పాక్ పై ఓటమితో టీమిండియాపై ఇంటా.. బయటా.. విమర్శలు వస్తూనే ఉన్నాయి. ఇక తాజాగా శ్రీలంకతో జరిగిన మ్యాచ్ లో కూడా భారత్ పరాజయం పాలవడంతో ఈ విమర్శలు ఇంకా ఎక్కువ అయ్యాయి. సులభంగా గెలవాల్సిన రెండు మ్యాచ్ ల్లోనూ టీమిండియా ఓడిపోయింది. దీంతో ఆసియా కప్ లో భారత జట్టు కథ దాదాపుగా ముగిసిపోయింది. ఎన్నో అద్భుతాలు జరిగితే తప్ప భారత్ ఆసియా కప్ లో ఫైనల్ కి వెళ్లే పరిస్థితి లేదు. ఇక శ్రీలంకపై ఓటమి తర్వాత టీమిండియా బౌలింగ్ దళంపై భారత డాషింగ్ బ్యాట్స్ మెన్ వీరేంద్ర సెహ్వాగ్ సంచలన కామెంట్స్ చేశాడు. ఈ వార్తకు సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళితే..
పాకిస్థాన్ పై 181 పరుగులు, శ్రీలంకపై 173 పరుగులు.. భారత్ ప్రత్యర్థిపై సాధించిన రన్స్. టీ20ల్లో ఈ రన్స్ తక్కువేమీ కాదు. పైగా భారత బౌలింగ్ దళంలో మంచి మంచి బౌలర్లు ఉన్నారు. దాంతో అందరు ఆ మ్యాచ్ ల్లో టీమిండియానే గెలుస్తుంది అనుకున్నారు. కానీ బొమ్మ తిరగబ డింది. ఇక భారీ స్కోర్లు సాధించినప్పటికీ ఇండియా ఓడిపోవడంతో భారత బౌలింగ్ పై వీరేంద్ర సెహ్వాగ్ సంచలన కామెంట్స్ చేశాడు. భారత బౌలింగ్ పై అతడు మాట్లాడుతూ.. “టీమిండియా బౌలింగ్ వైఫల్యం చాలా స్పష్టంగా రెండు మ్యాచ్ ల్లో కనిపించింది. పాకిస్థాన్ కు చివరి 2 ఓవర్లలో26 పరుగులు అవసరం కాగ.. లంకకు 21 రన్స్ అవసరం అయ్యాయి. ఈ రెండు గేముల్లో బౌలర్లు తేలిపోయారు.
అయితే ఈ క్రమంలో మరో బాధాకరమైన విషయం ఏంటంటే? రెండు మ్యాచ్ ల్లో అనుభవం గల టాలెంటెడ్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ దారుణంగా విఫలం అవ్వడం. భువనేశ్వర్ కంటే ఈ మ్యాచ్ లో యువ ఆటగాడు అర్షదీప్ చాలా బాగా ఆడాడు. 170-180 పరుగులను కూడా కాపాడుకోలేక పోయిన బౌలర్లను ప్రపంచ మేటి బౌలర్లు అని ఎలా అంటారని” సెహ్వగ్ ప్రశ్నించాడు. అదీకాక ” టీమిండియా ఫీల్డ్ ప్లేస్ మెంట్ కూడా చాలా చెత్తగా ఉంది. అసలు భువనేశ్వర్ వైడ్ యార్కర్స్ ఎందుకు వేస్తున్నాడు.. అలాంటి బాల్స్ కు బ్యాట్స్ మెన్ అవుటయ్యే అవకాశాలు చాలా తక్కువ. భువీ తన మునపటి ఫామ్ కు వచ్చి వికెట్ల ముందు యార్కర్స్ సంధించాలని” కొరుకుంటున్నాట్లు వీరేంద్ర సెహ్వాగ్ పేర్కొన్నాడు. మరి భారత బౌలింగ్ దళంపై డాషింగ్ బ్యాటర్ వీరేంద్ర సెహ్వాగ్ చేసిన ఈ వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.