిందల్లా గూగుల్ ప్లే స్టోరే. పొరపాటున రాబోవు రోజుల్లో 4 రోజులు గూగుల్ ప్లే స్టోర్ పనిచేయలేదు అంటే.. స్మార్ట్ ఫోన్ వాడుతున్న పరిస్థితి ఎలా ఉంటుందో కూడా ఊహించలేం. అలాంటి గూగుల్ ప్లే యాప్ కు నేటితో పదేళ్లు నిండాయి. ఈ నేపథ్యంలో స్మార్ట్ ఫోన్ వినియోగం గతిని మార్చిన యాప్స్, గేమ్స్ గురించి గూగుల్ వెల్లడించింది.
ఈ పది సంవత్సరాల కాలంలో గూగుల్ ప్లే ఎన్నో యాప్స్ ను మనకు పరిచయం చేసింది. చిట్ చాట్ సంభాషణల నుంచి మ్యూజిక్, షాపింగ్, ఎంటర్టైన్మెంట్, డిజిటల్ పేమెంట్స్.. ఇలా ఎన్నో రకాల యాప్‌లు మనముందున్నాయంటే అది గూగుల్ ప్లే వల్లే సాధ్యం. ఆండ్రాయిడ్ విడుదలైన తొలినాళ్లలో ఆండ్రాయిడ్ మార్కెట్, గూగుల్ మ్యూజిక్, గూగుల్ మూవీస్, గూగుల్ ఈబుక్ స్టోర్.. అంటూ వేర్వేరుగా ఉండేవి. వాటన్నింటిని ఒకే తాటికిందకు తీసుకొస్తూ గూగుల్ ప్లే భాండాగారాన్ని గూగుల్ రూపొందించింది. ప్రస్తుత సమాచారం ప్రకారం గూగుల్ ప్లేలో ఇప్పటి వరకు నాలుగున్నర లక్షల యాప్‌లు ఉన్నాయట. ఈ క్రమంలో గూగుల్ ప్లేలో అత్యంత ఆదరణ పొందిన యాప్‌ల వివరాలను మనతో పంచుకుంది.
This year marks our 10th year of Google Play-ing. To celebrate, we’re offering Play Points members a 10x points boost, starting today. How has it been a DECADE 🤔🤯🤔 Claim your points boost here: https://t.co/xoVIQsxHns #PlayTurns10 pic.twitter.com/76pQbQqDBY
— Google Play (@GooglePlay) July 25, 2022
అత్యధిక డౌన్ లోడ్స్
సోషల్ మీడియా కేటగిరిలో వాట్సాప్, షేర్ చాట్ ముందువరుసలో ఉంటే .. ఎంటర్టైన్మెంట్ జాబితాలో ఎమ్ఎక్స్ ప్లేయర్, డిస్నీ+హాట్ స్టార్ ముందువరుసలో ఉన్నాయి. అలాగే.. షాపింగ్ కోసం ఎక్కువ మంది ఫ్లిప్కార్ట్, అమెజాన్ ఉపయోగిస్తున్నారట. ఇక.. డిజిటల్ చెల్లింపుల కోసం పేటీఎం, ఫోన్ పే ఎక్కువ మంది ఉపయోగిస్తున్నట్లు తెలిపింది. ఇక.. గేమ్స్ విషయానికొస్తే.. క్యాండీ క్రష్ టాప్ లో నిలవగా.. తర్వాత వరసగా క్లాష్ ఆఫ్ క్లాన్స్, సబ్ వే సర్ఫర్స్, 8 బాల్ పూల్, లార్డ్స్ మొబైల్ టవర్ డిఫెన్స్రియల్ క్రికెట్ 20, కాల్ ఆఫ్ డ్యూటీ.. వంటి గేమ్స్ ఉన్నాయి.
relax, recharge, recentre… and Crush pic.twitter.com/RpVN1z5mZb
— Candy Crush Saga (@CandyCrushSaga) July 20, 2022
ఇదీ చదవండి: Google Meet: ఇకపై ‘యూట్యూబ్’లోనే ఆన్‌లైన్ మీటింగ్స్ లైవ్ స్ట్రీమింగ్!
ఇదీ చదవండి: Google Maps: గూగుల్ మ్యాప్స్‌లో అదిరిపోయే ఫీచర్.. దీని గురించి మీకు తెలుసా?..