కన్ను తెరిస్తే జననం.. కన్ను మూస్తే మరణం.. రెప్పపాటు జీవితం. అవును ఆ మాట నూటికి నూరు శాతం నిజం. క్రీడల్లో ఎప్పుడు ఏం జరుగుతుంది అని ఎవ్వరూ చెప్పలేరు. నిరుపేద కుటుంబం నుంచి వచ్చాడు. ఆటను నమ్ముకుని కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. తన ఆట ఎప్పటికైనా తన కుటుంబాన్ని ఆదుకుంటుందని నమ్మాడు. గొప్ప ఫుట్ బాల్ ప్లేయర్ గా ఎదుగుతున్న అతడిని చూసి విధి వెక్కిరించింది. ఆ ఆటే అతని ప్రాణాలు తీసింది.
బెంగాల్ ఫుట్‌బాల్ యువ కెరటం దేబోజ్యోతి ఘోష్(25) ఆట మధ్యలో గాయపడ్డాడు. ఆ తర్వాత గుండెపోటుతో తుదిశ్వాస విడిచాడు. శనివారం దుబులియా బెల్పుకూర్ గ్రౌండ్ లో ఫుట్ బాల్ టోర్నమెంట్ మ్యాచ్ లో ఘోష్ పాల్గొన్నాడు. మ్యాచ్ ఆడుతున్న సమయంలో బాల్ ఘోష్ ఛాతీకి బలంగా తాకింది. అక్కడికక్కడే అతను స్పృహ కోల్పోయాడు. వెంటనే నిర్వాహకులు ఆస్పత్రికి తరలించారు. ఆ సమయంలో దేబోజ్యోతి తీవ్రంగా వాంతులు చేసుకున్నాడు. వైద్యుల సూచన మేరకు మెరుగైన వైద్యం కోసం అతడిని కృష్ణానగర్ షక్రిగఢ్ ఆస్పత్రికి తరలించారు. ఈ లోపే ఆటగాడు మృతిచెందాడు. అతను గుండెపోటుతో మరణించినట్లు వైద్యుల నిర్ధారించారు.దేబోజ్యోతి మృతితో సహచర ఆటగాళ్లు కన్నీరుమున్నీరయ్యారు. అతను ‘కెనడియన్ ఫుట్ బాల్ లీగ్-2022’కి ఎంపికయ్యాడు. కానీ, ఈలోపే ఇలా అర్ధాంతరంగా ప్రాణాలు కోల్పోయాడు. అతని మీదే ఆధారపడిన ఆ కుటుంబం రోడ్డున పడ్డట్లైంది. అతను చాలా నిరుపేద కుటుంబం నుంచి బెంగాల్ ఫుట్ బాల్ లో ఓ సంచలనంగా ఎదిగాడు. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
We are disheartened to know the news of the 25-year-old midfielder Debojyoti Ghosh passing away! 💔
He played a key role in helping Railway FC reach the CFL final this season! 💐 pic.twitter.com/y0W89PlsBk
— IFTWC (@IFTWC) March 19, 2022
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.