ఎన్నో రికార్డులు నెలకొల్పిన విరాట్ కోహ్లీ మీద ఎవరో ఒకరు విమర్శలు చేస్తూనే ఉంటారు. అలాంటి విమర్శకులకు ఆటతోనే కాదు మాటతో కూడా సమాధానం చెబుతాడు కింగ్ కోహ్లీ. ఈ విషయంలో కోహ్లీ ఏమన్నాడంటే ?
కొంతమంది ప్లేయర్లు బ్యాట్ తో సమాధానం చెబుతారు. మరి కొంతమంది మాటతోనే జవాబిస్తారు. కానీ టీమ్ ఇండియా స్టార్ విరాట్ కోహ్లీ మాటకు మాటే, ఆటకు ఆటే. ఎందులోనూ తగ్గేదే లేదంటాడు. కేవలం మైదానంలోనే కాదు బయట కూడా కింగ్ తన దూకుడుని చూపిస్తాడు. అందుకే కోహ్లీ గురించి విమర్శించాలంటే కాస్త ఆలోచించాల్సిందే. తప్పుంటే హుందాగా ఒప్పుకునే కోహ్లీ.. తన మీద అనవసరంగా నోరు జారితే మాత్రం సైలెంట్ గా ఉండలేడు. లెక్కకు లెక్క అనేవిధంగా ఉంటుంది కింగ్ యాటిట్యూడ్. తాజాగా తనపై వస్తున్న విమర్శలకు కోహ్లీ దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చాడు. ఇంతకీ కోహ్లీని ఎవరు విమర్శించ్చారు? ఎవరికి కోహ్లీ కౌంటర్ ఇచ్చాడు ?
ఐపీఎల్ లో బెంగళూరు తన చివరి మ్యాచ్ ని లక్నో సూపర్ జయింట్స్ మీద ఆడిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ లో బెంగళూరు భారీ స్కోర్ చేసినా .. చివరి బంతికి ఓడిపోయింది. ఇదిలా ఉండగా.. ఓపెనర్ కోహ్లీ ఈ మ్యాచ్ లో అర్ధ సెంచరీతో రాణించాడు. 44 బంతుల్లో 61 పరుగులు చేసిన కోహ్లీ ప్రారంభంలో వేగంగా ఆడినా.. ఆ తర్వాత కాస్త నెమ్మదించాడు. ఈ క్రమంలో 42 పరుగుల నుంచి 50 కి చేరుకోవడానికి కోహ్లీ 10 బంతులు తీసుకున్నాడు. ఈ నేపథ్యంలో న్యూజీలాండ్ మాజీ క్రికెటర్ సైమన్ డౌల్ కోహ్లీ మీద వివాదాస్పద వ్యాఖ్యలు చేసాడు. కోహ్లీ వ్యక్తి గత రికార్డుల కోసం నిదానంగా బ్యాటింగ్ చేస్తున్నాడని చెప్పుకొచ్చాడు. ఈ వ్యాఖ్యలపై తాజాగా కోహ్లీ స్పందిచాడు.
కోహ్లీ మాట్లాడుతూ… “నేను హాఫ్ సెంచరీ చేసే క్రమంలో నిదానంగా ఆడిన మాట వాస్తవమే. అయితే నేను హాఫ్ సెంచరీ కోసం నిదానంగా ఆడలేదు. కొన్ని సార్లు యాంకరింగ్ ఇన్నింగ్స్ కూడా ఆడాల్సి ఉంటుంది. పవర్ ప్లే తర్వాత ఏ జట్టైనా బెస్ట్ స్పిన్నర్ ని తీసుకొస్తుంది. వారిని మనం గౌరవించాలి. ఈ సమయంలో మనం స్ట్రైక్ రొటేట్ చేయడం చాలా అవసరం. అందుకే ఓ రెండు ఓవర్లు యాంకరింగ్ ఇన్నింగ్స్ ఆడాలని భావించా. బయట వాళ్లకి అక్కడ ఏం జరుగుతుందో తెలియదు. చేతిలో వికెట్లు ఉన్నప్పుడు భారీ షాట్ల మీదే కాదు వికెట్లు పడకుండా చూసుకోవడం కూడా ముఖ్యమే అని కోహ్లీ చెప్పుకొచ్చాడు.మరి సిమన్ డౌల్ కి కోహ్లీ ఇచ్చిన రిప్లై మీకేవిధంగా అనిపించిందో కామెంట్ల రూపంలో తెలపండి.