స్పిన్‌కు అనుకూలిస్తున్న పిచ్‌పై పేసర్ ఉమేష్ యాదవ్ శివతాండవం చేశాడు. అతని దెబ్బ ఆస్ట్రేలియా వికెట్లు గాల్లో పల్టీలు కొట్టాయి. తొలి రోజు పటిష్ట స్థితిలో నిలిచిన ఆస్ట్రేలియా.. రెండో రోజు తొలి సెషన్‌లోనే చతికిలపడింది.
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2023లో భాగంగా ఇండోర్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్టు రెండో రోజు ఉమేష్ యాదవ్ నిప్పులు చెరుగుతున్నాడు. స్పిన్ పిచ్ బాబోయ్ అని మొత్తుకుంటున్న వారందరికీ.. తన రియల్ పేస్ ఎలా ఉంటుందో రుచిచూపించాడు. తొలి రోజు భారత్‌ను 109 పరుగులకే ఆలౌట్ చేసిన ఆస్ట్రేలియా. తొలి ఇన్నింగ్స్‌లో 4 వికెట్ల నష్టానికి 156 పరుగులు చేసి తొలి రోజును ముగించింది. 156 పరుగుల ఓవర్‌నైట్ స్కోర్‌తో రెండో రోజు ఇన్నింగ్స్ ఆరంభించిన ఆస్ట్రేలియా 197 పరుగులకే ఆలౌట్ అయింది. 41 పరుగుల వ్యవధిలో 6 వికెట్లు కోల్పోయింది. రెండో రోజు బ్యాటింగ్‌కు వచ్చిన హ్యాండ్స్‌కాంబ్, కామెరున్ గ్రీన్ తొలి సెషన్‌లో ఆచితూచి బ్యాటింగ్ చేశారు.
ఈ జోడీని రవిచంద్రన్ అశ్విన్ విడదీశాడు. ఆస్ట్రేలియా స్కోర్ 186 పరుగుల వద్ద హ్యాండ్స్‌కాంబ్, షార్ట్ ఫీల్డ్‌లో ఉన్న శ్రేయస్ అయ్యర్‌కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఆ వెంటనే ఉమేష్ యాదవ్ కామెరున్ గ్రీన్‌ను లెగ్ బిఫోర్‌గా అవుట్ చేశాడు. ఉమేష్ పేస్‌ను ఏ మాత్రం అంచనా వేయలేకపోయిన గ్రీన్.. వికెట్ సమర్పించుకున్నాడు. 57 బంతుల్లో 21 రన్స్ చేసి గ్రీన్ పెవిలియన్ చేరాడు. వీళ్లిద్దరూ అవుటైన తర్వాత ఆస్ట్రేలియా ఆలౌట్ అయ్యేందుకు ఎక్కువ సమయం పట్టలేదు. అశ్విన్, ఉమేష్ యాదవ్ రెండు వైపుల నుంచి ఒకరు గింగిరాలు తిరిగే స్పిన్‌తో మరొకరు కళ్లు బౌర్లు కమ్మే పేస్‌తో దాడి చేయడంలో ఆసీస్ లోయరార్డర్ ఉక్కిరిబిక్కిరైంది. 9 పరుగుల తేడాతో ఆస్ట్రేలియా చివరి నాలుగు వికెట్లను కోల్పోయింది.
ఇందులో ఉమేష్ యాదవ్ మూడు వికెట్లు పడగొట్టగా.. ఒక లెగ్ బిఫోర్‌తో పాటు రెండు క్లీన్ బౌల్డ్‌లు చేశాడు. ముఖ్యంగా మిచెల్ స్టార్క్‌ను అవుట్ చేసిన విధానం అయితే కనుల విందుగా ఉంది. ఉమేష్ పేస్ దెబ్బకు ఆఫ్ స్టంప్ గాల్లోకి ఎగిరి పల్టీలు కొట్టుకుంటూ.. వికెట్ కీపర్ దగ్గరకి వెళ్లిపడింది. ఆ వికెట్‌కు సంబంధించిన వీడియోలు, ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. స్టార్క్ వికెట్‌తో పాటు టాడ్ మర్ఫీ వికెట్‌ను కూడా ఉమేష్ యాదవ్ గాల్లో పల్టీలు కొట్టించాడు. ఈ ఇన్నింగ్స్‌లో ఉమేష్ మూడు వికెట్లు తీసుకోగా.. అశ్విన్ మూడు, జడేజా నాలుగు వికెట్లు తీసుకున్నాడు. దీంతో ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 88 పరుగుల లీడ్ సాధించింది. మరి రెండు ఇన్నింగ్స్‌లో భారత బ్యాటర్లు ఎలాంటి ప్రదర్శన చేస్తారనే దానిపైనే ఈ మ్యాచ్ ఫలితం ఆధారపడి ఉంది. మరి ఈ మ్యాచ్‌లో ఉమేష్ బౌలింగ్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
#BGT2023 #INDvAUS #UmeshYadav pic.twitter.com/lm1heum3nF
— Sayyad Nag Pasha (@nag_pasha) March 2, 2023
Picture of the day: Umesh Yadav at its best. pic.twitter.com/yCXzhirkRA
— Johns. (@CricCrazyJohns) March 2, 2023
Umesh Yadav is unstoppable. pic.twitter.com/pMNLlfBkhm
— Johns. (@CricCrazyJohns) March 2, 2023
What a ripper from Umesh Yadav. pic.twitter.com/MckFu7VgpZ
— Johns. (@CricCrazyJohns) March 2, 2023
What a peach from Umesh Yadav to reach 100 Test wickets at home.
An absolute gun pacer at home! pic.twitter.com/rG6EkP8Un4
— Mufaddal Vohra (@mufaddal_vohra) March 2, 2023