ఇంగ్లండ్ టెస్టు కోచ్‌గా న్యూజిలాండ్ మాజీ డాషింగ్ ఓపెనర్ బ్రెండన్ మెక్‌కల్లమ్ వచ్చిన తర్వాత ఇంగ్లీష్ టీమ్ ఆటలో భారీ మార్పు వచ్చింది. బజ్‌బాల్ స్ట్రాటజీతో టెస్టు క్రికెట్‌ను అగ్రెసివ్‌గా ఆడటం మొదలుపెట్టారు. ఆస్ట్రేలియాతో యాషెస్ సిరీస్‌లోనూ ఇదే స్ట్రాటజీతో ఇంగ్లండ్ జట్టు మంచి ప్రదర్శనను కనబర్చింది. అలాగే ఆ జట్టు టెస్టు కెప్టెన్ బెన్ స్టోక్స్ సైతం టెస్టుల్లో దూకుడైన ఆటతీరును ఆడేందుకే ఇష్టపడటంతో.. మెక్‌కల్లమ్-స్టోక్స్ జోడీ టెస్టుల్లో ఇంగ్లండ్ జట్టును మరింత పటిష్టం చేసింది. కానీ.. సౌతాఫ్రికాతో జరిగిన టెస్టు సిరీస్‌లో మాత్రం ఇంగ్లండ్ జట్టు నిరాశపర్చింది. ఆ సమయంలో మెక్‌కల్లమ్ బజ్‌బాల్ స్ట్రాటజీపై విమర్శలు వచ్చాయి.
కానీ.. తాజాగా పాకిస్థాన్‌తో ప్రారంభం కానున్న మూడు టెస్టుల సిరీస్‌లోనూ బజ్‌బాల్ స్ట్రాటజీతోనే ఆడతామని మెక్‌కల్లమ్ వెల్లడించాడు. ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా.. ప్రత్యర్థి బౌలర్లపై ఎటాకింగ్ క్రికెట్‌తో దాడి చేయడమే బజ్‌బాల్ స్ట్రాటజీ. అయితే.. ఆస్ట్రేలియాపై వర్క్ అవుట్ అయిన ఈ గేమ్‌ప్లాన్, సౌతాఫ్రికాపై బెడిసి కొట్టింది. ఆ తర్వాత.. టీ20 వరల్డ్ కప్‌లో ఛాంపియన్‌గా నిలిచిన ఇంగ్లండ్ జట్టు. 17 ఏళ్ల తర్వాత పాకిస్థాన్ గడ్డపై టెస్టు సిరీస్ ఆడేందుకు అడుగుపెట్టింది. వరల్డ్ కప్ కంటే ముందు 7 టీ20ల సిరీస్‌ను ఆడిన ఇంగ్లండ్.. మళ్లీ మూడు టెస్టుల కోసం బెన్ స్టోక్స్ కెప్టెన్సీలో అడుగుపెట్టింది. పాకిస్థాన్‌పై బజ్ బాల్ స్ట్రాటజీతో సిరీస్ గెలవాలని ఇంగ్లండ్ టీమ్ గట్టి పట్టుదలతో ఉంది.
అలాగే.. టెస్టుల్లో ఇంత అగ్రెసివ్ గేమ్ ఆడేందుకు గల కారణాలను ఇంగ్లండ్ టెస్టు టీమ్ కోచ్ మెక్‌కల్లమ్ వెల్లడించాడు. టెస్టు క్రికెట్‌కు ఆధారణ పెంచేందుకు, టెస్టు మ్యాచ్ చూసేందుకు జనం డబ్బు ఖర్చుపెట్టేలా వారిని సంప్రదాయ క్రికెట్ వైపు తిప్పాలనే ప్రయత్నంలో భాగంగా అగ్రెసివ్ స్ట్రాటజీ ఫాలో అవుతున్నట్లు మెక్‌కల్లమ్ పేర్కొన్నాడు. కాగా.. టీ20 లాంటి ఫాస్ట్ ఫుడ్ ఫార్మాట్ వచ్చిన తర్వాత.. సంప్రదాయ టెస్టు క్రికెట్‌కు ప్రేక్షకుల ఆదరణ తగ్గిపోయింది. కొంతమంది అయితే.. టెస్టు క్రికెట్‌ను పూర్తిగా రద్దు చేయాలనే వాదన కూడా వినిపిస్తున్నారు. అయితే.. క్రికెట్‌లోని అసలు మజా.. టెస్టుల్లోనే ఉందని చాలా మంది క్రికెటర్లు సైతం పేర్కొన్నారు. అయితే.. మ్యాచ్ చూసేందుక వచ్చిన వారికి జిడ్డు ఆటతో చిరాకు తెప్పించకుండా.. కాస్త దూకుడుగా ఆడి వినోదం పంచడమే తమ లక్ష్యమని మెక్‌కల్లమ్ వెల్లడించాడు.
Brendon McCullum has big plans for Test cricket 🏏#crickettwitter #england #pakistan #engvpak pic.twitter.com/bJWxNMOtWf
— Sportskeeda (@Sportskeeda) November 29, 2022