టీమిండియా ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ ప్రస్తుతం ఇంగ్లండ్ కౌంటీ క్రికెట్ ఆడుతున్న విషయం తెలిసిందే. లంకాషైర్‌కు ప్రాతినిధ్యం వహిస్తూ మంచి ప్రదర్శన కనబరుస్తున్నాడు. గాయం కారణంగా టీమిండియాకు దూరమైన సుందర్ కోలుకుని కౌంటీల్లో ఆడుతున్నాడు. తాజాగా మ్యాచ్ గెలిచిన ఆనందంలో సుందర్ డ్యాన్స్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
రాయల్ లండన్ వన్డే-కప్‌లో భాగంగా లంకాషైర్, యార్క్‌షైర్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో లంకాషైర్ ఏడు వికెట్లతో విజయం సాధించింది. మ్యాచ్ గెలిచిన సంతోషాన్ని లంకాషైర్ జట్టు సభ్యులు డ్రెస్సింగ్‌రూమ్‌లో పెద్ద ఎత్తున్న సెలబ్రేట్ చేసుకున్నారు. మ్యాచ్ అనంతరం డ్రెస్సింగ్ రూమ్‌లో డ్యాన్స్‌తో రచ్చ చేశారు. ఈ గ్యాంగ్‌లో టీమిండియా క్రికెటర్ వాషింగ్టన్ సుందర్ కూడా తన డాన్స్‌తో అదరగొట్టాడు.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన యార్క్‌షైర్ 48.3 ఓవర్లలో 224 పరుగులకు ఆలౌట్ అయింది. విల్ ప్రెయిన్ 41 పరుగులు చేయగా.. టాటెర్సల్ 34 పరుగులు చేశాడు. అనంతరం బ్యాటింగ్ చేసిన లంకాషైర్ 41 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని అందుకుంది. లూక్ వెల్స్ 88 పరుగులతో ఆకట్టుకోగా.. జోష్ బొహానన్ 51 పరుగులు చేశాడు. చివర్లో వాషింగ్టన్ సుందర్ 30 నాటౌట్, స్టీవెన్ క్రాఫ్ట్ 31 నాటౌట్ జట్టును విజయతీరాలకు చేర్చారు.
A roses 𝒔𝒑𝒆𝒄𝒊𝒂𝒍 🌹
🌹 #RedRoseTogether pic.twitter.com/cKIGlfCj8g
— Lancashire Cricket (@lancscricket) August 4, 2022
ఇది కూడా చదవండి: ఆసీస్ దిగ్గజ బౌలర్ మెక్‌గ్రాత్ మెచ్చిన టీమిండియా యువ బౌలర్లు వీళ్లే!