విటాలిటీ టీ 20 బ్లాస్ట్ లో భాగంగా నిన్న మిడిలెసెక్స్, సర్రే జట్ల మధ్య పరుగుల వరద పారింది. భారీ స్కోర్లు నమోదైన ఈ మ్యాచులో సర్రే ప్లేయర్ తుఫాన్ ఇనింగ్స్ తో చెలరేగిపోయాడు. అతడు ఒక ఆర్సీబీ ప్లేయర్ కావడం విశేషం.
ఐపీఎల్ లో బ్యాడ్ లక్ అంటే ఆర్సీబీదే. ట్రోఫీ గెలవడానికి ఎన్నో ఏళ్లుగా పోరాడుతుంటే దురదృష్టం మాత్రం వెంటాడుతోనే ఉంది. ప్రతి సీజన్ స్టార్లతో కళకళలాడుతూ ట్రోఫీ మీద ఆశలు కలిగిస్తుంది. కానీ ఏం లాభం అంచనాలను అందుకోలేక ప్రతిసారి అభిమానులని నిరాశకు గురి చేస్తుంది. తాజాగా వీరిని మరోసారి దురదృష్టం వెంటాడిందనే చెప్పాలి. అదేంటో కాదు ఆర్సీబీ జట్టులో ఉన్న ఒక ప్లేయర్ నిన్న తుఫాన్ ఇన్నింగ్స్ తో చెలరేగి ఆడాడు. అతడెవరో కాదు ఇంగ్లాండ్ యువ సంచలనం విల్ జాక్స్. ఇది సంతోషించాల్సిన విషయం అనుకుంటే పొరపాటే. ఎందుకంటే ఈ ఏడాది ఆర్సీబీ జట్టులో జాక్స్ చేరినా గాయం కారణంగా ఈ సీజన్ ఆడలేదు.
ఐపీఎల్ కి ముందు విల్ జాక్స్ మీద భారీ అంచనాలే ఉన్నాయి. 3.2 కోట్లకు బెంగళూరు జట్టు కొనుగోలు చేసింది. పవర్ హిట్టింగ్ చేయడంతో పాటు బౌలింగ్ కూడా వేయగలడు. కానీ గాయం కారణంగా జాక్స్ ఈ సీజన్ ఐపీఎల్ ఆడలేదు. అయితే ఇప్పుడు జాక్స్ ఇంగ్లాండ్ లోని విటాలిటీ టీ 20 బ్లాస్ట్ లో వరుసగా 5 సిక్సర్లతో చెలరేగాడు. కేవలం 45 బంతుల్లోనే 96 పరుగులతో విధ్వంసం సృష్టించాడు . ఇతనికి తోడు ఇవాన్స్ కూడా 37 బంతుల్లో 85 పరుగులు చేసి భారీ స్కోర్ చేయడంలో కీలక పాత్ర పోషించారు. ఇక జాక్స్ ఇన్నింగ్స్ లో హైలెట్ అంటే 11 ఓవర్ అని చెప్పుకోవాలి. ఈ ఓవర్లో ఆకాశమే హద్దుగా చెలరేగి పోయాడు.
హోల్మన్ వేసిన ఈ ఓవర్లో వరుసగా 5 బంతుల్లో 5 సిక్సర్లు కొట్టి మొత్తం 31 పరుగులు రాబట్టాడు ఈ టీ 20 బ్లాస్ట్ లో సర్రే తరపున ఆడుతున్న జాక్స్..మిడిలెసెక్స్ మ్యాచ్‌లో ఈ సంఘటన చోటు చేసుకుంది. జాక్స్ ఇన్నింగ్స్ లో మొత్తం 7 సిక్సర్లు, 8 ఫోర్లు ఉన్నాయి. ఇక భారీ ఇన్నింగ్స్ ఆడినా ఈ మ్యాచుల్లో సర్రే టీం ఓడిపోవడం మరో విశేషం. 254 పరుగులు చేసినా మిడిలెసెక్స్ ఛేజ్ చేసి రికార్డ్ సృష్టించింది. మొత్తానికి జాక్స్ బాగా ఆడినందుకు ఆర్సీబీ సంతోషించాలో లేకపోతే ఈ ఐపీఎల్ కి దూరమయ్యాడని బాధపడాలో అర్ధం కానీ పరిస్థితి. ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలపండి.
Exceptional batting from Will Jacks 👏
He hits 31 from the over, just missing out on six sixes 😲#Blast23 pic.twitter.com/RVrsw20clo
— Vitality Blast (@VitalityBlast) June 22, 2023