క్రికెట్ లో దురదృష్టకర సంఘటనలు జరుగుతుండడం సహజం. ఇలాంటి ఘటనల్లో ఆటగాళ్లు ప్రాణాలు కూడా కోల్పోతుంటారు. ఆస్ట్రేలియా క్రికెటర్ ఫిలిప్ హ్యూజెస్ మరణమే అందుకు ప్రత్యక్ష సాక్ష్యం. సీన్ అబోట్ వేసిన రాకాసి బౌన్సర్ అతని ప్రాణాలు తీసుకుంది. అలాంటి ఘటన దేశ వాలీ టోర్నీ అయిన దులీప్ ట్రోఫీలో చోటుచేసుకుంది. బౌలర్ త్రో విసిరడంతో టీమిండియా ఆల్ రౌండర్ వెంకటేశ్ అయ్యర్ తలకు బలమైన గాయమయ్యింది. ఆ వివరాలు..
దులీప్ ట్రోఫీలో భాగంగా వెస్ట్ జోన్, సెంట్రల్ జోన్ మధ్య జరుగుతున్న సెమీఫైనల్ మ్యాచులో ఈ సంఘటన చోటుచేసుకుంది. వెస్ట్ జోన్ పేసర్ చింతన్ గజా వేసిన ఓవర్లో అయ్యర్.. బౌలర్ దిశగా స్ట్రైట్ ఢిపెన్స్ ఆడాడు. ఈ క్రమంలో బాల్ అందుకున్న గజా, కీపర్ వైపు త్రో విసిరాడు. అది కాస్తా అయ్యర్ తలకు తగలడంతో.. ఆతను మైదానంలోనే కుప్పకూలాడు. ఫిజియో వచ్చి వైద్యం అందించినప్పటికీ అతడి నొప్పి తగ్గలేదు. ఈ క్రమంలో అతడిని తీసుకెళ్లళ్లడానికి అంబులెన్స్ కూడా గ్రౌండ్ లోకి వచ్చింది.
#VenkateshIyer is down in pain after being hit by a wild throw form bowler #ChintanGaja on his follow through on the second day of the #DuleepTrophy semifinal in #Coimbatore#cricket #tournament #champion #ambulance #injury #getwellsoon #sportzcraazy #followus #update pic.twitter.com/oNIDx0rgo7
— SportzCraazy (@sportzcraazy) September 16, 2022
గజా బౌలింగ్ లో 6 కొట్టిన నెక్స్ట్ బాల్ కే ఈ సంఘటన జరిగినట్లుగా తెలుస్తోంది. కోపంతోనే గజా విసిరికొట్టినట్లు సమాచారం. గాయంతోనే అయ్యర్ ఫీల్డ్ ను వదిలాడు. ఈ ఘటనతో ఆటగాళ్లందరూ ఒక్కసారిగా వులిక్కిపడ్డారు. అయితే.. ఎలాంటి చెడు జరగకపోవడంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్నాయి. ఈ విషయంపై, మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.