సౌతాఫ్రికాతో సోమవారం ప్రారంభమైన రెండో టెస్టులో విరాట్ కోహ్లీ బరిలో దిగలేదు. అతని స్థానంలో హనుమ విహారి జట్టుతో చేరాడు. కాగా కోహ్లీ స్థానంలో కెప్టెన్గా కేఎల్ రాహుల్ వ్యవహారించనున్నాడు. విరాట్ కోహ్లీ ఈ మ్యాచ్లో ఆడడం లేదన్న రాహుల్ టాస్ కోసం వచ్చిన సమయంలో వెల్లడించాడు. పై వెన్ను నొప్పి కారణంగా కోహ్లీ ఈ మ్యాచ్లో ఆడడం లేదని.. తర్వాతి మ్యాచ్కు అందుబాటులో ఉండాడని ఆశిస్తున్నట్లు చెప్పాడు.
కాగా మ్యాచ్కు ముందు ప్రాక్టీస్ సమయంలోనే కోహ్లీ గాయపడినట్లు సమాచారం. దీంతో అతన్ని పరిశీలించిన ఫిజియో విశ్రాంతి తీసుకోవాలని సూచించినట్లు తెలుస్తుంది. దీంతో విరాట్ రెండో టెస్టుకు దూరమయ్యాడు. కాగా మూడోదైన చివరి టెస్టులో ఆడే అవకాశం ఉన్నట్లు తెలస్తుంది. మరి కోహ్లీ లేకుండా టీమిండియా బరిలోకి దిగడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Back spasm rules out Captain Kohli from the 2nd Test. Drop a ❤️ to wish King a speedy recovery! 🙌🏻🙌🏻
Hope to see you on the field for the 3rd Test Skip! #PlayBold #TeamIndia #SAvIND pic.twitter.com/OzKfUZXex6
— Royal Challengers Bangalore (@RCBTweets) January 3, 2022
“Unfortunately, Virat has had an upper-back spasm, hopefully, he’ll recover well for the next Test.” – KL Rahul.
— CricTracker (@Cricketracker) January 3, 2022