ఉమెన్స్ మ్యాచ్ ఏం చూస్తావు.. రా! ఫస్ట్ బ్యాటింగ్ ఆడినోళ్లు 200 కొడతారు.. అక్కడితో మ్యాచ్ వన్ సైడ్. ఇది తొలి రెండు మ్యాచులు ముగిశాక అందరి నోటి నుంచి వచ్చిన మాటలు. కానీ, మూడో మ్యాచ్ అందుకు తెరదించింది. విజయం సాధించాలంటే ఆఖరి 18 బంతుల్లో 53 పరుగులు కావాలి.. చేతిలో ఉన్నవి మూడే వికెట్లు.. ఈ దశలో యూపీ వారియర్స్ నిజంగానే పేరుకు తగ్గ ప్రదర్శన చేసింది. బిగ్‌బాష్ స్టార్ గ్రేస్ హ్యారిస్ (26 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్సర్లతో 59 నాటౌట్) అసాధారణ రీతిలో చెలరేగి మ్యాచ్ యూపీ వశం చేసింది.
మహిళల ప్రీమియర్ లీగ్ అంచనాలకు మించి సాగుతోంది. తొలి రెండు మ్యాచుల్లో భారీ స్కోర్లు నమోదై వన్ సైడ్ గా సాగినా, మూడో మ్యాచ్ అసలు మజాను చూపించింది. అభిమానులకు కావాల్సినంత కిక్ ఇచ్చింది. ఆఖరి ఓవర్ వరకూ విజయం ఇరు జట్ల మధ్య దోబూచులాడుతున్న సమయాన బిగ్‌బాష్ స్టార్ గ్రేస్ హ్యారిస్ (26 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్సర్లతో 59 నాటౌట్) అసాధారణ రీతిలో చెలరేగి యూపీకి అనూహ్య విజయాన్ని అందించింది. తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ నిర్ణీత ఓవర్లు ముగిసేసరికి 169 పరుగులు చేయగా, యూపీ 19.5 ఓవర్లలో ఆ లక్ష్యాన్ని చేధించింది.
మొదట టాస్ గెలిచి బ్యాటింగ్ కు దిగిన గుజరాత్ జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసింది. హర్లీన్ డియోల్ (46) రాణించడంతో గుజరాత్ ఆ మాత్రం స్కోరైనా చేయగలిగింది. 76 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన దశలో.. గార్డ్‌నర్, హర్లీన్ వేగంగా ఆడి జట్టు భారీ స్కోర్‌కు బాటలు వేశారు. ఆషే గార్డ్‌నర్ (25), దయలాన్ మేహలత (21 నాటౌట్) చివర్లో ధాటిగా ఆడారు. వారియర్స్ బౌలర్లలో ఎక్లెస్టోన్, దీప్తి శర్మ తలా రెండు వికెట్లు తీసుకోగా, అంజలి సర్వాని, తహిలా మెక్‌గ్రాత్‌కు ఒక్కో వికెట్ దక్కింది. అనంతరం సాధారణ లక్ష్యంతో బరిలోకి దిగిన యూపీకి ఆదిలోనే కోలుకోలేని దెబ్బ తగిలింది. పేసర్ కిమ్ గార్త్ ధాటికి యూపీ 20 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. ఈ దశలో భారత సీనియర్ బ్యాటర్ కిరన్ నవ్‌గిరె భారీ షాట్లతో అదరగొట్టింది.
Kim Garth in one over:
☝🏻Alyssa Healy
☝🏻Shweta Sehrawat
☝🏻Tahlia McGrathThat’s how you start 🔥🔥#WPL2023
pic.twitter.com/kXBb6hx50F— Women’s CricZone (@WomensCricZone) March 5, 2023
ఎలాంటి బెదురు లేకుండా బౌండరీలు బాదిన నవ్‌గిరె, 40 బంతుల్లోనే అర్ధ సెంచరీ మార్క్ చేరుకుంది. నాలుగో వికెట్‌కు దీప్తి (11)తో కలిసి 66 పరుగులు జోడించింది. అంతా సవ్యంగా సాగుతున్న దశలో దీప్తి శర్మ బౌల్డ్ గా వెనుదిరగటం, ఆపై 13వ ఓవర్‌లో కిమ్ గార్త్ వరుస వికెట్లు తీయడంతో ఇక యూపీ ఓటమి ఖాయమేననిపించింది. కానీ, గ్రేస్ హ్యారిస్ మాత్రం పట్టు వదలకుండా వరుస ఫోర్లతో బెంబేలెత్తించింది. 17వ ఓవర్ ముగిసేసరికి జట్టు స్కోరు 117 పరుగులు మాత్రమే. విజయానికి ఆఖరి 18 బంతుల్లో 53 పరుగులు కావాలి.. చేతిలో ఉన్నవి మూడే వికెట్లు.. ఈ దశలో గ్రేస్ పరుగుల సునామీ సృష్టించింది. 18 ఓవర్ లో 20, 19 ఓవర్ లో 14 పరుగులు రావడంతో ఆఖరి ఓవర్ లో విజయానికి 21 పరుగులు అవసరమయ్యాయి. అలాంటి సమయాన ఆఖరి ఓవర్ తొలి 5 బంతులను 6,2,4,4,6గా మలిచిన గ్రేస్ యూపీకి అద్భుత విజయాన్నందించింది. కాగా, గుజరాత్ కు ఇది రెండో ఓటమి. డబ్ల్యూపీఎల్ ఆరంభ మ్యాచ్‌లో గుజరాత్ జట్టు ముంబై ఇండియన్స్ చేతిలో 143 పరుగుల తేడాతో ఓటమి పాలైంది.
Celebrate like Grace Harris! 🎉🥳#WPL2023
— Women’s CricZone (@WomensCricZone) March 5, 2023
Grace harris
When the student follows teachers you can see the same efforts pic.twitter.com/joEsdEJifQ— devesh muhammad anthony (@DeveshS53401757) March 5, 2023