క్రిికెట్ లో ఎన్ని ఫార్మాట్స్ వస్తున్నాగానీ టెస్ట్ క్రికెట్ కు ఉన్న ఆదరణ మాత్రం తగ్గడం లేదని సెహ్వాగ్ అభిప్రాయ పడ్డాడు. ఇక టెస్ట్ క్రికెట్ చరిత్రలో నేను చూసిన బెస్ట్ మ్యాచ్ ఇదే అని చెప్పుకొచ్చాడు.
టెస్ట్ క్రికెట్ మొదలయ్యి ఇప్పటికి 140 సంవత్సరాలు గడిచినా ..ఈ ఫార్మాట్ కి క్రేజ్ పెరుగుతూనే ఉంది, కానీ ఎప్పుడూ తగ్గలేదు. ఎప్పుడో 1877లో మొదలైన టెస్ట్ క్రికెట్.. ఇప్పటికీ అభిమానులకి కావాల్సినంత వినోదాన్ని ఇస్తూనే ఉంది. ఈ మధ్యకాలంలో వన్డేలకు ఆదరణ తగ్గుతూ వస్తుంది అన్న వాదన కూడా ఉంది. అదేవిధంగా ప్రపంచంలో టీ20 లీగ్ లు ఎక్కువవుతున్ననేపథ్యంలో ప్రేక్షకులు వీటిపై అంతగా ఆసక్తి చూపించట్లేదు. ఈ క్రమంలో 100 బాల్స్ టోర్నమెంట్, 10-10 మ్యాచ్ లు టీ20ల కంటే ఎక్కువగా మజాను ఇస్తున్నాయి. అయితే ఇన్ని టోర్నీలు వస్తున్నాగానీ.. సాంప్రదాయ క్రికెట్ గా పేరుగాంచిన టెస్ట్ క్రికెట్లో మాత్రం ఈ మజా తగ్గట్లేదు.
ముఖ్యంగా ఐసీసీ “డబ్ల్యూటీసీ”ని ఎప్పుడైతే ప్రవేశపెట్టిందో అప్పటి నుండి టెస్ట్ క్రికెట్ కి మరింత ఊపు వచ్చింది. అందుకే ఈ ఫార్మాట్ మీద చాలా మంది మాజీలు మనసు పారేసుకుంటున్నారు. ఇప్పటికీ చాలా మంది క్రికెట్ దిగ్గజాలు, పండితులు టెస్ట్ క్రికెట్ అంటే తమకి ఎంత ఇష్టమో తెలియజేసారు. తాజాగా భారత మాజీ ఓపెనర్ డాషింగ్ బ్యాట్స్ మెన్ టెస్టు క్రికెట్ మీద తన ప్రేమను వ్యక్తపరిచాడు. నిన్న న్యూజిలాండ్, ఇంగ్లండ్ మధ్య రెండో టెస్ట్ మ్యాచ్ ముగిసిన సంగతి తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ క్రికెట్ ప్రేమికులకు అసలైన టెస్టు క్రికెట్ మజాను చూపించించిందరి డ్యాషింగ్ బ్యాటర్ వీరేంద్ర సెహ్వాగ్ చెప్పుకొచ్చాడు.
ఈ మ్యాచ్ లో తొలి ఇన్నింగ్స్ లో ఇంగ్లండ్ 435 పరుగులు చేసింది. ఆ తర్వాత న్యూజిలాండ్ ని 209 పరుగులకే కట్టడి చేసి, భారీ ఆధిక్యాన్ని సాధించింది ఇంగ్లాండ్. ఇక్కడ వరకు బాగానే ఉంది.. అయితే ఈ దశలో ఇంగ్లండ్ ఓడిపోతుందని ఎవరు కూడా ఊహించి ఉండరు. అగ్రెస్సివ్ క్రికెట్ ఆడుతూ టెస్టు క్రికెట్ కి సరికొత్త అర్ధం చెప్పిన ఇంగ్లండ్ గెలుపు ఖాయమనుకున్నారంతా. అయితే రెండో ఇన్నింగ్స్ లో కివీస్ జట్టు ఫాలో-ఆన్ ఆడుతూ అసాధారణ పోరాటం చేయడంతో 483 పరుగుల భారీ స్కోర్ చేసి.. 258 పరుగుల మోస్తారు టార్గెట్ ని ఇంగ్లండ్ ముందు ఉంచింది.
ఈ టార్గెట్ ఇంగ్లండ్ కి ఏమంత కష్టం కాదని భావించారంతా. కానీ చివరికి కివీస్ చేతిలో ఒక్క రన్ తేడాతో ఓడిపోయి పరాజయాన్ని మూటకట్టుకుంది బ్రిటీష్ జట్టు. ఈ టెస్టులో ఎవరు గెలిచారు అనే సంగతి పక్కన పెడితే అభిమానులకి మంచి కిక్ అయితే ఇచ్చింది. ఆద్యంతం ఇంగ్లండ్ పై చేయి సాధించినా చివరకు న్యూజిలాండ్ నే విజయం వరించింది. దీంతో ఇప్పుడు ఈ మ్యాచ్ మీద అభిమానులు, క్రికెట్ పండితులు టెస్టు క్రికెట్ గొప్పతనాన్ని తెలియజేసే పనిలో ఉన్నారు. ఈ మ్యాచ్ గురించి టీమిండియా మాజీ ఆటగాడు డ్యాషింగ్ బ్యాటర్ వీరేంద్ర సెహ్వాగ్ స్పందిస్తూ.. “టెస్టు క్రికెట్ ఈజ్ ది బెస్ట్ క్రికెట్” అనే స్టేట్ మెంట్ ఇచ్చి టెస్టు క్రికెట్ విలువను తెలియజేశాడు.
ఈ మ్యాచ్ గురించి మరింతగా సెహ్వాగ్ మాట్లాడుతూ.. “వావ్ వాట్ ఏ మ్యాచ్.. ఫాలో ఆన్ ఆడుతూ కివీస్ పోరాడిన తీరు అద్భుతం. ఇటీవల కాలంలో అత్యంత ఉత్కంఠ భరితంగా సాగిన మ్యాచ్ ఇది. టెస్టు క్రికెట్ ని తన ఆటతీరుతో ఇంగ్లండ్ మరింత ఉత్తేజకరంగా మారుస్తోంది” అని ఈ మాజీ ఓపెనర్ ట్వీట్ చేసాడు. మరి భారత మాజీ డాషింగ్ ఓపెనర్ టెస్టు క్రికెట్ మీద తన ఇష్టాన్ని తెలియజేయడం మీకెలా అనిపించిందో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Test Cricket is Best Cricket. What a Match. England Vs @BLACKCAPS has become one of the most dramatic clashes in recent times , another thrilling game.
Well done to NZ on a great win after being asked to follow-on and well done Eng on making the best format most exciting #EngvNZ— Virender Sehwag (@virendersehwag) February 28, 2023